ఆ ఇంటికి తలుపు లేదు

ఆ ఇంటికి తలుపు లేదు ఈ ఇంటికి గడియ లేదు అన్నట్టు అన్నది జాతీయం. అంటే ఒకదానికంటే మరొకటి మరీ నాసి రకమైనది అనే అర్థంలో ఈ జాతీయం వాడుతుంటారు. సాధారణంగా ఇంటికి తలుపు రక్షణ కల్పిస్తుంది. అలాంటిది ఓ ఇంటికి ఉన్న తలుపులకు గడియలేదట. అయినా వారు తలుపులను దగ్గరగా వేసుకొని కొద్దిపాటి రక్షణనైనా పొందేందుకు వీలుంది. కానీ మరో ఇంటికి అసలు తలుపులే లేవట అంటే ఒకదాని కన్నా మరొకటి తీసివేత వ్యవహారమని చెప్పవచ్చు. ఇలా చెప్పాల్సిన సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

 

సేకరణ: ఈనాడు.నెట్