నీరులేని పైరు నూనె లేని జట్టు

కొన్ని జాతీయాలు ఆరోగ్య సూత్రాలను నేర్పేవిగా కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఇదొకటి. పైరు చక్కగా ఏపుగా పెరిగి పంట పండాలంటే నీరు బాగా ఉండాలి. అలాగే మనిషికి అలంకారంగా ఉండే నెత్తిమీది జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే దానికి నూనె రాస్తుండాలి. అని పెద్దలు పిల్లలకు చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

 

సేకరణ: ఈనాడు.నెట్