ఈ జొన్న కూటికా ఈ స్తోత్ర పాఠమన్నట్టు

కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కని సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. జొన్న అన్నం కన్నా వరి అన్నం గొప్ప అని భావించే రోజుల్లో ఇది ఆవిర్భవించింది. ఒక వ్యక్తి ఒక సంపన్నుడి దగ్గరకు వెళ్లి స్తోత్రం చేశాడట (పొగిడాడట). ఎంతోసేపు స్తోత్రం చేసిన తర్వాత సంపన్నుడు అంతావిని ఆ పొగిడిన వ్యక్తికి కొద్దిగా జొన్న అన్నం మాత్రమే పెట్టాడట. తాను పొగిడిన పొగడ్తకు సంపన్నుడు పొంగిపోయి వరి అన్నంతో పాటు అనేక పిండివంటలు పెడతాడని భావించిన ఆ వ్యక్తి మాటలే జాతీయమయ్యాయి. ఇదే తీరులో ఎంతో ఎక్కువ ఆశించి పొగిడినప్పుడు ఎదుటివారు కొద్దిగా మాత్రమే ఇచ్చిన సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.