అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టవచ్చు

మనిషి సంఘజీవి. తోటిమనిషి సహాయ సహకారాలు అతడికి ఎప్పుడూ అవసరమవుతాయి. ఒంటరిగా కన్నా మరొకరి తోడుతో తన పనులను చక్కపెట్టగలడు. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. అండ అంటే ఆదుకొనేవారని అర్ధముంది. అన్ని విధాలా ఆదుకొనేవారుంటే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా చెయొచ్చని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.