గంజి తాగటమనేది పేదరికానికి సూచికగా చెబుతారు. కొంతమంది తమకు అన్ని వనరులూ కావలసినంతగా ఉన్నా వాటిని అనుభవించలేక వృథా చేసుకొంటూ లేనివారిలాగానే ఉంటుంటారు. అదెలాగంటే అంతకు ముందుదాకా ఎప్పుడూ గంజి మాత్రమే దొరికేవారికి బియ్యం సరిపోయినంతగా లభించాయట. అయినా అన్నం వండి, ఆ అన్నం తినకుండా గంజి మాత్రమే తాగి పూర్వంలాగానే లేమితో బాధపడ్డారట. అదేమిటీ సరిపోయినంత కూడు (అన్నం) వండుకున్నారుగా అనంటే వండింది గంజి కోసమని చెప్పారట. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.