ఇంటివాణ్ణి లేపి దొంగ చేతికి కట్టె ఇచ్చినట్టు

నమ్మించి మోసం చేయటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఓ వ్యక్తి రాత్రి వేళ ఎదురింటిలోకి దొంగ వెళ్ళడం చూశాడట. చూసిన వాడు దొంగను పట్టుకొని బంధించే ప్రయత్నం చెయ్యక మెల్లగా ఎలాగో ఒకలాగా ఆ ఇంటివాణ్ణి నిద్రలేపి దొంగ ఇంట్లోకి వచ్చాడని, అతడిని ఎదుర్కోమని తాను సాయం ఉంటానని చెప్పి అంతలోనే దొంగ చేతికి కట్టె ఇచ్చి ఆ దొంగను ఇంటివాడి మీదకు వెళ్ళేలా చేశాడట. ఈ సంఘటనలోని భావం ఆధారంగా ఇలాంటివి ఎక్కడ జరిగినా ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.