మానవ స్వభావాల విశ్లేషణను కూడా మన జాతీయాలు తమలో పొందుపరచుకొని ముందు తరాలకు అందిస్తుంటాయనటానికి ఈ జాతీయం ఒక ఉదాహరణ. సృష్టిలో సున్నితమైన మనస్తత్వంగల స్త్రీ మానవీయతను ప్రకటిస్తుంది. పురుషుడికి కోపం వస్తే ప్రతీకారం తీర్చుకొనేదాకా వూరుకోడు. కానీ స్త్రీ అలాకాదు. ఆమె మనస్సు వెన్న. ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా, వేడి తగిలిన వెన్నలాగా ఆమె మనస్సు కరిగిపోతుంది అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.