స్థాయిని మరచి వ్యవహరించటం, ఆర్థిక స్థోమతకు మించి ఆలోచించటం అనే అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పెద్దపెద్ద భవనాలు, భవంతులలో ప్రత్యేకంగా గదులుండటం, వాటిలో అందంగా పందిరి మంచాలుండటం బాగా ఉంటుంది. కానీ చిన్న పూరి గుడిసెలో పెద్ద పందిరి మంచాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే లోపల చోటు సరిపోకపోగా చూడటానికి కూడా బాగా ఉండదు. కనుక స్థాయికి తగ్గట్టుగా మాత్రమే ఏ వ్యవహారాలైనా సాగాలని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.