ఏనుగునెక్కి కుక్క అరుపులకు దడిచినట్టు

ఏనుగును ఉత్తమ జంతువుగా, కుక్కను నీచ జంతువుగా చెబుతారు. అలాగే ఏనుగునెక్కటం అంటే కీర్తిని పొందటంతో సమానంగా కూడా చెబుతారు. ఏనుగు వీధిలో వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి అని ఓ సామెత ఉంది. అంటే ఉత్తములు ఏదైనా పని చేస్తున్నప్పుడు నీచులు వంకలు పెడుతుంటారన్నది దీని అర్థం. ఇదే తీరులో కీర్తిని సంపాదించినప్పుడు, మంచి పనిని చేస్తున్నప్పుడు నీచులు, దుర్మార్గులు అనే మాటలను విని దడుచుకోకూడదు. ధైర్యంతో ముందుకు సాగుతూనే ఉండాలి అని తెలియచెప్పే కథా సందర్భంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.