అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే..

అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే దిబ్బడి నెత్తి సుబ్బడు కొట్టాడన్నది జాతీయం. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అనే దానికి సమానార్థకమిది. ఎవరూ ఎవరికంటే అధికులు కారని, తామే గొప్ప అని ఎవరూ ఎప్పుడూ గర్వాహంకారాలకుపోకూడదని హెచ్చరించే సందర్భాలలో పెద్దలు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. అబ్బడు, దిబ్బడు, సుబ్బడు అనేవి తెలుగునాట గ్రామ ప్రాంతాలలో ముద్దుగా పిలుచుకునే పేర్లు. పేర్లు ఏవైనా గర్వాహంకారాలు పనికిరావన్నదే ఈ జాతీయం ఇచ్చే సందేశం.