కదలనీయకుండ గట్టిగా లింగంబు

పధ్యం:: 

కదలనీయకుండ గట్టిగా లింగంబు 
కట్టివేయనేమి ఘనత కలుగు 
భావమందు శివుని భావించి కానరా 
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము: 
పెద్ద శివలింగాన్ని కదలకుండా మెడలో కట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. మనస్ఫూర్తిగా శివుడిని ధ్యానించి సేవిస్తే చాలు.