కలిమిగల్గనేమి కరుణ లేకుండిన

పధ్యం:: 

కలిమిగల్గనేమి కరుణ లేకుండిన 
కలిమి తగునె దుష్టకర్ములకును 
తేనెగూర్పనీగ తెరువున బోవదా 
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము: 
సంపద ఉన్నా, జాలి, దయ లేకపోతే ఆ సంపద నశిస్తుంది. తేనేటీగలు కూర్చిన తేనే ఆ ఈగలకు దక్కని విధంగా దుష్టుల సంపదలు కూడా వారికి దక్కవు.