గోడకేసిన సున్నం

మనం ఏదో ఆశించి వెచ్చించేవాటిలో కొన్నిసార్లు ఆ వెచ్చించిన ధనం ఇక ఏపరిస్థితులలోనూ వెనక్కిరాదనుకున్నప్పుడు ఉపయోగంచే జాతీయమిది. తిరిగిరాని పెట్టుబడిని గోడకు వేసినసున్నం అంటుంటారు. శుభ కార్యాల్లాంటి సందర్భాలలో ఇళ్ళ గోడలకు వెల్లవేస్తుంటారు. అలా వెల్లవేసేటప్పుడు ఉపయోగించే సున్నం అంతకుముందు రాళ్ళ రూపంలో ఉంటుంది. ఆరాళ్ళును నీళ్ళతో పోసి నీరు సున్నాన్ని గోడకు వేసిన తర్వాత ఆగోడలు తెల్లగా, అందంగానే ఉంటాయి. కానీ ఆ శుభకార్యాలు ముగిసిన తర్వాత మళ్ళిమన సున్నం మనకు రాళ్ళ రూపంలోనో లేదా నీరుసున్నం రూపంలోనో కనుపించాలంటే అది అయ్యేపనికాదు. ఇలా కొన్ని కొన్ని సందర్భలలో కొన్ని చోట్ల మనం పెట్టే పెట్టుబడి ఏపరిస్థితులలోనూ తిరిగిరాదు. ఆడంబారాలకు విలాసాలకు చేసే ఖర్చు గోడకు వేసిన సున్నం లాంటిదే. మరికొందరు అప్పులు చేయడంలో సిద్దహస్తులుంటారు. వారి అతితెలివి తేటలను గమనించలేక కొంతమంది వారికి అప్పిస్తుంటారు. అలా అప్పిచ్చిన సొమ్ముంతా గోడకు వేసిన సున్నమే అవుతుంటుంది. ఇలా ఈజాతీయం అనేక సందర్భాలలో తెలుగునాట ప్రచారంలో కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్