అన్నదానమునకు నధిక సంపదగల్గి

పధ్యం:: 

అన్నదానమునకు నధిక సంపదగల్గి 
యమరలోక పూజ్యుడగును మీఱు 
అన్నమగును బ్రహ్మమది కనలేరయా 
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము: 
అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. ఆ దానాన్ని మించిన దానం లేదు. అన్నదానం చేస్తే దేవలోక పూజలు అందుకుంటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం.