గుణములోగలవాని కులమెంచగానేల

పధ్యం:: 

గుణములోగలవాని కులమెంచగానేల 
గుణము కలిగెనేని కోటిసేయు 
గణములేక యున్న గుడ్డిగవ్వయులేదు 
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము: 
గుణవంతుడి కులాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ధనవంతుడు కాకపోయినా గుణం ఉంటే చాలు. గుణహీనుడు చిల్లిగవ్వ విలువ కూడా చేయడు.