తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి

పధ్యం:: 

తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి 
మిగిలి వెడలవేక మిణుకుచున్న 
నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ 
విశ్వదాభిరామ వినురవేమా! 

తాత్పర్యము: 
ప్రతి చిన్న విషయానికి విరక్తి చెంది ఎప్పటికీ దాని నుంచి బయటపడలేక అల్లాడేవాడు బలహీనుడు. ఆ వలలో చిక్కుకొని తప్పించుకోలేక నిర్వీర్యమైపోయేవాడికి ఎట్టి పరిస్థితుల్లోను ముక్తి లభించదు.