తనదు మనసుచేత దర్కించి జ్యోతిష

పధ్యం:: 

తనదు మనసుచేత దర్కించి జ్యోతిష 
మెంత చేసే ననుచు నెంచి చూచు 
తన యదృష్టమంత దైవ మెఱుంగడా 
విశ్వదాభిరామ వినురవేమా! 

తాత్పర్యము: 
తన ప్రయత్నాలు విఫలమైనప్పుడు మూర్ఖుడు జ్యోతిష్యమని, వాస్తుని వ్యర్థ వ్యాఖ్యలు చేసి ఆత్మవంచన చేసుకుంటాడు. తన విధిరాతను బట్టి అలా జరిగిందని భావించడు. తన కర్మల ఫలితమే అలా జరిగిందని, అది దేవుడే అలా చేశాడని గ్రహించడు.