అనువుగాని చోట అధికుల మనరాదు

పధ్యం:: 

అనువుగాని చోట అధికుల మనరాదు 
కొంచెముండుటెల్ల కొదువగాదు 
కొండ యద్దమందు కొంచెమై యుండదా 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము: 
అనువుగాని చోట ఎవరూ తమ ఆధిక్యాన్ని చూపడానికి ప్రయత్నించకూడదు. కొద్దిగా తగ్గివున్నా తప్పులేదు. పెద్ద కొండ సైతం అద్దంలో చిన్నది కనిపిస్తుంది. అలాగే సమయం వచ్చే ఆధిక్యాన్ని ప్రదర్శించకుండా ఒదిగి ఉండాలి.