నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు

పధ్యం:: 

నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు 
నిజములాడకున్న నీతిదప్పు 
నిజములాడునపుడు నీ రూపమనవచ్చు 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: 
వాస్తవాలు, అవాస్తవాలు దేవుడికి తెలుస్తాయి. అందుకే ఎప్పుడూ నిజం మాట్లాడాలి. నీతిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. నిజం చెప్పేవారిని పరమేశ్వర స్వరూపమే అనవచ్చు. నిజాలు చెబితేనే మన వ్యక్తిత్వం సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది.