శ్యామశాస్త్రి

శ్యామశాస్త్రిశ్యామశాస్త్రి, కర్నాటక సంగీతంలో ప్రముఖ వాగ్గేయకార త్రయంలో త్యాగరాజు , ముత్తుస్వామి దీక్షితుల సరసన నిలిచే తెలుగు పెద్దలలో శ్యామశాస్త్రి ప్రముఖులు. శ్యామశాస్త్రి వయస్సులో వారిద్దరికన్నా పెద్దవాడు. శ్యామశాస్త్రి తండ్రి విశ్వనాథ శాస్త్రి. ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు సమీపంలోగల కంభం ప్రాంతీయులు. అయితే, 17వ శతాబ్దంలో తమిళనాడుకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. శ్యామశాస్త్రి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము. అయితే, చిన్నతనంలో ముద్దుపేరుగా శ్యామకృష్ణ గా పిలుస్తూ, ఆ పేరే చివరకు వ్యవహరికంలో సార్ధకమైందని ఆయన శిష్యులు పేర్కొంటారు.

 తండ్రి విశ్వనాధ శాస్త్రి సంస్కృత, తెలుగు భాషలలొ పండితుడు కావడంతో- శ్యామశాస్త్రి చిన్నతనంలో తండ్రి దగ్గరే సంస్కృతాంధ్రభాషలు అభ్యసించాడు. సంగీతంలో తన మేనమామ దగ్గర స్వరపరిచయం కల్గినా, ఆ పిదప తంజావూరులో ‘సంగీత స్వామి’ అనబడే ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసుని దగ్గర, తంజావూరులోని రాజాస్థానంలో సంగీత విద్వాంసుడైన శ్రీ పచ్చిమిరియము ఆది అప్పయ్య సహకారంతో సంగీత శాస్త్రాలలో మర్మములు ఎన్నో అధ్యయనం చేశాడు.

శ్యామశాస్త్రి రచించిన అనేక కీర్తనలు ఉల్లాసం కలిగించేవి, చక్కని లయ, తాళ ప్రదర్శనలకు అనుగుణంగా ఉండేవి. నాడోపాసన ద్వారా ఆత్మానందం సాధించవచ్చని ఆయన అభిప్రాయ పడేవారు. శ్యామశాస్త్రి తెలుగు, తమిళ, సంస్కృత భాషలలొ అనేక కృతులు, కీర్తనలు రచించినా అధికభాగం తెలుగులోనే వ్రాశారు. అయితే, త్యాగరాజు తన కీర్తననలో భావ రాగలకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా, శ్యామశాస్త్రి కీర్తనలలో క్లిష్టమైన ‘తాళ’ రచన చేసినట్లు సంగీతాభిమానులు అంటారు. శ్యామశాస్త్రి కీర్తనలలో క్లిష్టమైన రచనతోపాటు, ఆయనకు శిష్యులు అధిక సంఖ్యలో లేకపోవడం వల్ల కూడా, ఈయన కీర్తనలు అధిక ప్రాచుర్యం పొందలేదని వారు భావిస్తారు. శ్యామశాస్త్రి రచించిన “ప్రోవవమ్మ” , “మాంజిరాగం” అలాగే ‘కల్లడ ’(కలగడ ), ‘చింతామణి ’ రాగాలు, “హిమాద్రిసుతీ ” అనే కీర్తన, ఒకే స్వరంతో సంస్కృతం,తెలుగు భాషలలొ వేరు వేరుగా రాసిన ఆయన కీర్తనలు సంగీత కళాకారులందరికి సుపరిచతమే.

శ్యామశాస్త్రి ప్రసిద్ధి చెందిన ఆనంద భైరవీ, ధన్యాసి, కల్గడ, కళ్యాణి, కాంభోజి, కాపి, చింతామణి వంటి రాగాల్లో కృతులు స్వర పరిచాడు. సంగీత  పాఠాల్లో సరళీ స్వరాలు, జంట స్వరాలు, గీతాలు, స్వరజతులు, వర్ణాలు, కృతులు అనేవి ఒక పద్ధతిలో నేర్పుతారు. వీటిలో స్వరజతి రూపకర్త శ్యామశాస్త్రి. తోడి రాగంలో “రావే హిమగిరి కుమారి”, భైరవి రాగంలో ‘కామాక్షీ అనుదినము’వంటివి కొన్ని ప్రసిద్ధి జెందిన స్వరజతులు.

ఈ స్వరజతులే కాకుండా విలోమ చాపు తాళాన్ని కూడా శ్యామశాస్త్రి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు.  సాధారణంగా చాపు తాళం గతి 3 + 4 పద్ధతిలో ఉంటుంది. ఇలా కాకుండా 4 + 3 రీతిలో తాళ గతిని మార్చి కొన్ని  కీర్తనలు స్వరపరిచాడు. పూర్వి కళ్యాణి రాగంలో ‘నిన్ను వినగ మరి’, ఫరజ్ రాగంలో ‘త్రిలోకమాత నన్ను’  అనేవి ఈ విలోమ చాపు తాళంలో ప్రసిద్ది చెందిన కీర్తనలు.

శ్యామశాస్త్రి తపాలా బిల్లతంజావూరు జిల్లాలో తిరువాయూరులో ఉన్న కామాక్షి  దేవాలయ అర్చకత్వం చేసుకుంటూ, తన గాన కళా పాండిత్యంలో కామాక్షి అమ్మవారి సేవలో, ఆమె సన్నిధానంలోనే ‘ శ్యామకృష్ణ’ అనే ముద్రతో అనేక కీర్తనలు, కృతులు రచించాడయన.

శ్యామశాస్త్రి ఇంటి ఇలవేల్పుగా కామాక్షిదేవిని కీర్తిస్తూ, తమ ఇంటి ‘ఆడపడుచుగా’ అమ్మవారిని భావిస్తూ – అపూర్వం, అనన్య సామాన్య కృతులెన్నింటినో శ్యామశాస్త్రి రచించాడని ఆయన శిష్యులు – ప్రముఖ సంగీత కళారాధకులు పేర్కొంటారు. అందువల్లనే, శ్యామశాస్త్రి తన కీర్తనలలో కొన్నింటిని “శ్యామకృష్ణ  - సహోదరి”  అని పేర్కొన్నట్లు వారు అంటారు.

శ్యామశాస్త్రి కుమారుడు శ్రీ సుబ్బరాయశాస్త్రి కూడా ప్రముఖ వాగ్గేయకారిడిగా ప్రసిద్ది చెందాడు. శ్రీ అలసూరు కృష్ణయ్య , శ్రీ తలగంబాడి పంచనాదయ్య తదితరులు శ్యామశాస్త్రి శిష్యులలో ప్రముఖులు.

కొన్నిశ్యామశాస్త్రి కృతులు

నవరాత్రి దేవి కృతులు : కామాక్షీ నాతో వాదా దయ లేదా , శ్యామశాస్త్రి కృతి, బేగడ రాగం

పల్లవి
కామాక్షీ నాతో వాదా దయ లేదా
కమలాక్షీ నన్నొకని బ్రోచుట భారమా బంగారు (కామాక్షీ)

అనుపల్లవి
తామసము జేసితే నే తాళనమ్మా నీ
నామ పారాయణము విన వేడితినమ్మా మాయమ్మా (కామాక్షీ)

చరణం
శ్యామ కృష్ణ సోదరీ తల్లీ (అంబా) శుక
శ్యామళే నిన్నే కోరియున్నానమ్మా
మాయమ్మయని నే దలచి దలచి
మాటి మాటికి కన్నీరు విడువ లేదా అంబా
నీవు మాటాడకుండిన నే తాళ లేనమ్మా
నీ బిడ్డను లాలించవే దొడ్డ తల్లివే
కామాదుల చపల చిత్త పామరుడై
తిరిగి తిరిగి ఇలలో
కామిత కథలు విని విని
వేసారి నేను ఏమారి పోతునా (కామాక్షీ)

నవరాత్రి దేవి కృతులు : సరోజ దళ నేత్రి హిమ గిరి పుత్రీ , శ్యామశాస్త్రి కృతి, శంకరాభరణం రాగం

పల్లవి
సరోజ దళ నేత్రి హిమ గిరి పుత్రీ
నీ పదాంబుజములే
సదా నమ్మినానమ్మా శుభమిమ్మా
శ్రీ మీనాక్షమ్మా

అనుపల్లవి
పారాకు సేయక వర దాయకీ నీ
వలే దైవము లోకములో గలదా
పురాణీ శుక పాణీ మధుకర వేణీ
సదా-శివునికి రాణీ (సరోజ)

చరణం 1
కోరి వచ్చిన వారికెల్లను
కోర్కెలొసగే బిరుదు గదా అతి
భారమా నన్ను బ్రోవ తల్లి
కృపాలవాల తాళ జాలనే (సరోజ)

చరణం 2
ఇందు ముఖీ కరుణించుమని నిను
ఎంతో వేడుకొంటిని
నాయందు జాగేలనమ్మా మరియాద
గాదు దయావతి నీవు (సరోజ)

చరణం 3
సామ గాన వినోదినీ గుణ
ధామ శ్యామ కృష్ణ నుతా శుక
శ్యామళా దేవీ నీవే గతి రతి
కామ కామ్యద కావవే నన్ను (సరోజ)

హిమాచల తనయ బ్రోచుటకి - శ్యామశాస్త్రి , ఆనందభైరవి రాగం
 

హిమాచల తనయ బ్రోచుటకి
ది మంచి సమయము రావే అంబా ||

కుమార జనని సమానమెవరిల
ను మానవతి శ్రీ బ్రుహన్నాయకి ||

సరోజముఖి బిరాన నీవు
వరాలొసగుమని నేను వేడితి
పురారి హరి సురేంద్రనుత
పురాణి పరా ముఖ మేలనే తల్లి ||

ఉమా హంస గమా తామ
సమా బ్రోవ దిక్కెవరు నిక్కముగ
ను మాకిపుడభిమానము చూపు
భారమా వినుమా దయ తోను ||

సదా నత వర దాయకి ని
జ దాసుడను శ్యామక్రిష్ణ సోదరి
గదా మొర వినవా దురిత
విదారిణి శ్రీ బ్రుహన్నాయకి ||

కనకశైల విహారిణీ అంబ - శ్యామశాస్త్రి , పున్నాగవరాళి రాగం
 

పల్లవి:
కనకశైల విహారిణీ అంబ - కామకోటీ బాలే, సుశీలే
అనుపల్లవి:
వనజభవహరి నుతే దేవి - హిమగిరిజే లలితే సతతం
వినతం మాం పరిపాలయ శంకర - వనితే సతి మహాత్రిపుర సుందరి

చరణం:
1. చండ భండన ఖండన పండితేక్షు
ఖండ కోదండమండితపాణే
పుండరీక నయనార్చిత పద
పురవాసిని శివే హరవిలాసిని

2. కంబుకంఠి కంజసదృశ వదనే
కరిరాజ గమనే మణిసదనే
శంబరవిదారి తోషిణీ
శివ శంకరి సదా మధురభాషిణి

3. శ్యామలాంబికే భవాబ్ధితరణే
శ్యామకృష్ణ పరిపాలిని జననీ
కామితార్ధ ఫలదాయకి
కామాక్షి సకలలోక సాక్షి

నిన్నువినా మరిగలదా గతి లోకములో - శ్యామశాస్త్రి కృతి

రాగం : రీతిగౌళతాళం : త్రిపుట
పల్లవి :నిన్నువినా మరిగలదా గతి లోకములో నిరంజని
నిఖిలజనని మృదాని భవాని అంబ

అనుపల్లవి :
పన్నగభూషణుని రాణి పార్వతి జనని అంబపరాకు
సేయక రాదు విను శ్రీ బృహదంబ వినుము
చ1: పామరునమ్మా దయచేసి వరమీయమ్మా మాయమ్మా
పాపమెల్ల పరిహరిహంచి బిరాన బ్రోచుటకు
చ2: సారములేని భవ జలధి తగులు కోని చాల వేసారితిని నా విచారము దీర్చుటకు

చ3: నా మదిలో అంబ నీవే గతియని నమ్మితి శ్యామకృశ్ణనుతా భక్తపరిపాలనము సేయుటకు

మూలం / సేకరణ: 
వికీపీడియా,"తెలుగు పెద్దలు" పుస్తకం