పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి

పధ్యం:: 

పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి 
బుట్టిరేమి వారు గిట్టరేమి 
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా! 
విశ్వదాభిరామ వినుర వేమా!

తాత్పర్యము: 
సక్రమంగా పెంచి పోషించలేని పిసినారులు, ఇతరులకు ఏ మాత్రం సాయం చేయనివారు బతికి ఉన్నా... చచ్చినా ఒక్కటే. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. చస్తూ ఉంటాయి. అవి పుట్టినా, చచ్చినా ఎలాంటి ప్రయోజనం, ఫలితం ఉండదు. పిసినారులు కూడా అలాంటి చెదలతోనే సమానం.