పప్పులేని కూడు పరులకోసహ్యమే

పధ్యం:: 

పప్పులేని కూడు పరులకోసహ్యమే 
యుప్పులేని వాడె యధిక బలుడు 
ముప్పులేని వాడు మొదటి సుజ్జానిరా 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము: 
పప్పులేని భోజనము రుచించదు. అప్పులేని వాడే గొప్పవాడు. భోగాభాగ్యాలపై ఆశలేని వాడే జ్ఞాని.