పరులమేలు చూసి పలుకాకి వలె

పధ్యం:: 

పరులమేలు చూసి పలుకాకి వలె 
వట్టిమాటలాడు వాడు అధముడు 
అట్టివాని బతుకుటదిఏల మంటికా? 
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము: 
పరుల మేలు చూసి ఓర్వలేని వాడు అధముడు. ఇతరుల శ్రేయస్సును చూసి ఆనందించాలి. అలాకాక అసూయపడేవారి బతుకు నిష్ప్రయోజనం.