Latest posts
-
‘ఆడసింహం’ దుర్గాబాయి దేశ్‌ముఖ్
ఉప్పు సత్యాగ్రహంలో ఆమె పోలీసుల లాటిచార్జి లో తీవ్రంగా గాయపడ్డారు, రక్తం కారుతున్నా ఉప్పు జారవిడవలేదు. అందుకే అప్పటి బ్రిటీష్ అధికారులు ఆమెను ఆడసింహం గా అభివర్ణించారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 – మే 9, 1981) పేరు పొందిన తెలుగు స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి. చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. 1909లో కాకినాదలో జన్మించిన దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో…
-
అన్నగారు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ “ఎన్.టి.ఆర్”
మదరాసులో ఆయన వుండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు ఒక మొక్కుబడిగా మదరాసు వెళ్ళి ఉదయమే ఆయనను దర్శించుకుని వచ్చేవారు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. హైదరాబాదు లోని హుస్సేన్‌సాగర్ కట్టపై ( ట్యాంకుబండ్) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పాడు. “నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ నినదించి, సైనిక దుస్తులు వేసుకుని, తెలుగువారి కీర్తి…
-
“షహెన్షా” సి.కె.నాయుడు
బౌలర్ గా తన ఫస్ట్ క్లాసు కెరీర్ ని మొదలు పెట్టి, బారీ సిక్సర్లతో, సి.కె.నాయుడు అంటే సిక్సర్ల నాయుడు అనిపించుకున్న స్పోర్ట్స్ హీరో ఆయన. భారతదేశ టెస్ట్ క్రికెట్ మొట్టమొదటి కెప్టెన్ సి.కె.నాయుడు, (ఇంగ్లాండ్ తో 1932లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన బారతీయ జట్టుకి కెప్టెన్) కొట్టారి కనకయ్య నాయుడు, 1895, అక్టోబర్ 31న నాగపూర్లో ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజులనుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ…
-
ఛాందస భావాలకు బావాలకు తొలి అడ్డుకట్ట “వేమన”
“విశ్వదాభిరామ వినురవేమ” అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించాడని అంటున్నారు. ఆయన నందన నామ సంవత్సరము, ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఇతను యవ్వనంలో వేశ్యాలోలుడిగా జీవించాడు. కొంతకాలానికి విరక్తిచెంది,…
-
గురజాడ అప్పారావు గారి రచన ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’
బాల్యవివాహపు ఉక్కుకోరల్లో చిక్కుకొని బలైపోయిన ఒక అమాయక బాలిక దీనగాథ, పాషాణ కఠిన కర్కశ హృదయన్నైనా కరగించి పారేస్తుంది. ఇందులోని ఛందస్సు కూడ క్రొత్తదే. ఈ గేయనాటిక ఒక చక్కని నృత్య గేయనాటికగా ఆంధ్రదేశంలో ఎంతో పేరు గడించింది. గురజాడ సృష్టించిన “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అనే గేయ నాటకం ఇప్పటికీ తెలుగు వారి కంట తడి పెట్టిస్తూనే ఉంది. మేలిమి బంగరు మెలతల్లారా ! కలువల కన్నుల కన్నెల్లారా ! తల్లులగన్నా…
-
గురజాడ అప్పారావు గారి రచన “దేశమును ప్రేమించుమన్నా”
గురజాడ అప్పారావు గారు 1910 సంవత్సరంలో రచించిన ఈ గేయం ప్రజల్లో దేశ భక్తిని ప్రబోధించి, దేశాభివృధ్ధికై ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచింది. దేశమును ప్రేమించుమన్నా మంచి యన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ పాడి పంటలు పొంగిపొరలే దారిలో నువు పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరకులు నింపవోయ్ అన్ని దేశాల్ క్రమ్మవలె…
-
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన: “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి!”
తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. దేశాన్ని మాతగా కీర్తిస్తూ, లయాన్వితింగా సాగిపోయే ఈ గేయం అప్పుడూ ఇప్పుడూ ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగిస్తోంది ప్రకృతి ప్రేమలోనూ, దేశప్రేమలోనూ ఆయన భావుకత్వం ఎంత స్వేచ్ఛగా, హృదయంగమంగా పరవళ్లు తొక్కేదో చూడాలంటే ఆయన రాసిన దేశభక్తి గీతం తప్పక వినాలి జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి! జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి //జయ జయ// (మాకు ప్రియమైన భారతమాతా, దేవభూమీ,…