Latest posts
-
మొదటి ఆధునిక తెలుగు కావ్యం: “ముసలమ్మ మరణం”
డా.కట్టమంచి రామలింగారెడ్డి రచించిన “ముసలమ్మ మరణం”. తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన కావ్యం. ఇది “ముసలమ్మ” అనబడే ఒక గ్రామవనిత యొక్క త్యాగమయ, దయనీయ గాథ.కథకు మూలం చార్లెస్ పి. బ్రౌన్ రచించిన The History of Anantapuram (అనంతపుర చరితం). 1899లో ఆంధ్ర భాషాభిరంజిని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900లో అచ్చయ్యింది. 107 గద్య పద్యాలున్న చంపూ కావ్యం ‘ముసలమ్మ మరణం’ కథ. 17వ పద్యంతో కథ మొదలవుతుంది. 104వ పద్యానికి…
-
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
ఈ పాటను డా. సి. నారాయణ రెడ్డి గారు “తల్లా! పెళ్లామా!” చిత్రం కోసం వ్రాసారు. తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది .. అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా.. తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు…
-
జాషువా
ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. ఈనాడు సంఘసంస్కర్తలకు జాషువా ఆదర్శ పురుషుడు. తెలుగు ప్రజల కవి. భాషా చంధస్సులో భావ కవి. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని ఆయన చెప్పారు. నిత్య జీవితంలో కాని…
-
రవీంద్రనాథ్ ఠాగూర్ – గీతాంజలి
రవీంద్రుని రచనలలో గీతాంజలి చాలా గొప్పది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. రవీంద్రుని గీతాంజలిలో విస్తృతంగా జనప్రియమైన రచన, ఎక్కడ మనస్సు నిర్భయంగావుంటుందో, ఎక్కడమానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో, ఎక్కడవిజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో, ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో, ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,…
-
దాశరథి కృష్ణమాచార్యులు
తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, “దాశరధి”గా ప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా గొంతెత్తి… ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్నుబోలినరాజు మాకెన్నడేని తీగెలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాలవీణ అని ఎలుగెత్తి సభలలో…
-
మా లోగో
లోగో గురించి: పసుపు, కుంకుమ రంగులు మన సంస్కృతి కి చిహ్నాలుగా వాడటం జరిగింది. మధ్యలో ఉన్న చిహ్నం మన పూర్వీకులైన “శాతవాహనులు” కు గుర్తుగా తీసుకోవటం జరిగింది. ఇది “ఉజ్జయిని చిహ్నం”, (ఒక + గుర్తులో నాలుగు అంచుల వద్ద నాలుగు వృత్తాలు). శాతవాహనులు వారి రాజధాని అయిన ఉజ్జయిని నగరానికి గుర్తుగా ఈ చిహ్నాన్ని తమ నాణేల పైన ముద్రించారు. క్రింద, “దేశ బాషలందు తెలుగు లెస్స” అని శ్రీనాధుడు మరియు శ్రీ కృష్ణదేవరాయులు…
-
వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతల వివరములు
తెలుగుబాష యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక వ్యాసము వ్రాసి పంపమని చేసిన మా విజ్ఞప్తికి స్పందించి, రాష్ట్ర వ్యాప్తంగా 70 పాఠశాలల నుండి 475 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యానికి మా కృతజ్ఞతలు మా విజ్ఞప్తి మేరకు, యాజమాన్యం వారు, వారి పాఠశాల స్థాయిలో వ్యాసరచన పోటీని నిర్వహించి, వాటిలో నుండి కొన్ని ఉత్తమమైన ప్రతులను మాకు తపాలా మరియు ఇ-మెయిల్ ద్వారా పంపటం జరిగింది. పాల్గొన్న విద్యార్థులకు మా అభినంధనలు విద్యార్థులు అందరూ…
-
గోడకేసిన సున్నం
మనం ఏదో ఆశించి వెచ్చించేవాటిలో కొన్నిసార్లు ఆ వెచ్చించిన ధనం ఇక ఏపరిస్థితులలోనూ వెనక్కిరాదనుకున్నప్పుడు ఉపయోగంచే జాతీయమిది. తిరిగిరాని పెట్టుబడిని గోడకు వేసినసున్నం అంటుంటారు. శుభ కార్యాల్లాంటి సందర్భాలలో ఇళ్ళ గోడలకు వెల్లవేస్తుంటారు. అలా వెల్లవేసేటప్పుడు ఉపయోగించే సున్నం అంతకుముందు రాళ్ళ రూపంలో ఉంటుంది. ఆరాళ్ళును నీళ్ళతో పోసి నీరు సున్నాన్ని గోడకు వేసిన తర్వాత ఆగోడలు తెల్లగా, అందంగానే ఉంటాయి. కానీ ఆ శుభకార్యాలు ముగిసిన తర్వాత మళ్ళిమన సున్నం మనకు రాళ్ళ రూపంలోనో లేదా…
-
గొర్రెలకు తోడేలు కాపరి అన్నట్టు
సంరక్షణ బాధ్యతలను అమాయకంగా నమ్మి మోసగాళ్లు, శత్రువులకు అప్పగించిన సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గొర్రె తోడేలుకు ఆహారం. అలాంటిది ఆ తోడేలును గొర్రెలకు కాపలాగా ఉంచితే ఏం జరుగుతుందో ఎవరైనా వూహించవచ్చు, ఈ వూహ ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. ''విషయమంతా ఆయన దగ్గర చెప్పటమంటే గొర్రెలకు తోడేలును కాపలాగా ఉంచినట్టే'' అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం: ఈనాడు.నెట్
-
గంధద్రవ్యాలు మోసినా గాడిద గాడిదేనన్నట్టు
కొంతమంది ఎన్ని మంచి మాటలు చెప్పినా మరెంతమంది సత్పురుషులు వారి చుట్టూనే ఉన్నా వారి మనస్సు మాత్రం మారదు. దుర్మార్గం వైపే వారి అడుగులు పడుతూ ఉంటాయి. అలాంటి వారిని గురించి తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అనే నానుడికి సరిసమానంగా దీన్ని చెబుతారు.