Latest posts

  • కాలరాయటం

    అణిచివేయటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కాలితో తన్నటం అన్నా, కాలును ఉపయోగించి ఏదైనా వస్తువును దూరంగా విసిరేయటం అన్నా అవమానం, అసహ్యం లాంటి వాటికి ప్రతీకలుగా కనిపిస్తాయి. అంటే తనకు గిట్టని వాటిని అవమానించేందుకు మనిషి కాలును ఉపయోగిస్తుంటాడు. ఈ భావానికి అనుగుణంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. కొన్నికొన్ని చోట్ల నీతినియమాలను, హక్కులను, అధికారాలను అణిచివేశారు అని చెప్పే సందర్భాలలో కూడా ఈ జాతీయం కనిపిస్తుంది. 'ఆ వర్గం వారి హక్కులను కాలరాస్తున్న…

    Read more

  • అప్పు తీసుకుంటే చెప్పు చేతలలో ఉండాలి

    పూర్వకాలం నాటి పెద్దలు అనవసరంగా అప్పులు చేయవద్దని పిల్లలను హెచ్చరించే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. అప్పు నిప్పు అని కూడా అంటుంటారు. అప్పుంటే ముప్పు అని చెబుతుంటారు. ఇదంతా ఆర్థికపరంగా జాగ్రత్తపడమని, అనవసరమైన ఖర్చులు చేసి అప్పులపాలు కావద్దని తెలియచెప్పేందుకే ఒకరి దగ్గర అప్పు తీసుకుంటే ఆత్మాభిమానాన్ని వదులుకొని చెప్పిందే చేయాల్సి వస్తుందన్నది ఈ జాతీయం వెనుక ఉన్న భావం. అప్పు తీసుకొని అభివృద్ధి పనులకు ఉపయోగిస్తూ సక్రమంగా అప్పు తీర్చేవారికి ఇది అన్వయించకపోయినా ముందు…

    Read more

  • మెరుపు దీపమవుతుందా అన్నట్టు

    తాత్కాలికమైనవి ఏవీ శాశ్వతమైన ఆనందాన్ని లేదా ప్రయోజనాలను చేకూర్చలేవని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఆకాశంలో క్షణకాలంపాటు మెరిసే మెరుపులు కాసేపు మంచి కాంతినే ఇస్తాయి. ఇంకా చెప్పాలంటే మామూలు దీపాలకన్నా ఎక్కువ కాంతినే ఇస్తాయి. అంత మాత్రం చేత ఆ మెరుపులను దీపాలకు ప్రత్యామ్నాయంగా వాడాలంటే సాధ్యమయ్యే పనికాదు. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.   సేకరణ: ఈనాడు.నెట్

    Read more

  • వేసిన వత్తికి పోసిన చమురుకు సరిపోయిందన్నట్టు

    ఆదాయ వ్యయాలు సరిచూసుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. అలాగే పడిన శ్రమకు దక్కిన ఫలితానికి సరిపోయిందని చెప్పే సందర్భాలలో కూడా ఈ జాతీయ ప్రయోగం వాడకంలో ఉంది. ప్రమిదలో దీపం వెలిగించేందుకు వేసిన వత్తి, పోసిన చమురు సరితూకంగా ఉన్నాయని చెబుతూనే అంతరార్థంగా ఆదాయ వ్యయాలను వత్తి, చమురులతో పోల్చటం ఇక్కడ విశేషం.   సేకరణ: ఈనాడు.నెట్

    Read more

  • గుడిసెకు చాందినీ అన్నట్టు

    అసంబద్ధమైన వ్యవహారం, అనవసరమైన అలంకారం అనే అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. చాందినీలను గొప్పగొప్ప అలంకారాలకు గుర్తుగా చెబుతారు. అలాంటి ఎంతో సుందరమైన చాందినీ చక్కటి భవనం ముందుంటే ఆ భవనపు అందం ఇనుమడిస్తుంది. ఆ చాందినీ వేసినందుకు సార్థకత చేకూరుతుంది. అలాకాక ఏదో చిన్న గుడిసె ముందు అంత భారీ అందమైన చాందినీని వేస్తే నిరర్థకంగా అనిపిస్తుంది. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.   సేకరణ: ఈనాడు.నెట్

    Read more

  • గురువుకు తిరుమంత్రం చెప్పినట్లు

    కొంతమంది అన్ని విషయాలలోనూ తామే గొప్ప అని భావించుకొంటుంటారు. అలాంటివారు తమకంటే గొప్పవారి దగ్గర అల్పమైన తమ గొప్పతనాలను ప్రకటించుకొంటున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంటుంది. మంత్రజపం, సాధన చేయటంలో గురువు ఎప్పుడూ ముందడుగులోనే ఉంటాడు. కానీ ఓ శిష్యుడు తాను గురువును మించిన వాడినని భావించుకొంటూ ఆ గురువుకే మంత్రోపదేశం చేయబోయాడట. ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఎదురైనప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

    Read more

  • తేనె పోసి పెంచినా వేపకు చేదుపోనట్టు

    ఎంతగా నీతులు బోధించినా మనసు మారని దుర్మార్గులను గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. వేపకు చేదు సహజ లక్షణం. నీళ్లకు బదులు తేనె పోసి ఆ చెట్టును పెంచినా చేదు పోయే అవకాశం లేదు. అలాగే దుష్ప్రవర్తన అనే సహజ లక్షణం ఉన్న వారిని ఎంతగా మంచిగా పెంచాలని చూసినా మారరని పెద్దలు విసిగిపోయి మాట్లాడే సందర్భాలలో ఈ జాతీయం వినిపిస్తుంటుంది.   సేకరణ: ఈనాడు.నెట్

    Read more

  • అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం వూడిపోయినట్టు

    మేలు జరుగుతుందని ఆశపడినప్పుడు అనుకున్న మేలు జరగకపోగా మరికొంత కీడు వచ్చిపడ్డ సందర్భాలలో ఈ జాతీయప్రయోగం కనిపిస్తుంది. ఓ వ్యక్తి దరిద్రంతో బాధపడుతూ తనకు కావలసిన అన్నం, వస్త్రాలు ఎవరో దానం చేస్తానంటే వెళ్ళాడట. కానీ అక్కడి పరిస్థితి మారిపోయి ఆ ప్రదేశంలో ఎదురైన కొంతమంది ఉన్న వస్త్రాన్ని కూడా లాక్కున్నారట. ఈ భావన ఆధారంగానే లాభం వస్తుందనుకున్నప్పుడు ఆశించిన లాభం రాకపోగా అనుకోని నష్టం ప్రాప్తించినప్పుడు కూడా ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

    Read more

  • ధనమొస్తే దాచుకోవాలి.. రోగం వస్తే చెప్పుకోవాలి

    సమాజంలో మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తెలియచెప్పేందుకు ఈ జాతీయం ఉపకరిస్తుంది. ధనం ఉంది కదాని ముందూ వెనుకా చూసుకోకుండా ఖర్చుపెట్టకూడదు… దాచుకోవాలి. అలాగే రోగం వస్తే వైద్యుడికి చూపించుకోకుండా చెప్పకుండా ఉండకూడదు. చెప్పి తగిన మందు తీసుకుని రోగాన్ని తగ్గించుకోవాలి అనే విషయ సూచనకు ఈ జాతీయం ఉపకరిస్తుంది.

    Read more

  • ఆరు రాజ్యాలు జయించవచ్చును కానీ…

    ఆరు రాజ్యాలు జయించవచ్చును కానీ అల్లుణ్ణి జయించలేమన్నది జాతీయం. వివాహ వ్యవస్థలో బాగా బెట్టుచేస్తూ గర్వాహంకారాలను ప్రదర్శిస్తూ ఉండే అల్లుళ్లతో విసిగి వేసారిన వారు మాట్లాడుకునే సందర్భాలలో ఈ జాతీయం వినిపిస్తుంది. అల్లుడు అనగానే అంతకు ముందుదాకా లేని గర్వాన్ని తెచ్చిపెట్టుకొనే సంకుచిత మనస్తత్వం ఉన్నవారు సమాజంలో చాలాచోట్ల కనిపిస్తుంటారు. వారిని సంతృప్తిపరచటం తమవల్ల కావటం లేదని అనుకొనే సందర్భాలలో ఇది ప్రయోగంలో కనిపిస్తుంది.   సేకరణ: ఈనాడు.నెట్

    Read more