Latest posts

  • కోకలు వెయ్యి ఉన్నా కట్టుకొనేది ఒకటే

    కొంతమంది తామెంతో భాగ్యవంతులమని విర్రవీగుతుంటారు. అలాంటివారి గర్వాన్ని నిరసిస్తూ చెప్పే జాతీయం ఇది. జాతీయాలు వాస్తవ పరిస్థితులను ఉదాహరణలుగా చూపి సంఘటనలను సందర్భాలను సమీక్షిస్తూ విమర్శిస్తుంటాయనటానికి ఇదొక ఉదాహరణ. పెట్టెనిండా కోకలున్నాయని ఒకామె తెగ గర్వపడసాగిందట. అన్ని కోకలుంటే అన్నిటినీ ఒకేసారి కట్టుకో చూద్దామని ఎదుటివారు అన్నారట. అది సాధ్యమయ్యే పనికాదు. అలాగే ఎన్ని సంపదలున్నా పొట్టపట్టినంత వరకు మాత్రమే ఎవరైనా తినగలరు. అవకాశం ఉన్నంతవరకు మాత్రమే ఎవరైనా ఏపనైనా చేయగలరు అనే విషయాన్ని తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు…

    Read more

  • ఇంటివాణ్ణి లేపి దొంగ చేతికి కట్టె ఇచ్చినట్టు

    నమ్మించి మోసం చేయటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఓ వ్యక్తి రాత్రి వేళ ఎదురింటిలోకి దొంగ వెళ్ళడం చూశాడట. చూసిన వాడు దొంగను పట్టుకొని బంధించే ప్రయత్నం చెయ్యక మెల్లగా ఎలాగో ఒకలాగా ఆ ఇంటివాణ్ణి నిద్రలేపి దొంగ ఇంట్లోకి వచ్చాడని, అతడిని ఎదుర్కోమని తాను సాయం ఉంటానని చెప్పి అంతలోనే దొంగ చేతికి కట్టె ఇచ్చి ఆ దొంగను ఇంటివాడి మీదకు వెళ్ళేలా చేశాడట. ఈ సంఘటనలోని భావం ఆధారంగా ఇలాంటివి…

    Read more

  • కూడు వండటం గంజికోసమన్నట్టు

    గంజి తాగటమనేది పేదరికానికి సూచికగా చెబుతారు. కొంతమంది తమకు అన్ని వనరులూ కావలసినంతగా ఉన్నా వాటిని అనుభవించలేక వృథా చేసుకొంటూ లేనివారిలాగానే ఉంటుంటారు. అదెలాగంటే అంతకు ముందుదాకా ఎప్పుడూ గంజి మాత్రమే దొరికేవారికి బియ్యం సరిపోయినంతగా లభించాయట. అయినా అన్నం వండి, ఆ అన్నం తినకుండా గంజి మాత్రమే తాగి పూర్వంలాగానే లేమితో బాధపడ్డారట. అదేమిటీ సరిపోయినంత కూడు (అన్నం) వండుకున్నారుగా అనంటే వండింది గంజి కోసమని చెప్పారట. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి…

    Read more

  • అల్లుడికి బెట్టు ఇల్లాలికి గుట్టు

    మన సంస్కృతీ సంప్రదాయాలలోని కొన్ని కొన్ని అంశాలను జాతీయాలు ప్రతిబింబిస్తుంటాయి. అటువంటి వాటిలో ఇదొక జాతీయం. అల్లుడు బెట్టుగా వ్యవహరిస్తుండాలని, ఇల్లాలు ఇంటిలో ఉన్న లొసుగులు బయటపడకుండా గుట్టుగా వ్యవహరిస్తుండాలని తెలియ చెబుతున్నట్లుంటుంది ఈ జాతీయం. మనుషులు ఎక్కడ ఎలా వ్యవహరిస్తుండాలో తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయం వాడటం కనిపిస్తుంది.

    Read more

  • కోడికి గజ్జెలు కడితే…

    కోడికి గజ్జెలు కడితే కుప్ప కుళ్లగించదా అన్నది జాతీయం. కసువు కుప్పలను కుళ్లగించి పొట్టపోసుకోవటం కోడి జీవలక్షణం. ఒకాయన ఓ కోడిని ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాడట. అలా తన పెంపుడుకోడి కసువు కుప్పలను కుళ్లగించటం ఆయనకు బాగాలేదనిపించింది. దాన్ని చక్కగా అలంకరించి కాళ్ళకు గజ్జెలు కడితే ఆ అలంకరణల చక్కదనాన్ని, గజ్జెల గొప్పదనాన్ని చూసుకొంటూ అసహ్యకరమైన కసువు కుప్పలకు కుళ్లగించకుండా ఉంటుందనుకొని ఆ కోడి కాళ్లకు గజ్జెలు కట్టాడట ఆ వ్యక్తి. కానీ కోడి తన సహజమైన…

    Read more

  • అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టవచ్చు

    మనిషి సంఘజీవి. తోటిమనిషి సహాయ సహకారాలు అతడికి ఎప్పుడూ అవసరమవుతాయి. ఒంటరిగా కన్నా మరొకరి తోడుతో తన పనులను చక్కపెట్టగలడు. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. అండ అంటే ఆదుకొనేవారని అర్ధముంది. అన్ని విధాలా ఆదుకొనేవారుంటే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా చెయొచ్చని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

    Read more

  • ఎలుగు సలుగెరిగిన పని

    బాగా నైపుణ్యం ఉన్న పనివాళ్లు చేసే పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఇది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారి మధ్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.పొలం దున్నటానికి నాగలిని ఉపయోగిస్తుంటారు. ఆ నాగలికి దుంపను అమర్చటంలోనే అసలైన పనితనమంతా ఇమిడిఉంది. సరిగా అమర్చకపోతే నేలను దున్నటం వీలుకాదు. దుంప వదులుగా ఉన్నా బాగా ముందుకు బిగిసి ఉన్నా రెండూ ఇబ్బందికరంగానే ఉంటాయి. ఎలుగు ఎక్కువైతే నాగలి కర్ర నేల మీద ఆనదు. కనుక ఎలుగు…

    Read more

  • ఈ జొన్న కూటికా ఈ స్తోత్ర పాఠమన్నట్టు

    కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కని సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. జొన్న అన్నం కన్నా వరి అన్నం గొప్ప అని భావించే రోజుల్లో ఇది ఆవిర్భవించింది. ఒక వ్యక్తి ఒక సంపన్నుడి దగ్గరకు వెళ్లి స్తోత్రం చేశాడట (పొగిడాడట). ఎంతోసేపు స్తోత్రం చేసిన తర్వాత సంపన్నుడు అంతావిని ఆ పొగిడిన వ్యక్తికి కొద్దిగా జొన్న అన్నం మాత్రమే పెట్టాడట. తాను పొగిడిన పొగడ్తకు సంపన్నుడు పొంగిపోయి వరి అన్నంతో పాటు అనేక పిండివంటలు పెడతాడని భావించిన…

    Read more

  • నీరులేని పైరు నూనె లేని జట్టు

    కొన్ని జాతీయాలు ఆరోగ్య సూత్రాలను నేర్పేవిగా కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఇదొకటి. పైరు చక్కగా ఏపుగా పెరిగి పంట పండాలంటే నీరు బాగా ఉండాలి. అలాగే మనిషికి అలంకారంగా ఉండే నెత్తిమీది జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే దానికి నూనె రాస్తుండాలి. అని పెద్దలు పిల్లలకు చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.   సేకరణ: ఈనాడు.నెట్

    Read more

  • ఆ ఇంటికి తలుపు లేదు

    ఆ ఇంటికి తలుపు లేదు ఈ ఇంటికి గడియ లేదు అన్నట్టు అన్నది జాతీయం. అంటే ఒకదానికంటే మరొకటి మరీ నాసి రకమైనది అనే అర్థంలో ఈ జాతీయం వాడుతుంటారు. సాధారణంగా ఇంటికి తలుపు రక్షణ కల్పిస్తుంది. అలాంటిది ఓ ఇంటికి ఉన్న తలుపులకు గడియలేదట. అయినా వారు తలుపులను దగ్గరగా వేసుకొని కొద్దిపాటి రక్షణనైనా పొందేందుకు వీలుంది. కానీ మరో ఇంటికి అసలు తలుపులే లేవట అంటే ఒకదాని కన్నా మరొకటి తీసివేత వ్యవహారమని చెప్పవచ్చు.…

    Read more