Latest posts
-
అన్నం అడిగిన వాడికి సున్నం పెట్టినట్లు
సమాజంలో నిరంతరం ద్రోహచింతనతో ఉండేవారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఉపకారం చేయమని అడగటానికి వెళ్ళిన వ్యక్తికి ఉపకారం చేయకపోగా చేస్తున్నట్లు నటించి అపకారం చేసి అవమానిస్తుంటారు కొందరు. అదెలాంటిదంటే అన్నం పెట్టిమని అడిగిన వ్యక్తికి సున్నం పెట్టడం లాంటిదే. ఈ భావనతోనే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. '' వాడి దగ్గరకు అనవసరంగా వెళ్ళి చెయ్యి చాపాను. అన్నం పెట్టమని అడిగితే సున్నం పెట్టిన తీరులో ఉంది వాడి ప్రవర్తన'' అనేలాంటి ప్రయోగాలున్నాయి.
-
ఆదివారం అందలం ఎక్కనూ లేదు…
'ఆదివారం అందలం ఎక్కనూ లేదు, సోమవారం జోలె కట్టనూ లేదు' అన్నది జాతీయం. సంపదలున్నప్పుడు ముందూ వెనుకా చూడకుండా భోగాలను అనుభవిస్తుంటారు కొంతమంది. ఆ సంపదలు కరిగిపోయాక దుర్భరంగా అప్పుచేస్తూనో, యాచిస్తూనో తిరుగుతుంటారు. ముందుచూపులేనితనానికి ఈ ప్రవర్తన ఓ ఉదాహరణ. అలా కాకుండా జీవితంలో ఎప్పుడూ ఒకే స్థితిలో ఆనందంగా కాలం గడుపుతున్నామని చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. 'ఆయన ముందు చూపున్న మనిషి. ఆదివారం అందలం ఎక్కనూ లేదు, సోమవారం జోలె కట్టనూ…
-
నరం లేని నాలుక…
నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందన్నది జాతీయం. అంటే మాట నిలుపుకోలేకపోవటం, ఇప్పుడు చెప్పింది మరికాసేపటికి కాదనటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. నాలుక అనేది మాటకు ప్రతీకగా, నరం అనే దాన్ని పటుత్వానికి గుర్తుగానూ చెబుతారు. ఈ భావంతోనే మాటమీద పట్టులేకపోవడం, మాట నిలుపుకోలేకపోవటం అనే అర్థాలొచ్చాయి. 'వాడిది నరం లేని నాలుక. వాడి మాటను నమ్మి మోసపోవద్దు' అనే లాంటి ప్రయోగాలున్నాయి.
-
జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా అన్నట్టు
కోపంతో, కసితో దుర్మార్గులు అనుకొన్నవారిని, వారి సంతానాన్ని దూషించే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. జిల్లేడు చెట్టుకు జిల్లేడు పూలే పూయటం ప్రకృతిసిద్ధంగా సహజంగా జరిగే పని. జిల్లేడు పూలను మల్లెపువ్వుల్లాగా ఎవరూ అంతగా ప్రేమించరు. మల్లెపువ్వును స్వచ్ఛతకు మారుపేరుగా కూడా చెబుతుంటారు. జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా అనంటే అది జరిగేపని కాదు. ఈ జాతీయంలో జిల్లేళ్లను దుర్మార్గులుగా, మల్లెపువ్వులను మంచితనానికి ప్రతీకలుగా భావించటం కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఈ జాతీయం అవతరించింది. 'జిల్లేళ్లకు మల్లెలు…
-
వూళ్లో ఇల్లూ లేదు, వూరిబయట చేనూ లేదూ
ఏమంతగా ధనవంతుడైనవాడు కాడు, సాధారణమైన సంపాదన మాత్రమే ఉందని చెప్పాల్సినచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. సొంత ఇల్లూ, పొలమూ ఉండటం ఆస్తి ఉందని చెప్పటానికి, ధనవంతుడేనని నిర్ధరించటానికి కొంత ఆధారంగా ఉంటాయి. అలా లేనివాడు నిరుపేద అని భావించి చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. 'వాడికి పిల్లనిచ్చేదెవరు? వూళ్లో ఇల్లూ లేదు, వూరి బయట పొలమూ లేదు' అనేలాంటి ప్రయోగాలున్నాయి.
-
చెప్పి చెప్పి…
'చెప్పి చెప్పి చెప్పుతో తన్నించుకో, మళ్లీ వచ్చి మాతో తన్నించుకో' అన్నది జాతీయం. ఓ మంచి విషయాన్ని ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోని సందర్భంలో విసిగివేసారిన వారు ఉపయోగించే జాతీయమిది. ఇరుపక్షాల నడుమ రాజీ కుదర్చాలని ఓ వ్యక్తి తెగ ప్రయత్నం చేశాడట. అందులో ఓ పక్షం వారు అసలు మాట వినకపోగా అవమానించి పంపారట. పోనీ రెండోపక్షం వారైనా మాటవింటారేమోనని వారి దగ్గరకు వెళ్లినా అదే పరిస్థితి ఎదురైందట. ఈ భావన ఆధారంగా ఈ జాతీయ…
-
చీమలు పాకితే రాళ్లరుగుతాయా అన్నట్టు
అల్పులకు సహాయం చేసినందువల్ల సంపన్నులకు ఎలాంటి నష్టమూ ఉండబోదని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. చీమలు తమకు కావల్సిన ఆహారాన్ని పొందటానికి బండల మీద అటూఇటూ పాకుతూ ఉంటాయి. అంతమాత్రంతో ఆ బండ అరగటం కానీ ఇతరత్రా మరెలాంటి నష్టాన్ని పొందదు. ఇదే తీరులో ధనహీనులకు సహాయం చేసినందువల్ల సంపన్నులు నష్టపోయేది ఏమీ ఉండదని, కనుక సహాయం చెయ్యాలని తెలియచెప్పటమే ఈ జాతీయంలోని అంతరార్థ´ం. ''చీమలు పాకితే రాళ్లరుగుతాయా చెప్పండి.. ఈ కాస్త సహాయం…
-
ఏనుగుల పోట్లాటకు ఎర్ర చీమ రాయబారమన్నట్టు
సమఉజ్జీగా లేని వ్యవహారం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. స్థాయిని మించి చేసే వ్యర్థ ప్రయత్నాలను విమర్శించే విషయంలో దీన్ని వాడుతుంటారు. ఏనుగుతో పోలిస్తే ఎర్రచీమ చాలా చిన్నదే. విడిగా అయితే ఆ ఎర్రచీమ ఎవరినైనా కుడితే కాస్తంత నొప్పి ఉంటే ఉండవచ్చేమో. అదే తన గొప్పబలమని భావించి ఆ ఎర్రచీమ రెండు ఏనుగుల నడుమ రాయబారం చేయాలని చూస్తే అది కుదరకపోగా ఏనుగుల పాదాల కిందపడి అసలుకే మోసం వచ్చే ప్రమాదం కూడా…
-
గడ్డేసిన తావునే గొడ్డును కట్టెయ్యాలన్నట్టు
వనరులు ఉన్నచోటే నివాసం ఉండటం మేలన్న విషయాన్ని తెలియచెప్పే జాతీయమిది. గడ్డి ఒకచోట వేసి గొడ్డును ఇంకొక చోట కట్టేస్తే మేత తినక గొడ్డు ఆకలితో మాడుతుంది. గడ్డి గొడ్డుకు ఆహారపు వనరు. ఇదే తీరులో అన్నీ అందుబాటులో ఉండేచోట ఉండటం మేలు కానీ మరో చోటైతే ఇబ్బంది కలిగితీరుతుంది అని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుది. 'గడ్డేసిన తావునే గొడ్డును కట్టేయాలన్నట్టు మీవాళ్ళందరూ నీకు సహాయంగా నిలిచే చోటే నీవు కూడా నివాసం…
-
పొద్దెప్పుడు కుంకుతుందా ముద్ద ఎప్పుడు మింగుతానా అన్నట్టు
పనిదొంగలు, తిండిపోతుల వ్యవహార శైలిని విమర్శిస్తూ పెద్దలు మాట్లాడే మాటల్లో ఈ జాతీయం వినిపిస్తుంటుంది. కొంతమందికి ఎప్పుడూ తిండి మీదే ధ్యాస ఉంటుంది. ఇది పూర్వకాలంనాడు ఆవిర్భవించిన జాతీయం. పూర్వం పొద్దుకుంకగానే అన్నం తినేసేవారు. ఓ వ్యక్తిని ఉదయం పూట పనిలోకి పెట్టకుంటే తిండి మీద ధ్యాస ఉన్న ఆ వ్యక్తి చెప్పిన పని చేయకుండా ఎప్పుడు పొద్దుకుంకుతుందా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అని ఎదురుచూస్తూ కూర్చున్నాడట. ఆ విషయం ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.…