Latest posts
-
ఇంటివారు గొడ్డు గేదంటే పొరుగువారు పాడి గేదె అన్నట్టు
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కానీ చాలామంది ఇంట్లో అవమానం పొందుతూ బయటవారి దగ్గర ప్రశంసలందుకుంటుంటారు. అలాంటి వారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. గొడ్డుగేదెవల్ల ఉపయోగం లేదని దానికి పెట్టే మేత, నీళ్లు అన్నీ వృథా అనుకొంటుంటారు. అదే పాడిగేదె పాలిస్తుంది కనుక దానికి మేత, నీళ్లు ఇవ్వటానికి వెనుకాడరు. ఇదే తీరులో తన ఇంట్లో దేనికీ పనికిరాడన్న చీత్కారాలను పొందుతూ మంచి పనిమంతుడు అని బయట పదిమంది ముందూ…
-
అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు…
అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు చస్తే ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందన్నట్టు అన్నది జాతీయం. ఈ జాతీయం తెలుగువారి ఆచార వ్యవహారాలు, నమ్మకాల ఆధారంగా అవతరించింది. చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు అమావాస్య మంచిదికాదని భావిస్తారు. అది వారి నమ్మకం. కనుక ఆ రోజున మరణించటం మంచిది కాదన్నది భావన. ఏకాదశి మాత్రం ఉత్తమమైన తిథిగా, శుభకరమైనదిగా అనుకొంటుంటారు. ఆ రోజున మరణిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుందంటారు. ఈ విషయాలన్నీ పూర్వం ఓ పెద్దావిడకు తెలుసట. ఇన్నీ తెలిసినామె అమావాస్యనాడే పోయిందట.…
-
గాలిలో మాట రాసినట్టు నీరు మూటకట్టినట్టు
వృథా కార్యాలు, వ్యర్థ ప్రయత్నాలు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గాలిలో ఎంతసేపు రాసినా, ఏం రాసినా కనిపించదు. నీరు వస్త్రంతో మూటకట్టాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఫలించదు. ఇదే తీరులో కొన్ని కొన్ని పనులు అసాధ్యాలని తెలియచెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. 'వాడు చెప్పిన మాటలన్నీ గాలిలో రాసినట్టు నీరు మూటకట్టినట్టే ఉంటాయి జాగ్రత్త' అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం: ఈనాడు.నెట్
-
ఆత్మ సంతోషానికి రోకటిబండ తంబురా అన్నట్టు
ఎవరి పిచ్చి వారికానందం అనేలాంటిది ఇది. రోకటిబండతో రోట్లో పచ్చడి నూరుకోవచ్చేమో కానీ తంబురా లాగా దాన్ని ఉపయోగించటం సాధ్యం కాదు. కానీ అలా చేస్తున్నాడంటే పిచ్చికింద లెక్కే. ఆ పిచ్చి అతడి ఆత్మానందానికి సంబంధించింది. దీని ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ఎవరైనా అందరూ మెచ్చేలాగా కాకుండా కేవలం తమకు మాత్రమే నచ్చినట్లు ప్రవర్తిస్తున్నప్పుడు ''ఏం చేస్తాం ఆత్మ సంతోషానికి రోకటిబండ తంబురా అన్నట్టు వాడిపని వాడికే నచ్చినట్టుంది మరి'' అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం:…
-
ఆ మొద్దులోదే ఈ పేడు కూడా
ఒకేలాంటి లక్షణాలు కలిగి ఉన్నవారు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఒకే తానులో ముక్కలు అనేలాంటిదే ఇది. అయినా దీని ప్రయోగం మాత్రం విమర్శనాత్మక పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులలో ఉండే సమాన దుర్మార్గ లక్షణాలను చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని వాడుతుంటాయి. మొద్దు, పేడు అనేవి కఠిన హృదయానికి ప్రతీకలుగా వాడటం అలవాటుగా ఉంది. మొద్దుబుర్ర, మొద్దుబారిన గుండె లాంటి ప్రయోగాలున్నాయి. ఆ క్రమంలో వీడు కూడా అలాంటి దుర్మార్గుడే అని ఎవరి…
-
ఏమీలేని వారికి ఎచ్చులు లావు
ఏమీలేని వానికి ఎచ్చులు లావు.. స్వాములవారికి జడలు లావు అన్నట్లు అన్నది జాతీయం. ఏ విషయమూ లేని వ్యక్తి తన లోపాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎచ్చులు చెబుతుంటాడన్నది సత్యం. అది ఎంతటి సత్యమంటే కొంతమంది స్వాములకు జుట్టు జడలు కట్టి ఉంటుంది. అది ఎంత సత్యమో ఇదీ అంతే సత్యం అని ఉదాహరణ పూర్వకంగా తెలియచెబుతూ ఎలాంటి విషయమూ లేని వాని మాటలను నమ్మవద్దని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మూలం: ఈనాడు.నెట్
-
అప్పు లేకపోతే ఉప్పుగంజైనా మేలు
అప్పు తీసుకోవడం దాన్ని తీర్చలేక కష్టాలపాలు కావటం మంచిది కాదని హెచ్చరించే సందర్భాలలో పెద్దలు ఉదహరించే జాతీయమిది. అప్పు చేసి పప్పుకూడు తిని ఆ తర్వాత అందరితోనూ అవమానాలు పొందేకన్నా తాను సొంతంగా సంపాదించుకున్న ఉప్పు వేసిన గంజైనా ఎంతో గొప్పదంటారు. పూర్వం ఇప్పట్లోలాగా ఇన్నిన్ని రకాలుగా అప్పులిచ్చే పద్దతులుండేవి కావు. తీర్చటానికి తగినన్ని వనరులు కూడా ఉండేవి కావు. ఆ రోజుల్లో ఉద్భవించింది ఈ జాతీయం. 'వాడిస్తానంటే మాత్రం అప్పు తీసుకుంటానా? అప్పు లేకపోతే ఉప్పు…
-
రాజు పగ, తాచు పగ ఒకటేనన్నట్లు
రాజు అంటే ప్రజల మీద సర్వాధికారాలు ఉన్నవాడు. అలాంటి అధికార సంపన్నుడు ఎవరి మీదైనా కోపం తెచ్చుకొని పగబడితే అది తాచుపాము పగలాంటిదేనని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. తాచుపాము పగపడితే చాలా ప్రమాదమని జన బాహుళ్యంలో ఉన్న నమ్మకం. దాంతోపాటు అధికారం చేతిలో ఉన్నవారి క్రూర స్వభావం రెండింటినీ సరిపోల్చుకుంటూ అధికార మదోన్మత్తులతో తగాదాపడవద్దని హెచ్చరించే సందర్భంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మూలం: ఈనాడు.నెట్
-
శ్రుతిలేని పాట సమ్మతిలేని మాట అన్నట్టు
ఇంపుగాలేని వ్యవహారం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కొన్నికొన్ని పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సిన పరిస్థితులొస్తాయి. అలాంటప్పుడు ఆ పరిస్థితులను ఈ జాతీయంతో పోల్చి చెప్పటం కనిపిస్తుంది. 'ఏమిటోలే ఇదంతా శ్రుతిలేని పాట సమ్మతిలేని మాట అన్నట్టుంది' అనేలాంటి ప్రయోగాలున్నాయి. పాటకు శ్రుతి లేకపోతే వినబుద్ధి కాదు. సమ్మతించటానికి ఇష్టపడకుండా ఏదో మాట్లాడాలి కదా అని అడిగిన దానికి ముక్తసరిగా మాట్లాడేమాట కూడా ఇంపుగా ఉండదు. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి…
-
ఉప్పు తిన్న ప్రాణం వూరుకోదన్నట్టు
కొంతమంది ఎదుటివారి దగ్గర మేలు పొందినప్పుడు తిరిగి ఏదో ఒక మేలు చేసి తమ కృతజ్ఞతను తెలుపుకోవాలని అనుకుంటారు. అలాంటివారి తత్వాన్ని గురించి వివరించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఉప్పు ఆహార పదార్థాలలో రుచి కోసం వేస్తుంటారు. అయితే ఉప్పు తినటం అనే మాటకు కష్టాల్లో ఉన్నప్పుడు ఆహారపరంగా కానీ వ్యవహారపరంగా కానీ సహాయం పొందటం అనే అర్థంలో వాడుకలో ఉంది. 'ఉప్పు తిన్న ప్రాణం వూరుకోదన్నట్టు వాడు చేసిన సహాయానికి బదులుగా ఆ…