Latest posts

  • కొడుకును కంటాను అత్తమ్మా అంటే..

    కొడుకును కంటాను అత్తమా అంటే వద్దంటానా కోడలమ్మా అన్నట్టు అన్నది జాతీయం. ఇష్టమైన వస్తువులను లేదా పదార్థాలను ఒకరి దగ్గర నుంచి తీసుకొనేటప్పుడు వాడుకలో ఉన్న జాతీయం ఇది. ఇష్టమైన వస్తువులను ఇస్తామంటే కాదనేవారు ఎవరు? అనే భావంలో ఇది వాడుకలో కనిపిస్తుంది. వంశోద్ధారకుడైన కొడుకును కంటానని అత్తతో కోడలు అంటే ఆ అత్త ఆనందపడుతుంది. దీని ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. మూలం: ఈనాడు.నెట్

    Read more

  • చెట్టులేని చేను, చుట్టం లేని వూరన్నట్టు

    నిరుపయోగమైన వాటి గురించి పోల్చాల్సిన సందర్భాల్లో ఉపయోగించే జాతీయమిది. పంటపండే చేను అయితేనే దానివల్ల ఎవరికైనా ఉపయోగం. ఆ చేలో ఉన్న చెట్టు చేమ వల్ల ఏదో ఒక ప్రయోజనం నెరవేరుతుంటుంది. అలా లేనప్పుడు ఆ చేను బీడు భూమి అయినప్పుడు ఏ ఉపయోగమూ ఉండదు. చేలో చెట్టు ఉన్నప్పుడు ప్రయోజనం సమకూరినట్టుగానే వూళ్లో చుట్టాలున్నప్పడు ఉపయోగం ఉంటుంది. ప్రతి మనిషీ చుట్టాలను, స్నేహితులను సమకూర్చుకోవాలన్న సూచన కూడా కన్పిస్తుంది. మూలం: ఈనాడు.నెట్

    Read more

  • చేపల చెరువుకు కొంగను కాపలా ఉంచినట్టు

    అసంబద్ధమైన నిర్ణయం తీసుకోవటం, రక్షణ కావలసినచోట శత్రువుకు అవకాశం కల్పించటం అనే లాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. చేపలు కొంగకు ఆహారం. చేపల చెరువు దగ్గరకు కొంగలు రాకుండా రైతులు జాగ్రత్తపడుతుంటారు. అలాంటిది ఏకంగా కొంగను తీసుకొచ్చి చేపల చెరువుకు కాపలాపెడితే ఏం జరుగుతుందో ఎవరైనా వూహించవచ్చు. అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో అనాలోచితంగా వ్యవహరించి కొందరు శత్రువుకు స్థానం కల్పించి మోసపోతుంటారు. అలాంటి పరిస్థితులను గురించి వివరించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయం ప్రయోగం…

    Read more

  • పడిశం పది రోగాల పెట్టు

    దేహ సంబంధమైన రోగాల గురించి కూడా మన జాతీయాలు విశ్లేషిస్తుంటాయి. వైద్యశాస్త్రపరంగా పలు జాతీయాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. రోగ సంబంధమైన విషయాలను అనుభవపూర్వకంగా తర్వాత తరాల వారికి తెలియజేసే వాటిలోనిది ఇది. పడిశం సర్వసాధారణమైన రోగంగా అనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే పడిశం పడితే పది రోగాలు ఒకేసారి ఎంత ఇబ్బంది పెడతాయో అంత ఇబ్బంది మనిషికి కలుగుతుంది. ఈ విషయాన్ని అత్యంత సులువుగా, నేరుగా తెలియచెప్తున్నట్లు ఉంటుంది ఈ జాతీయం. మూలం:…

    Read more

  • అడ్డు గోడ

    ఆటంకంగా నిలవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఒక వ్యక్తి మరో వ్యక్తి అభివృద్ధికి కానీ, అభీష్టానికి కానీ ఆటంకం కలిగిస్తూ ఇబ్బంది పెడుతుండే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం జరుగుతుంటుంది. కంటిచూపుమేర వరకు చూడటానికి కానీ చక్కగా నడచి వెళ్లటానికి గానీ వీలున్న సందర్భంలో ఎవరైనా మధ్యలో అడ్డంగా గోడకడితే ఇటువారు అటు వెళ్లటం గానీ, చూడటం గానీ వీలుకాదు. హాయిగా గడచిపోవాల్సిన పనులు నిలిచిపోతాయి. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం…

    Read more

  • చేతిలో పని ఉన్నా నోట్లో నాలుక ఉండాలన్నట్టు

    భావవ్యక్తీకరణ నైపుణ్యాల అవసరాన్ని గురించి తెలియచెబుతుంది ఈ జాతీయం. ఇటీవలి కాలంలో గొప్పగొప్ప ఉన్నత విద్యలు ఎన్ని చదివినా భావవ్యక్తీకరణ నైపుణ్యం లేనందువల్ల ఉద్యోగాలలో యువత నిలబడలేకపోతున్నారన్న సత్యం తెలియవస్తోంది. ఈ సత్యాన్ని ఇంతకు ముందెప్పుడో మన పెద్దలు గుర్తించారు కనుకనే ఈ జాతీయాన్ని వాడుకలోకి తెచ్చారు. ''చేతిలో పని ఉన్నా నోట్లో నాలుక ఉండాలన్నట్టు వీడు ఎంత చదివితేనేం అధికారులు అడిగిన దానికి సరైన పద్ధతిలో సమాధానాలు చెప్పనందు వల్లనే నెగ్గుకు రాలేకపోయాడు'' అనే లాంటి…

    Read more

  • ఇంట్లోవాడే పెట్టెరా కంట్లోపుల్ల అన్నట్లు

    సొంతమనుషులు అని అనుకొన్నవారు మోసం చేసినప్పుడు, నమ్మక్రదోహం జరిగిన సందర్భాలలోనూ ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఇంట్లో వారు అనంటే సొంతవారు, నా అని అనుకొన్నవారు అని అర్థం. కంట్లో పుల్లపెట్టడమంటే భయంకరమైన ద్రోహం చేయటమని అర్థం. ఇలా ఈ అర్థాలసారంగా ఈ జాతీయం అవతరించింది. 'మనవాడేకదాని దగ్గర చేసినందుకు ఇంట్లోవాడే పెట్టెరా కంట్లో పుల్ల అన్న చందంగా జరిగింది' అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం: ఈనాడు.నెట్

    Read more

  • నోట్లో చక్కెర, కడుపులో కత్తెర అన్నట్లు

    పైపై మాటలు ప్రేమపూర్వకంగా ఉంటూ అంతరంగంలో శత్రుత్వాన్ని, పగను కలిగి ఉన్నవారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. మాటకు ప్రతీక నోరు. చేతలకు, రక్షణలాంటి కార్యాలకు ప్రతీక కడుపు. కడుపులో దాచుకోవటం అంటే జాగ్రత్తగా రక్షించటం అనే అర్థం ఉంది. అయితే ఇక్కడ కడుపులో కత్తెర అని అన్నందువల్ల ప్రాణాంతకమైన కార్యమని, రక్షణకు విరుద్ధమని అనే అర్థాలు స్ఫురిస్తాయి. కడుపులో విషం పెట్టుకోవటం అని అన్నప్పుడు కూడా ఇలాంటి భావనే కలుగుతుంది. 'వాణ్ణి…

    Read more

  • మొక్కబోయిన దేవుడు ఎదురైనట్టు

    తలచిన పనులు వెనువెంటనే జరిగిన సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఎంతో దూరాన ఉన్న ఒక దేవాలయంలోని దేవుడికి మొక్కుకుంటే అంతా మంచి జరుగుతుందని ఓ వ్యక్తి ఆ దేవుడికి మొక్కుకోవాలని సంకల్పించాడట. అయితే ఆ మరుక్షణంలోనే ఆ దేవుడే అతడికి ఎదురైతే ఎలా ఉంటుందో తెలియచెప్పే భావన ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. 'మొక్కబోయిన దేవుడు ఎదురైనట్టు ఆయన కోసం వెతుకుతుంటే ఆయనే నాకు ఎదురువచ్చాడు' అనేలాంటి ప్రయోగాలున్నాయి.     మూలం: ఈనాడు.నెట్

    Read more

  • ముమ్మూట అరవై రోగాలకు…

    ముమ్మూట అరవై రోగాలకు మూడు గుప్పెళ్ల కరక్కాయ పొడి అన్నట్టు అన్నది జాతీయం. జాతీయాలు జీవితానుభవసారాన్ని నింపుకొని తరతరాలకు చైతన్యదీపికలుగా అందుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఔషధ విలువలను, ఆరోగ్యపరిరక్షణ అంశాలును గురించి తెలియచెప్పేవి కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. ముమ్మూట అరవై అనంటే మూడు నూర్లు, అరవై అని. అంటే మూడు వందల అరవై. మూడు వందల అరవై అనేది ఇక్కడ ఎన్నెన్నో అనే అర్థంలో ఉపయోగించిన సంఖ్యావాచకం. అంటే అన్నెన్ని రోగాలకు…

    Read more