Latest posts

  • కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి..

    సమయానికి అన్నీ సమకూరినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎంతో కష్టపడితేకానీ లభించనివి సర్వం సిద్ధం అంటూ ముందుకొచ్చిన సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఇల్లు కట్టడమంటే సామాన్యమైన విషయంకాదు. ఎంతో శ్రమ పడాలి. అలాంటిది కట్టిన ఇల్లు సొంతమైనప్పుడు, ఏ శ్రమ లేకుండానే పొయ్యిపెట్టి ఉండి వంటకు సిద్ధంగా అన్నీ ఉన్నప్పుడు కలిగే ఆనందాలు ఎవరికైనా ఎప్పుడైనా ప్రాప్తించినప్పుడు ఈ జాతీయ ప్రయోగం వాడటం కనిపిస్తుంది. మూలం: ఈనాడు.నెట్

    Read more

  • ఆ గొడ్డు మంచిదైతే ఆ వూళ్లోనే అమ్ముడుపోతుందన్నట్టు

    ఒకరి ప్రతిభను గురించి అంచనావేసి చెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. కొంతమంది తమకు సరైన అవకాశాలు తామున్నచోట రావటం లేదని, అక్కడున్న వాళ్లంతా అసూయాపరులు, దుర్మార్గులు అని అందుకే వేరొక చోటికి వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతారు. అయితే ప్రతిభ అనేది ఒకరు ఆపితే ఆగేది కాదని చెప్పే పెద్దలు ఈ జాతీయాన్ని ఉదహరిస్తూ వేరొక చోట ప్రయత్నాలు చేసేవారిని గురించి విమర్శిస్తూ మాట్లాడేటప్పుడు ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. 'ఆ…

    Read more

  • కంది చేలో సూదిపోతే….

    కందిచేలో సూది పోతే పప్పుచట్టిలో వెతికినట్టు అన్నది జాతీయం. సందర్భ శుద్ధిలేని పని, చెయ్యాల్సిన పనికాక వేరొక పని చేయటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కంది చేనులో తిరుగుతున్నప్పుడు ఓ రైతు చేతిలోనుంచి జారి సూది కిందపడి పోయిందట. అలా పడిపోయిన సూదిని అక్కడే వెతకాలి కానీ అది కంది కాయల్లో చిక్కుకొని ఉంటుందని కందులు కొట్టి ఇంటికి తెచ్చి కందిపప్పుతో చట్టిలో పప్పును వండుతున్నాం కదా అనుకుని ఆ చట్టిలో సూది…

    Read more

  • వూపిరి ఉంటే ఉప్పమ్ముకొని బతకవచ్చు

    ప్రాణం విలువను తెలియచెప్పే జాతీయం ఇది. కొంతమంది క్షణికావేశంలో అనాలోచితంగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అలాంటి వారికి హెచ్చరికగా ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఒకసారి ప్రాణం పోతే తిరిగిరాదు. ఆ తర్వాత భూమ్మీద ఏం చేయటానికి అవకాశమే ఉండదు. బతకడానికి బోలెండత సంపద అవసరమే లేదు. కొద్దిపాటి సంపాదనతో కూడా ఆత్మాభిమానంతో గౌరవంగా బతకవచ్చు అని తెలియచెప్పేందుకు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. 'చచ్చి సాధించేది ఏమీ లేదు. వూపిరి ఉంటే ఉప్పమ్ముకొనైనా బతకొచ్చు సుమా' అనేలాంటి…

    Read more

  • ఎంత తొండమున్నా దోమ ఏనుగు కాదు..

    కొన్ని సందర్భాలలో దుర్మార్గులకు, మంచివారికి ఏదో ఒకటి రెండు పోలికలు కనిపిస్తుంటాయి. అంత మాత్రం చేత దుర్మార్గులు ఎప్పుడూ మంచివారితో సమానులు కారు అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఏనుగుకు తొండమున్నట్టే దోమకు కూడా చిన్న తొండం లాంటి అవయవం ఉంటుంది. కానీ ఏనుగువల్ల సమకూరే ప్రయోజనాలు వేరు. దోమవల్ల కలిగే నష్టాలు వేరు. మంచివారు, చెడ్డవారు ఒకటిరెండు పోలికలతో ఉన్నా చెడ్డవారు మంచివారుగా ఎప్పుడూ ఉండలేరు అని తెలియచెప్పే జాతీయం ఇది.…

    Read more

  • ఆలి ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం

    భార్యను కష్టపెట్టకూడదని అలా చేస్తే ఆ ఇంట్లో ఏదీ కలిసిరాదనే విషయాన్ని వివరించి చెప్పే జాతీయం ఇది. మన దేశం ప్రధానంగా వ్యవసాయ దేశం. కనుక వ్యవసాయపరమైన ఎద్దు ఏడ్పును ఆలి ఏడుపుతో పోల్చి చెప్పటం జరిగింది. వ్యవసాయదారుడు ఎద్దును సరిగా పోషించకుండా వ్యవసాయం చేయాలనుకొంటే ఎలా నష్టం కలుగుతుందో అలాగే భయంకరమైన నష్టం ఆలిని ఏడిపించిన భర్తకు కూడా కలుగుతుందని ఉదాహరణపూర్వకంగా ఈ జాతీయం వివరిస్తోంది. మూలం: ఈనాడు.నెట్

    Read more

  • గడ్డపార తినేవాడికి…

    గడ్డపార తినేవాడికి శొంఠి కషాయం ఏం పన్చేస్తుంది అన్నది జాతీయం. దుర్మార్గాలలోనూ, దురలవాట్లలోనూ మితిమీరిన వారికి కొద్దిపాటి శిక్షవల్ల ఏ ప్రయోజనమూ ఉండదని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఇనుముతో చేసిన గడ్డపారను నమిలి తినేవాడి జీర్ణశక్తి ఎలాంటిదో ఊహించవచ్చు. అలాంటి వాడికి ఎప్పుడైనా అజీర్ణం చేసినప్పుడు అందరికీ ఇచ్చినట్టుగా శొంఠి కషాయం ఇస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది భావన. ఈ భావన ఆధారంగానే దుర్మార్గాలలో శక్తివంతులైన వారికి చిన్నచిన్న శిక్షలవల్ల ఉపయోగం ఉండదని…

    Read more

  • కడవేరు మిగిలినా గరిక చిగుర్చక మానదన్నట్టు

    కార్యదక్షుల సంకల్పదీక్షను గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గరిక మొక్క అన్ని వేళ్లూ తెగిపోయినా, ఒకేఒక్క వేరున్నా మళ్లీ ఆ ఒక్క వేరుతోనే శక్తి పుంజుకొని చిగురుపెట్టి పెద్దదవుతుంది. అదే తీరులో సంకల్ప దీక్ష పోయినా ఏ ఒక్క చిన్న అవకాశం మిగిలి ఉన్నా దాంతోనే తన పని సాధించుకొస్తాడన్నది భావన. 'కడవేరు మిగిలినా గరిక చిగుర్చక మానదన్నట్టు ఈ ఒక్క అవకాశం చాలు వాడు మళ్లీ కోలుకోవటానికి' అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం:…

    Read more

  • రాఘవా స్వస్తి, రావణా స్వస్తి అన్నట్లు

    లోకమంతా శుభకరంగా ఉండాలని కొంతమంది కోరుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పాపం, పుణ్యం పరమాత్ముడికే ఎరుక, నేను మాత్రం ఎలాంటి భేదాన్ని పాటించకుండా అందరికీ శుభం కలగాలని కోరుకుంటాను అని రాముడులాంటి వారైనా, రావణుడిలాంటివారు ఎవడైనా సరే అంతా క్షేమంగానే ఉండాలన్నది నా ఆకాంక్ష అని అనుకునేవారు ఈ జాతీయాన్ని వాడుతుండటం కనిపిస్తుంది. మూలం: ఈనాడు.నెట్

    Read more

  • కూటికి లేకున్నా కాటుక చుక్క మానన్నట్లు

    కాటుక పెట్టుకోవటం అలంకార సూచకం. కూటికి లేకపోవటమంటే పేదరికంలో మగ్గిపోవటమని, ధనహీనస్థితి అని అర్థం. కొంతమంది ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా తిండైనా మానుకుంటారు. కానీ అలంకారాలు చేసుకోవటం మానుకోరు. అలాంటి వారిని చూసి మాట్లాడుకునే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. 'కూటికి లేకున్నా కాటుక చుక్క మానన్నట్లు ఇప్పుడు సరిపోయినన్ని డబ్బులు లేనప్పుడు ఇవి కొనటం అనవసరం' అనే లాంటి ప్రయోగాలున్నాయి.   సేకరణ: ఈనాడు.నెట్

    Read more