Latest posts

  • గాజుపూసల గనిలో మణి దొరకదన్నట్టు

    విలువలు లేనివారు ఎక్కువగా ఉన్నచోట విలువ కలిగినవారు ఉండరు అని నిర్ధరించి చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మణిమాణిక్యాల కన్నా గాజుపూసలకు విలువ తక్కువగా ఉంటుంది. కేవలం గాజుపూసలు దొరికే చోట విలువైన మణిమాణిక్యాలు ఉండటానికి అవకాశం లేదు అనే భావన ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. ''గాజు పూసల గనిలో మణి దొరకదన్నట్టు అక్కడున్న వారిలో ఎవరూ మంచివారు లేరు'' అనేలాంటి ప్రయోగాలున్నాయి.   సేకరణ: ఈనాడు.నెట్

    Read more

  • చెరువు ముందు చలివేంద్రం అన్నట్టు

    నిరుపయోగమైన పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పూర్వం చెరువులు, బావులులాంటివి మంచినీరు తెచ్చుకోవటానికి స్థానాలుగా ఉండేవి. కావలసినవారు కావలసినంత నీరు చెరువులో నుంచి తెచ్చుకుంటుండేవారు. ఓ వ్యక్తి అలాంటి చెరువు ముందు ఒక చలివేంద్రాన్ని పెట్టాడట. అటువచ్చే వారు తన దగ్గర నీళ్లు తాగాలన్నది అతడి భావన. కానీ పక్కనే ఎంతో సులువుగా చెరువులోకి దిగి స్వేచ్ఛగా నీళ్లు తెచ్చుకొనే వీలున్నందువల్ల ఎవరూ చలివేంద్రం దగ్గరకు వెళ్లి నీళ్లు అడిగి తీసుకోవటం లేదట.…

    Read more

  • కూర్చొని లేవలేనమ్మ వంగొని శివరాత్రికి వస్తానన్నట్టు

    అసమర్థులు చెప్పే ప్రగల్భాలను గురించి వివరించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. కూర్చొన్న చోటు నుంచి లేవటానికే శక్తిలేనప్పుడు నడుము నొప్పిపుట్టేలా వంగి ఎంతోదూరం నడుచుకొంటూ వెళతాననటం ఎంత నమ్మశక్యమో అదే తీరులో ఏమాత్రం శక్తిలేకపోయినా ఎన్నెన్నో చేసి తీరుతామంటారు కొందరు.ఈ చిన్నపని చేసిపెట్టలేనివాడు రేపంతా నాదగ్గరే ఉండి పనంతా చేస్తానంటున్నాడు. కూర్చొని లేవలేనమ్మ వంగొని శివరాత్రికి వస్తాన్నన్నట్టుంది వాడు చెప్పే మాట' అనేలాంటి ప్రయోగాలున్నాయి.   సేకరణ: ఈనాడు.నెట్

    Read more

  • ఆరేసి మూడెత్తుకున్నట్టు

    మూడు పువ్వులు, ఆరుకాయలు అనే దానికి వ్యతిరేకార్థం ఇచ్చే జాతీయం ఇది. ఆరు వెయ్యడమంటే ఆరు ఖర్చుపెట్టడం అని అర్థం. ఆరు ఖర్చుపెడితే దక్కింది మూడేనట. అంటే పెట్టుబడిలో సగానికి సగమే దక్కిందన్నమాట. ఇలా నష్టపోయిన సందర్భాలలో ఉపయోగించిన జాతీయం ఇది. వ్యాపారమేమీ బాగోలేదు. ఆరేసి మూడు తీసుకున్నట్లుంది అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం కనిపిస్తుంది.   సేకరణ: ఈనాడు.నెట్

    Read more

  • చేతిలో కాసు నోటిలో దోసె అన్నట్టు

    డబ్బిచ్చిన తర్వాతే ఏ పనైనా జరిగేది అని, అప్పు ఇవ్వడం లేదని చెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. సర్వకాలాలలోనూ జాతీయాలు ఆవిర్భవిస్తూనే ఉంటాయి. ఆనాటి కాలపరిస్థితులు వీటికి వేదికలవుతాయి. అప్పుడు వాడుకలో ఉన్న పదాలతోనే జాతీయాలు రూపొందుతుంటాయి. అలాంటి వాటి వరసలోనిది ఈ జాతీయం. ముందుగా డబ్బు ఇస్తేనే దోసె ఇస్తానని అన్న వ్యాపారి మాటలే దీనికి ఆధారం. చేతిలో కాసు నోటిలో దోసె అన్నతీరులో ముందుగా   డబ్బిస్తేనే మనం అడిగిన పని చేస్తామంటున్నాడు…

    Read more

  • తల వంచుకుంటే ఏడు గోడల చాటన్నట్టు

    లౌక్యం తెలుసుకొని మసులుకోవాలి అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. అనువుగాని చోట అధికులమనరాదు అనే దానికి ఇది సమానార్థకం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కాస్తంత ఓపిక పట్టినట్టు, అవమానం కలిగినప్పుడు అవమాన పరిచినవారిని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు కాస్తంత తగ్గితే ఆ తర్వాత అంతా చక్కగా నడుస్తుందని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఏడు గోడల చాటు అనంటే రక్షణతో ఎంతో భద్రంగా ఉండటం అని అర్థం. కొద్దిగా తగ్గిఉంటే…

    Read more

  • పూసిన పూలన్నీ కాయలవుతాయా

    పూసిన పూలన్నీ కాయలవుతాయా అన్నది జాతీయం. ప్రయత్నం విఫలమైన సందర్భంలో విసిగిపోవద్దని, మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయమని ధైర్యం చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. చెట్టుకు పువ్వులు పూస్తాయి. అయితే పూసిన పూలన్నీ కాయలవ్వవు, పండ్లుగా మారవు. కొన్ని మధ్యలోనే రాలిపోతాయి. కొన్ని పిందె వేసే స్థితికి వచ్చి రాలిపోతాయి. కాయలుగా మారేవి కొన్నే. పండ్లుగా మారేవి అందులో కొన్నే. ప్రకృతిలో కనిపించే ఈ సత్యాన్ని గమనించి అనుకొన్న పని జరగనప్పుడు ఎంతగా కష్టపడినా…

    Read more

  • నేలరాయి నెత్తికెత్తుకున్నట్లు

    అనవసరమైన పనిని మీద వేసుకొని కష్టాలను అనుభవించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఓ వ్యక్తి కాలిబాటన నడుస్తూ ఉంటే పక్కన నేలమీద ఒక బండరాయి కనిపించిందట. అతడు తన దోవన తాను పోక ఆ రాయిని పెకలించి ఎత్తి నెత్తిన పెట్టుకున్నాడట. ఆ తర్వాత ఆ బరువు మొయ్యలేక కష్టాన్ని అనుభవించాడు అని చెప్పే సంఘటన ఈ జాతీయ ఆవిర్భవానికి వేదిక. ఇలాగే కొంతమంది అనవసరమైన పనులను మీద వేసుకొని ఇబ్బందులు పడుతుంటారు.…

    Read more

  • శ్రీరాముని దయచేతను

    శ్రీరాముని దయచేతను నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా ధారాళమైన నీతులు నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ! తాత్పర్యము మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.

    Read more

  • అక్కరకు రాని చుట్టము

    అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా నెక్కినఁ బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ! తాత్పర్యము అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.

    Read more