Latest posts
-
పులికి ఏ అడవైనా ఒక్కటేనన్నట్టు..
పనిచేసేవారికి, శక్తిసంపన్నులకు ఏ ప్రదేశమైనా ఒకటేనని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఉద్యోగుల బదిలీ విషయంలో ఇది ఎక్కువగా వినిపిస్తుంటుంది. పులి గాంభీర్యానికి, శక్తికి సంకేతం. శక్తిగలవాడు లేదా తెలివికలవాడు ఎక్కడకు బదిలీ అయినా తన పని తాను సక్రమంగానే నిర్వర్తిస్తాడని తెలియచెప్పే సందర్భాలలో దీన్ని వాడుతుంటారు. మూలం: eenadu.net
-
బడిలేని చదువు, వెంబడిలేని సేద్యం..
వ్యవసాయాధారితమైన దేశం కనుక మన దేశంలో సేద్యాన్ని పోలికగా తీసుకొని అవతరించిన జాతీయాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. చదువు, వ్యవసాయం రెండూ సక్రమంగా ఉండాలంటే ఏ పరిస్థితులుండాలో దీనిలో చెప్పటం కనిపిస్తుంది. బడికి వెళ్లి చదువుకుంటే తెలియని విషయాలను ఉపాధ్యాయుడు వివరంగా చెప్పి ఆ విషయాలను మనసుకు పట్టేలా చేస్తాడు. అలా చదివితేనే మంచి జ్ఞానం లభిస్తుంది. అలాగే వ్యవసాయదారుడు పొలం దున్ని నాట్లు వేసిన దగ్గర నుంచి ప్రతి నిత్యం పొలం వెంబడే…
-
వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు..
కొంతమంది అప్పగించిన పనిని సమయానికి ముగించకుండానే ఆ పని ముగించేసినట్టు చెబుతుంటారు. నిక్కచ్చిగా నిలదీసి అడిగితే తప్పించుకోవడానికి ఏవో కారణాలను చూపుతుంటారు. అలాంటి వారిని గురించి లేదా అటువంటి పరిస్థితులను గురించి తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఒక వ్యక్తికి అన్నం వండే పని అప్పగించారట. అన్నం వండుతానని ఒప్పుకొన్న మనిషి వంట అయిందా అని అడిగితే అయింది అని చెప్పాడు. తీరా ఏది అని అడిగినప్పుడు ఎండబెట్టిన వడ్లు సరిగా ఆరలేదని అందుకే…
-
గరుడాయ లెస్సా అంటే…
గరుడాయ లెస్సా అనంటే శేషాయ లెస్సా అన్నట్టు అన్నది జాతీయం. గరుడుడు, శేషుడు ఎవరి స్థాయిలలో వారు గొప్పవారే. కానీ ఒకరినొకరు పలకరించుకోవటానికి వారి మధ్యన ఉండే జాతి వైరాలులాంటివి అడ్డు వచ్చే అవకాశాలుంటాయి. ఆత్మాభిమానం కూడా అడ్డురావచ్చు. కానీ పరిస్థితిని ప్రశాంతంగా ఉంచడానికి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ముందుగా ఎదుటివారిని ఎలా పలకరిస్తే కచ్చితంగా అదే తరహా పలకరింపులో ఎదుటివారు కూడా పలకరించవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఎదురైనప్పుడు ీఆ ఇద్దరూ ఎదురైనప్పుడు గరుడాయ…
-
కాలుజారి నేల మీద పడి…
కాలుజారి నేల మీద పడి నేల అచ్చిరాలేదన్నట్టు అన్నది జాతీయం. ఆడలేక మద్దెల ఓడన్న దానికి ఇది సమానార్థకం. ఓ వ్యక్తి సరిగా చూసుకోకుండా అజాగ్రత్తగా నడుస్తూ జారి కిందపడ్డాడట. అజాగ్రత్తగా ఉండటమన్నది అతడి వైపు నుంచి జరిగిన తప్పు. ఆ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు ఛీఛీ ఈ నేల నాకు కలిసి రాలేదని విసుకున్నాడట. ఇదే తీరులో కొంతమంది తమకు అప్పగించిన పనిని చేయలేక తమ అసమర్థతను కప్పి పుచ్చుకుంటూ ఎదుటివారి మీదనో, ఆ పని చెప్పిన…
-
అమ్మా తల్లీ అంటే అప్పాలన్నీ తినేసిందన్నట్టు..
చనువిస్తే చంకనెక్కింది అన్న దానికి సమానార్థకం ఇది. కొంతమందికి ఏ కొంచెం అలుసిచ్చినా మొత్తం ఆక్రమించి అలుసిచ్చిన వారిని అణగదొక్కుతుంటారు. అలాంటి వారి గురించి ప్రస్తావించాల్సినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఒకామె కాస్తంత కష్టకాలంలో ఉంది కదాని ఆమె మనస్సును కష్టపెట్టడం ఇష్టం లేక అనునయిస్తూ బతిమలాడారట ఎదుటివారు. దాంతో ఆమె తనను వారంతా బతిమలాడుతున్నారంటే తానే గొప్ప అనుకొని ఎదుటివారు తినటానికి సిద్ధంగా ఉంచుకొన్న అప్పాలను (పిండి వంటలను) మొత్తం లాక్కొని తానే తినేసిందట.…
-
ఎన్ని పుంగనూర్లు అయితే ఒక బెంగుళూరు అవుతుందన్నట్టు..
చుక్కల్లో చంద్రుడులాంటిది ఇది. అన్నిటికంటే అధికం అని చెప్పే సందర్భాలలో దీని ప్రయోగం కనిపిస్తుంది. ఇటువంటి జాతీయాలు స్థానికంగా మాండలికపరంగా ఎక్కడికక్కడ ఉంటూనే ఉంటాయి. కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన బెంగుళూరు నగరం చాలా గొప్పది అని చెప్పటం దీనిలో పైపైకి కనిపించే విషయం. ఇద్దరు వ్యక్తుల నడుమ పుంగనూరు గొప్పదా? బెంగుళూరు గొప్పదా? అని వాదన జరిగినప్పుడు ఆవిర్భవించింది ఇది. అయితే దీన్ని విడిగా ఒక వస్తువునో, ఒక వ్యక్తినో గొప్ప అని, చాలా గొప్ప అని…
-
చేతికొచ్చింది నోటికొచ్చిందాకా నమ్మకం లేనట్టు..
స్థిరం లేని వ్యవహారం, నమ్మకంలేని పని అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చేతి నుంచి నోటికున్న దూరం తక్కువే అయినా చేతిలో ఉన్నదాన్ని నోట్లో పెట్టుకొనే లోపలే అది కింద పడిపోవటమో మరోలా పనికిరాకుండా పోవటమో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పటం ఈ జాతీయంలో పైపైకి కనిపిస్తున్న విషయం. అంటే అన్ని రకాలుగా ఇది నాదేనని అనుకొని ధైర్యంగా ఉన్నప్పుడు అది తనది కాకుండా పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. దీనికి కారణాలు అనేక…
-
చచ్చిన పామును కొట్టడానికి అందరూ బంట్లేనన్నట్టు
హాని కలిగించని పని, కష్టం లేని పని అంటే ఆ పని చేయటానికి అందరూ ముందుకొస్తారని, శక్తిహీనులు కూడా తాము శక్తివంతులమని చెప్పుకోటానికి అలాంటి పనులకు ముందుకు వస్తారని తెలియచెప్పటమే ఈ జాతీయ లక్ష్యం. చచ్చిన పామును కొట్టడానికి అందరూ బంట్లేనన్నట్టు ఈ చిన్నపని చేయటానికి నేనంటే నేనంటూ అందరూ ముందుకొచ్చారు అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం: eenadu.net
-
ఈ అన్నది లేదు, తే అన్నదే తరతరాలుగా వస్తున్నది..
ఈ (ఇవ్వు) అన్నది లేదని, తే (తీసుకురా) అన్నదే అలవాటని చెప్పటం ఈ జాతీయంలో అంతరార్థం. ఇక్కడ కనిపిస్తున్న ఈ, తే అనే రెండూ రెండు విభిన్నార్థాలను కలిగి ఉన్నాయి. ఈ అంటే దయచేసి ఇవ్వు అని బతిమలాడటం లేదా యాచించటం, తే అంటే తీసుకురా అని ఆజ్ఞాపించటం అనేది అర్థం. అంటే తనకు యాచించే స్థితి ఏనాడు లేదని, ఎప్పుడూ ఒకరిని ఆజ్ఞాపించి పని చేయించుకొనే ఉన్నత స్థితేనని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం…