Latest posts
-
అగ్ని-1 ప్రయోగం విజయవంతం
పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని ఒడిసా తీరం నుంచి భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దీని బరువు 12 టన్నులు, పొడవు 15 మీటర్లు. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లి, 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. డీఆర్‌డీవోలోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ దీన్ని రూపొందించింది. అగ్ని క్షిపణి-1 రూపకల్పనలో డీఆర్‌డీఎల్, ఆర్‌సీఐతో పాటు హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా భాగస్వామ్యం వహించింది. 2012-12-12
-
దక్షిణాది ప్రముఖ నటుడు “రజనీకాంత్” పుట్టినరోజు
సూపర్‌స్టార్ రజనీకాంత్ 1950 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన బెంగళూర్‌లో జన్మించారు. అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్. ఈ రోజు శతాబ్ధానికి ఒక్కసారి మాత్రమే వచ్చే మేజిక్ నెంబర్ 12.12.12న అంటే బుధవారం 63వ పడిలో అడుగుపెడుతున్నారు రజనీ. మేజిక్ నెంబర్ మొత్తం కలిపితే 36. రజనీ సినీ పరిశ్రమకి వచ్చి కూడా ఈ ఏడాదితో 36 ఏళ్లు పూర్తయ్యింది. ఇలా ఆయన సినీజీవితం 12.12.12తో ముడిపడివుంది. 2012-12-12
-
హాకింగ్‌కు రష్యా ‘ఫిజిక్స్’ బహుమతి!
కృష్ణ బిలం’ సిద్ధాంతకర్త స్టీఫెన్ హాకింగ్(70)కి రష్యాకు చెందిన ‘ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రైజ్ ఫౌండేషన్’ 18లక్షల పౌండ్ల విలువైన బహుమతిని ప్రకటించింది. ఆయనే కాకుండా లార్జ్ హడ్రన్ కాలిడర్(ఎల్‌హెచ్‌సీ)కి నాయకత్వం వహిస్తున్న లిన్ ఎవాన్స్, మరో ఆరుగురు శాస్త్రవేత్తలకు కూడా ఈ ఫౌండేషన్ బహుమతిని ప్రకటించింది. రష్యాలో ఇంటర్నెట్ మొగల్ యూరి మిల్నర్ నెలకొల్పిన ఈ ఫౌండేషన్ ఇచ్చిన బహుమతి మొత్తంతో తన మనువడికి విడిది గృహాన్ని(హాలిడే హోం) కొనుగోలు చేయాలని స్టీఫెన్ హాకింగ్ భావిస్తున్నారు. ఈ…
-
గుజరాత్ లో నేడు ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం
గుజరాత్ లో నేడు తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్ మరియు బారతీయ జనతాపార్టీ లో హోరాహోరిగా ఎన్నికల ప్రచారం చేసాయి. బాజపా తరుపున నరేంద్రమోడీ ప్రచారం చేసారు. 2012-12-12
-
భూమి సమీపంలోకి గ్రహశకలం
ఒక గ్రహశకలం బుధవారం భూమికి సమీపం నుంచి వెళ్లనుంది. '4179 టౌటాటిస్' అనే పేరున్న ఈ గ్రహశకలం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు భూమి సమీపంలోకి.. అంటే 69,31,175 కి.మీ.ల దూరంలోకి వస్తుందని తెలిపారు 2012-12-12
-
పండిట్ రవిశంకర్ కన్నుమూత
రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని శాండియాగోలోని స్క్రిప్స్ మెర్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 7, 1920లో వారణాసిలో జన్మించిన రవిశంకర్ హిందుస్థాని క్లాసికల్ సంగీతంలో పలు అవార్డులు అందుకున్నారు. మూడు సార్లు గ్రామీ పురస్కారం పొందారు. 1999లో రవిశంకర్‌ను ప్రభుత్వం అత్యున్నత పురస్కారం 'భారత రత్న'తో సత్కరించింది. రవిశంకర్ అసలు పేరు రబింద్రో శౌంకోర్ చౌదురి. తన బాల్యంలో నృత్యం నేర్చుకునేందుకు…
-
గాడిద గుడ్డు పెడుతుందా? గద్ద పిల్లను కంటుందాన్నట్టు
కొన్ని కొన్ని అసాధ్యాలను గురించి స్పష్టం చేసేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. గాడిద గుడ్డు పెట్టడం, గద్ద నేరుగా పిల్లను కనడం సృష్టిలో జరిగే పనికాదు. అలాగే ఎదురుగా ఉన్న పని అసంభవం అని చెప్పాల్సివచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. మూలం: eenadu.net
-
కలుపు తియ్యని మడి… దేవుడు లేని గుడి
ఏ పని చేసినా సంస్కారవంతంగా ఉండాలంటారు పెద్దలు. ఈ విషయాన్ని వ్యవసాయానికి ముడిపెట్టి చెప్పిన జాతీయం ఇది. మడిలో కలుపు తియ్యకుండా ఉంటే చేను బాగా పండటం కష్టం. దానివల్ల రైతుకు ఎలాంటి ఉపయోగం ఉండదు. గుడి అనగానే లోపల దేవుడి విగ్రహం ఉండి ఆ ప్రదేశమంతా సంస్కారవంతంగా పూజలు లాంటివన్నీ జరుగుతూ ఉండాలి. దేవుడు లేకపోతే గుడి ఉన్నా వృధానే. దేవుడు ఉన్నప్పుడే గుడికి విలువ పెరిగినట్టు కలుపు తీసినప్పుడే మడికి విలువపెరుగుతుంది ఈ పోలికలతో…
-
వూరోరి పత్తి వూరోరి చమురు వూగూగు దేవుడా..
కొంతమంది లోకుల సొమ్ముతో సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారిని గురించి వ్యంగ్యంగా చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. దేవుడిముందు వెలిగించే దీపంలో వత్తికి సంబంధించిన పత్తి, చమురు అన్నీ వూరి వారివే. కానీ ఆ దీపపుకాంతి ఆలయంలో ప్రసరిస్తూ కాంతిని కలిగిస్తుంటుంది. అలాగే కొంతమంది ఎదుటివారిచ్చే డబ్బు లేదా ఇతర వస్తువులను వాడుకొంటుంటారు. అవన్నీ వారివేనన్న భ్రమను కలిగిస్తుంటారు. అలాంటి సందర్భాలలో దీని ప్రయోగం గమనార్హం. ఇక్కడ వూగూగు దేవుడా అన్నది బాగా ఆనందించు నీదేమీ…
-
ఇచ్చిన వాడు తలమీద.. ఇవ్వనివాడు నేలమీద..
తమకు సహాయం చేసిన వారిని మాత్రమే కొందరు గౌరవిస్తుంటారు. ఇతరులను ఏమాత్రం పట్టించుకోకపోగా కొన్ని సందర్భాలలో అవమానిస్తుంటారు కూడా. అలాంటి వారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంటుంది.'వాడితో జాగ్రత్త ఇచ్చినవాడు తలమీద, ఇవ్వనివాడు నేలమీద అనే రకం' అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం: eenadu.net