Latest posts

  • అత్త మెత్తన వేము తీయన ఉండవన్నట్టు..

    సామాన్య కుటుంబ జనజీవనంలో అత్తకోడళ్ల నడుమ తగాదాలు చెలరేగే పరిస్థితులను చూసిన కొందరు చెప్పిన జాతీయం ఇది. అత్తలు కోడళ్లను నెగ్గుకురానివ్వరని కఠినంగా ప్రవర్తిస్తూ వారని హింసిస్తుంటారన్న భావనతో అవతరించిన జాతీయమిది. అయితే దీన్ని సమాజంలో ఉన్నతాధికారులకు, వారికింద పనిచేసే ఉద్యోగులకు సమన్వయిస్తూ కూడా చెపుతుంటారు. ఉన్నతాధికారులను అత్తలతో, కిందిస్థాయి ఉద్యోగులను కోడళ్లతోను పోల్చి చెప్పటమే దీనికి ఆధారం. జాతీయంలో చెప్పినట్టు వేపచెట్టుకు సంబంధించిన కాయలు తియ్యగా ఉండవు. అవి చేదుగానే ఉంటాయి. అలాగే అత్తకూడా కఠినంగా…

    Read more

  • ఎద్దుకు చొప్పవేసి ఆవును పాలియ్యమన్నట్టు..

    దౌర్జన్యం చేసేవారిని పెంచి పోషిస్తూ మంచివారిని పనిచెయ్యండని ఒత్తిడి చేస్తుంటారు కొందరు. అలాంటివారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఆవు సాధుజంతువు. ఎద్దును బలవంతులకు పోలికగా చెబుతారు. ఈ పోలికే ఈ జాతీయ ఆవిర్భావానికి వేదికైంది. 'ఎద్దుకు చొప్పవేసి ఆవును పాలిమ్మన్నట్టు ఉన్నదంతా వాళ్లకే పెట్టి, చెయ్యాల్సిదంతా వాళ్లకే చేసి మమ్మల్ని చాకిరీ చేయమనటం ఏమీ బాగాలేదు' అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం: eenadu.net

  • కలిగిన వారికి అందరూ చుట్టాలే..

    లోకం తీరును వివరించే జాతీయం ఇది. కలిగిన వారు అనంటే సంపదలు కలిగినవారు అని అర్థం. డబ్బు లేని పేదవాడిని ఎవరూ తనవాడు అని చెప్పుకోరు. అదే తెలిసిన వారిలో ఎవరైనా ధనవంతులో లేదా పలుకుబడి కలిగినవారో ఉంటే ఎక్కడో ఒకచోట చుట్టరికాన్ని కలుపుకొని వాళ్ళు మా వాళ్ళేనంటూ గొప్పలు చెప్పుకోవటం చాలామంది దగ్గర కనిపిస్తుంది. అలాంటి వారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. మూలం: eenadu.net

    Read more

  • పిలిచి పెద్దపులికి పేరంటం చేసినట్లు..

    ప్రమాదాలను కొనితెచ్చుకొని, ప్రమాదకారులను గౌరవిస్తూ ప్రమాదంలో పడటం తెలిసో తెలియకో చాలాసార్లు జరుగుతుంటుంది. అలాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పెద్దపులి ఎంతటి క్రూరజంతువో అందరికీ తెలిసిందే. అలాంటి పెద్దపులిని పనిగట్టుకొని పిలిచి పేరంటం చేస్తే ఆ క్రూరజంతువు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరైనా వూహించవచ్చు. అలాంటి సందర్భాలలో 'ఆయనను ఇక్కడకి పిలవటమంటే పెద్దపులిని పిలిచి పేరంటం చేసినట్లే లెక్క. అందుకే ఆయనను పిలవద్దంటున్నాను' అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం: eenadu.net

    Read more

  • ఈ మొగానికి శేరు పసుపు…

    ఒక్కొక్కసారి అనర్హులను అర్హులుగా భావించి వారికి సన్మానాలు, సత్కారాలు చేయటం జరుగుతుంటుంది. అలా అనర్హులకు లభ్యమయ్యే గౌరవాన్ని చూసినప్పుడు వారి విషయం తెలిసిన వారు విమర్శిస్తూ మాట్లాడే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం వినిపిస్తుంటుంది. శేరు పసుపు ముఖానికి రాయాలంటే ఆ ముఖం ఎంతో పెద్దదై ఉండాలి. చాలా పెద్దది అనుకొని శేరు పసుపును తెప్పించి పెట్టిన తరువాత చిన్న ముఖంతో వచ్చిన వ్యక్తిని చూసి అనుకున్నట్లుగా ఈ జాతీయం కనిపిస్తుంటుంది. కానీ దీని వెనుక మాత్రం…

    Read more

  • ఆరాటమేకానీ పోరాటం లేదన్నట్టు

    బద్ధకస్తులైన ఆశపోతుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఆశతో ఇది నాకు కావాలి అని ఆరాటపడిపోతే చాలదు. కావాలనుకున్న దాన్ని సాధించుకొనేందుకు పోరాటం చేయాలి. అలా పోరాడి నిజాయతీగా కావలసిందేదో దాన్ని దక్కించుకోవాలి తప్ప నాకది కావాలి అని వూరక అనుకొంటూ కూర్చుంటే సరిపోదు అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. మూలం: eenadu.net

    Read more

  • పంజరంలో పెట్టినా కాకి చిలుక పలుకులు పలకదన్నట్టు..

    చిలుకలను పంజరంలో పెట్టి పెంచుకొనే అలవాటు కొందరికి ఉంటుంది. చిలుకలాగే కాకికూడా పక్షే కదా దాన్ని కూడా తెచ్చి పంజరంలో పెడితే చిలుకలాగే చక్కగా పలుకుతుందేమోనని ఓ వ్యక్తి అనుకున్నాడట. చిలుక పలకటానికి పంజరమే కారణమన్నది అతని భావన. అలాగే ఓ కాకిని తెచ్చి పంజరంలో పెట్టి కొన్నాళ్లు చూశాడట. ఎంత కాలానికీ ఆ కాకి చిలుకలాగా పలకలేకపోయిందట. ఈ జాతీయంలో చిలుకను మంచివారికి, కాకిని దుర్మార్గులకు ఉదాహరణగాను, పంజరాన్ని మంచి శిక్షణ ఇచ్చే కేంద్రంగానూ పోల్చి…

    Read more

  • పాడిపసరం, పసిబిడ్డ ఒకటేనన్నట్టు..

    వ్యవసాయం ఆధారంగా జీవించే కుటుంబాలు ఎక్కువ ఉన్న మనదేశంలో వ్యవసాయ నేపథ్యం నుంచి అనేక జాతీయాలు ఆవిర్భవించాయి. ఈ జాతీయం కూడా అలాంటిదే. పసరం అంటే పశువు అని అర్థం. పాడిపసరం అంటే పాడిగొడ్డు. అది ఆవు కావొచ్చు, గేదె కావొచ్చు. అలాంటి పశువులను ఏదో పశువులే అని నిరాదరించకుండా నిర్లక్ష్యం చేయకుండా ఇంట్లో పసిబిడ్డను ఎలా అయితే ప్రేమతో చూసుకుంటారో అలానే చూసుకోవాలి. అలా కాకపోతే నష్టమే అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం…

    Read more