Latest posts

  • ఆముదపు విత్తులు ఆణిముత్యాలవుతాయా అన్నట్టు..

    కొంతమందిని మార్చి మంచి పద్ధతిలో పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. వారి సహజ గుణాన్ని మార్చుకోక పాత పద్ధతిలో అలాగే ఉండిపోతారు. ఆముదపు గింజల్ని ఎంతగా చెక్కి రంగులద్దినా వాటిని ఆణిముత్యాలు అని ఎవరికైనా చూపించి నమ్మించటం కూడా కష్టమే అవుతుంది. ఇదే పద్ధతిలో సహజసిద్ధమైన పద్ధతులు ఎప్పుడూ మారవని, దానికోసం చేసే ప్రయత్నం వృథా అని వివరించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మూలం: eenadu.net

    Read more

  • తెగితే లింగడు రాయేనన్నట్లు

    స్థానబలిమి కాని తన బలిమి కాదు అని అన్నాడు వేమన. తమతమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రువులవుతారన్నాడు బద్దెన. అట్లాంటిదే ఇది. ఎవరికైనా స్థానం తప్పినప్పుడు, వేరొక కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు సర్వసాధారణంగా అక్కడి స్థానికులకు ఆ వచ్చిన వారి గొప్ప తెలియక తక్కువుగా చూస్తుంటారు. ఓ వ్యక్తి తన మెడలో నిత్యం ఓ శివలింగాన్ని కట్టుకొని తిరుగుతూ ఉండేవాడట. ఓ రోజున అది తెగి ఎక్కడో కింద పడిపోయింది. ఆ శివలింగం కట్టుకొన్నవాడి మెడలో…

    Read more

  • జరిగితే బండి, జరక్కపోతే బండ..

    మనిషిగా గుర్తింపు పొందాలంటే నిత్యచైతన్యంతో విరాజిల్లాలి. అలాకాక బద్ధకంతో ఒకచోట పడి ఉంటే ఎవరూ లెక్కచేయరని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. బండి చైతన్యానికి, చలనానికి ప్రతీక. బండ మొద్దుతనానికి గుర్తు. జరిగి ముందుకు సాగిందంటే అది బండి లక్షణం. ఒకచోట పడి ఉందంటే అది బండ లక్షణం. కనుక ఎప్పుడూ బండబారిపోయి ఉండొద్దు, బండిలా ముందుకు సాగుతూ ఉండు అని చెప్పేటప్పుడు ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది మూలం: eenadu.net

    Read more

  • భోజుడు వంటి రాజు ఉంటే, కాళిదాసులాంటి కవి ఉంటాడన్నట్టు..

    పాలకులను బట్టే ప్రజల జీవన విధానం ఉంటుందని తెలియ చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. భోజమహారాజు ప్రజలను చక్కగా పాలిస్తూ కవులను ఆదరించాడు కనుకనే కాళిదాసులాంటి కవి వెలుగు చూడగలిగాడు. కనుకనే సమాజంలో కళలు, కవిత్వం లాంటివన్నీ వృద్ధి చెందాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా సానుకులంగా స్పందించాలని తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. మూలం: eenadu.net

    Read more

  • వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లు..

    ఏ వయస్సుకు ఆ ముచ్చటంటారు. ముద్దు ముచ్చట్లన్నీ యుక్తవయస్సులో ఉన్నప్పుడైతే చూడటానికి బాగుంటుందేమో కానీ వయస్సు మీరిన తర్వాత అవి అంతగా బాగుండవు. వయ్యారంగా ఉండటమనేది వయస్సులో ఉన్నవారికైతే చక్కగానే ఉంటుంది. వయస్సు మీరినవారు వయ్యారాలు పోతే అందరూ వెక్కిరించే పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఎవరైనా తమ వయస్సుకు తగ్గ పనులు కాక వేరేలాగ ప్రవర్తిస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. మూలం: eenadu.net

    Read more

  • ఉప్పు లేదు, కారం లేదు అమ్మతోడు….

    'ఉప్పు లేదు, కారం లేదు అమ్మతోడు అయినా రుచిగానే ఉందన్నట్టు' అన్నది జాతీయం. కొంతమంది మొహమాటస్తులను గురించి వివరించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పదార్థానికి రుచి రావాలంటే ఉప్పు, కారం ఉండాలి. ఇది సర్వసాధారణమైన విషయం. కానీ ఉప్పు, కారం లేని కూరను వడ్డించినా ఓ వ్యక్తి చాలా మొగమాటంతో ఆ కూర ఎంతో బాగుందని మెచ్చుకున్నాడట. ఆ కూర చేసి వడ్డించిన వ్యక్తికి అది రుచిగా ఉండదని తెలుసు. కానీ తింటున్న వ్యక్తి…

    Read more

  • ఇంట ఆచారత్వం, బయట బడా చోరత్వం..

    పైకి ఒకలాగా లోలోపల మరొలాగా ప్రవర్తించేవారుంటారు. అలాంటి వారిని గురించి చెప్పాల్సివచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఆచారత్వం, చోరత్వం అనే పదాలను ప్రాస కోసమో, తూగు కోసమో వాడినా అంతరార్థం మాత్రం ముక్కుసూటిగా తప్పును విమర్శించినట్టే ఉంటుంది. ఆచారాలు పాటిస్తున్నాను మీరూ పాటించండి అని చెప్పేవారు వేరొకచోటికి వెళ్లిన తరువాత ముందు చెప్పిన దానికి విరుద్ధంగా నీతినియమాలను పాటించకుండా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నప్పడు అలాంటివారిని ఈ జాతీయంతో వ్యవహరిస్తుంటారు. మూలం: eenadu.net

    Read more

  • అదును చూసి పొదలో చల్లినా పండుతుందన్నట్టు

    సమయ సందర్భాలను, సమయస్ఫూర్తిని పాటించినప్పుడే ఎవరికైనా విజయం దక్కుతుందనే విషయాన్ని వివరించి చెప్పే జాతీయం ఇది. సక్రమంగా వర్షాలు కురిసే నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. నేలమీద పొదలు అడ్డమున్నా ఆ పొదల నుంచి జారి నేలమీద పడ్డ గింజలు నేల అదునుగా ఉంటే పండితీరుతాయి. ఇలాగే సమయం, సందర్భం కలిసొచ్చి సమయస్ఫూర్తితో వ్యవహరించినప్పుడే అంతా సక్రమంగా నడుస్తుందని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మూలం: eenadu.net

    Read more

  • పనికి పరాకు… తిండికి హుషారు

    బద్ధకస్తులను గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. బద్ధకస్తులు ఏదైనా పనిచేయమన్నప్పుడు పరాకుగా పరధ్యానంగా ఉంటుంటారు. అదే తినటానికి రమ్మంటే హుషారుగా ఎక్కడలేని ఓపికతో పరుగెత్తుతుంటారు. ఇలాంటి వారు ఎక్కడైనా కనిపించినప్పుడు వారి తీరును విమర్శిస్తూ ఉపయోగించే జాతీయం ఇది. మూలం: eenadu.net

    Read more

  • ఇర్రికొమ్ము అంటే బర్రెకొమ్ము అన్నట్టు..

    చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించటం, ఒకపని చేయమంటే మరోలా అర్థం చేసుకొని వేరే ఏదోపని చేయటం అనేది కొంతమంది దగ్గర కనిపిస్తుంటుంది. అలాంటి వారిని గురించి చెప్పేటప్పుడు 'ఇర్రి కొమ్ము అంటే బర్రెకొమ్ము అంటాడు. వీడితో కలిసి ఎలా ప్రయాణం చేయాలో ఏమిటో మరి' అనేలాంటి ప్రయోగాలున్నాయి. ఇర్రి అంటే జింక, బర్రె అంటే గేదె అని అర్థం. మూలం: eenadu.net

    Read more