Latest posts
-
అనిత్యాని శరీరాణి.. అందరి సొమ్మూ మనకేరాని..
మనిషిలోని బలహీనతలను, మోసగుణాలను వెక్కిరించే జాతీయాలు కూడా కొన్ని ఉన్నాయి. వ్యంగ్యంమాటున చురుకు పుట్టించే అలాంటి జాతీయాలలో ఇదొకటి. కొంతమంది ఎదుటివారికి విపరీతంగా నీతులు చెబుతుంటారు. తత్వోపదేశం చేస్తుంటారు. వారు మాత్రం అందుకు భిన్నంగా స్వార్థంతో ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారిని గురించి తెలియ చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంటుంది. ఈ శరీరాలు అనిత్యాలు. కనుక బతికిఉన్నకాలంలోనే అంతా మంచిగా ప్రవర్తిస్తూ నిస్వార్థంగా ఉండాలి అని ఒకాయన ఉపదేశం చేస్తూ ఆ ఉపదేశంమాటున స్వార్థంతో ధనార్జన కూడా…
-
ఎద్దు ఎండకు దున్న నీడకు లాగినట్లు..
సరిపోని జోడి, కలయిక కలవని మనస్తత్వాలు అనే లాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. బండికి ఓ వ్యక్తి ఓ వైపు ఎద్దును, మరోవైపు దున్నను కట్టాడట. ఎద్దు ఒక వైపునకు, దున్న మరో వైపునకు బండిని లాగుతూ ఉంటే ఆ బండి ప్రయాణం ఎలా ఉంటుందో ఎవరైనా వూహించవచ్చు. అలాగే భిన్న స్వభావాలున్న మనుషులు ఒకచోట చేరి భిన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ జరగాల్సిన పనిని జరగనివ్వనప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. మూలం: eenadu.net
-
ఓపలేని అత్తకు వంగలేని కోడలన్నట్టు..
బద్ధకంలాంటి వాటిలో ఒకరిని మించినవారు ఇంకొకరు అని వ్యంగ్యంగా చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. అత్తకు ఓపిక లేదు ఏ పని చేసుకోలేదు అని అనుకొంటే ఆమెకు వచ్చిన కోడలు కూడా వంగటానికి ఇబ్బంది పడుతూ ఏ పనీ చెయలేని స్థితిలో ఉండిపోయిందట. ఇదే తీరులో ఒక వ్యక్తి తనకు అప్పచెప్పిన పని తన వల్ల కాదని ఇంకొకరి సహాయం అడిగితే వారంతకన్నా శక్తిహీనులమని చెబుతున్నప్పుడు ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మూలం: eenadu.net
-
కాగితం పులి .. ఏకుల ఏనుగు
ఆకారానికి మాత్రమే గంభీరంగా ఉండి వ్యవహారంలో తీసివేతగా ఉండే వ్యక్తులను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. కాగితంలో చేసిన పులిబొమ్మ, ఏకులతో చేసిన ఏనుగు బొమ్మ ఆకారానికి మాత్రమే ఆ జంతువులను పోలి ఉంటాయి. అంతేకానీ ఆ జంతువుల్లాగా క్రూరంగానూ, బలంగానూ ఉండటం జరగదు. ఈ భావన ఆధారంగా డాంబికాలకుపోతూ కార్యశూన్యులై తిరిగేవారి గురించి చెప్పేందుకు ఈ జాతీయం అవతరించింది. మూలం: eenadu.net
-
గారాబాల బిడ్డకు…
గారాబాల బిడ్డకు గడ్డపారతో చెవులు కుట్టి చెవులకు పారలు తగిలించినట్టు అన్నది జాతీయం. కొంతమంది తమ పిల్లల విషయంలో అతి గారాబాన్ని చూపిస్తూ వారికి మేలు చేయటానికి బదులు కీడు కలిగించే పనులు చేస్తుంటారు. అలాంటి వారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. చెవులు కుట్టటానికి సన్నటి సూదులను వాడటం, చెవులకు తగుమాత్రంగా ఉండే ఆభరణాలను పెట్టడం సర్వసాధారణంగా చేసే పని. కానీ ఓ తల్లి తన బిడ్డమీదున్న అతిగారాబంతో సన్న సూదులతో…
-
ఇదిగో దున్న అంటే అదిగో వెన్న అన్నట్టు
ఎవరేం చెబితే దాన్ని గుడ్డిగా నమ్మటం, దాన్నే ప్రచారం చేయటం చాలా సందర్భాలలో లోకసహజంగా కనిపిస్తుంది. అలా అమాయకంగా నమ్మి ఎవరైనా నమ్మినదాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. అదిగో పులి అనంటే ఇదిగో తోక అనేలాంటిదే ఇది. దున్న పాలివ్వదు. పాలుంటేనే వెన్న వస్తుంది. కానీ కొంతమంది మోసగాళ్లు ఈ దున్న పాలిస్తుంది అని మోసపు మాటలు చెప్పి నమ్మిస్తున్నప్పుడు అమాయకులు దాన్ని నమ్మి ఆ పాలనుంచి వెన్న కూడా ఇంకెవరో తీశారని,…
-
కొన్న దగ్గర కొసరు కానీ కోరిన దగ్గర కొసరా అన్నట్టు
ఒకరిని యాచించేటప్పుడు లేదా కోరి అడిగి తీసుకొనేటప్పుడు ఇచ్చిన దాంతో తృప్తిపడాలి. అంతేకానీ ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అని కొసరటం పద్ధతి కాదు. డబ్బులు పెట్టి కొనేటప్పుడు కొసరినా బాగుంటుంది కానీ అడిగి తీసుకొనేటప్పుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలన్న సామాజిక జీవన విధానాన్ని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. మూలం: eenadu.net
-
కళ్లు మూయవచ్చుగానీ…
బలవంతంగా ఎవరిచేత ఏ పనీ చేయించలేము అని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఎవరైనా కలలు కనాలంటే వారి మానసిక స్థితి ఆ కలలకు సంబంధించినదిగా ఉండాలి. అంతేగాని కళ్లు మూసుకొని నిద్రపోతే కలలు వస్తాయి కదా అనుకొని అందరినీ కళ్లుమూసుకోండి కలలు కనండి అని బలవంతపెడితే కళ్లు మూసుకుంటారేమో కాని కలలు కంటారన్న మాట మాత్రం సత్యదూరంగానే ఉంటుంది. ఈ భావన ఆధారంగానే ఏ వ్యక్తి చేత కూడా బలవంతంగా ఏ పని…
-
మొండికి సిగ్గులేదు మొరటుకు ఎగ్గు లేదు
మానవ మనస్తత్వాల విశ్లేషణ చేసే జాతీయాలలో ఇది కూడా ఒకటి. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు ఆలోచించుకోకుండా మొండిగా కొందరు వ్యవహరిస్తుంటారు. ఈ వ్యవహారం సిగ్గులేనితనంగా కూడా ఉంటుంది. అలాగే మొరటుగా మరికొందరు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటివారు ఎగ్గును లెక్కచేయరు. ఎగ్గు అనంటే కీడు అనర్థం. మొరటుగా ఆలోచించేవారు తమకు కీడు కలుగుతుందన్న ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తారన్నది భావన. ఆ భావనల ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ీమొండికి సిగ్గులేదు మొరటుకు ఎగ్గు లేదన్నట్టుంది నీ ప్రవర్తన. దాన్ని…
-
తెలుగు యునికోడ్ ఖతులు (ఫాంట్స్)
ఇప్పుడు తెలుగులో కొత్త యునికోడ్ ఖతులు(fonts) అందుబాటులో ఉన్నాయి .. ఇవి ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రబుత్వం అందుబాటులో ఉంచింది.. ఈ ఖతులను మీ కంప్యూటర్ లో నిక్షిప్తం చేసుకొని వాడుకోవచ్చు.. వివరాలకు ఈ క్రింది లంకెను చూడండి http://teluguvijayam.org/fonts.html ఖతి పేరు నమూనా లంకెలు దిగుమతికై లంకెలు ఖతి నమూనా దిగుమతి కై (to Download) ఖతి నమూనా దిగుమతి కై (to Download) ఖతి నమూనా దిగుమతి కై (to Download) ఖతి నమూనా…