Latest posts

  • 1899: ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖులు శొంఠి దక్షిణామూర్తి గారి జయంతి

    1899: ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖులు శొంఠి దక్షిణామూర్తి గారి జయంతి 2012-12-22

    Read more

  • 1887: ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ జయంతి

     1887: ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ జయంతి 2012-12-22

    Read more

  • నేటి నుండి కాకతీయ ఉత్సవాలు

    రుద్రమదేవి పట్టాభిషేకం జరిగి 750 సంవత్సరములు అయిన సందర్భంగా మరియు రామప్ప గుడి నిర్మాణం జరిగి 800 సంవత్సరములు గడిచిన సందర్బంగా కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు 2012-12-21

    Read more

  • ‘విశ్వసుందరి’గా అమెరికా వనిత

    అమెరికాకు చెందిన ఒలీవియా కల్పో మిస్‌ యూనివర్స్‌-2012గా ఎంపికైంది. ఫిలిప్పీన్స్‌, వెనెజులా దేశాలకు చెందిన సుందరీమణులు వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. భారత్‌కి చెందిన శిల్పాసింగ్‌ టాప్‌ -16 వరకూ మాత్రమే చేరుకోగలిగింది. లాస్‌వెగాస్‌లోని ప్లానెట్‌ హాలీవుడ్‌లో జరిగిన ఈ అందాలపోటీలో గత ఏడాది విశ్వసుందరి కిరీటం గెలుచుకున్న అంగోలా వనిత లైలా లోప్స్‌ ఈ ఏటి విజేతకు కిరీటధారణ చేశారు. 2012-12-19

    Read more

  • విశాఖలో అగ్ని ప్రమాదం

    జీవీఎంసీ 69వవార్డు జడ్పీ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న ఎస్సీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఇళ్లల్లో నివసిస్తున్న వారంతా కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. బోడి విజయ అనే మహిళ ఇంటి వెనుక నుంచి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి గాలి తోడవటంతో మిగిలిన ఇళ్లన్నీ కాలిపోయాయి. 2012-12-19

    Read more

  • హిమాచల్‌ప్రదేశ్‌ లో కాంగ్రెస్ విజయం

    హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో.. హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌ పార్టీ అధికార పీఠానికి చేరువయ్యింది. మొత్తం 68 స్థానాల్లో 36 స్థానాలను కైవసం చేసుకుంది. 26 స్థానాలకే పరిమితమైన భాజపా.. ఓటమి పాలవడం కమలనాధులను నిరాశపరిచింది. భాజపా ఆవిర్భావం నుంచి బలంగా వున్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్‌ ఒకటి. ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్‌ ధూమల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీ విజయావకాశాలకు గండికొట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల ప్రచార సమయంలోనే రాష్ట్రానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వీరభద్రసింగ్‌పై వచ్చిన…

    Read more

  • గుజరాత్ లో మూడవ సారి నరేంద్రమోడీ ఘన విజయం

    గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ వూహించిన విధంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి, భాజపా నేత మోడీ విజయబావుటా ఎగురవేశారు. ఆయన ఒంటి చేత్తో భాజపాను మూడోసారి అధికారంలోకి తీసుకురాగలిగారు. ఈ గెలుపుతో ఆయన హ్యాట్రిక్‌ సాధించినట్త్లెంది. వరుసగా మూడోసారి ఆయన గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 182 స్థానాల్లో 121 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యం సాధించారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించి, విజయఢంగా మోగించిన మోడీని.. కాంగ్రెస్‌ వ్యూహాలు అడ్డుకోలేకపోయాయి.…

    Read more

  • వర్ధమాన కథానాయకుడు భరత్‌ అలియాస్‌ యశోసాగర్‌(26) మృతి

    కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ధమాన కథానాయకుడు భరత్‌ అలియాస్‌ యశోసాగర్‌(26) మృతి చెందారు. బెంగళూరుకు 120 కి.మీ. దూరంలో నాలుగో నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు కల్వర్టు గోడను ఢీకొట్టింది. ముంబయినుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న విశ్వనాథరెడ్డి(23), ముందు సీట్లో కూర్చున్న యశోసాగర్‌కు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2012-12-19

    Read more

  • హైదరాబాద్‌-కర్ణాటకకు ప్రత్యేక హోదా

    హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి విడిపోయి కర్ణాటకలో విలీనమైన హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించింది. ఈ మేరకు రాజ్యాంగంలో 371జే అధికరణం చేరుస్తూ 118వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ సవరణ బిల్లుకు మంగళవారం లోక్‌సభ 343-0 ఓట్ల తేడాతో ఆమోద ముద్రవేసింది. దీనివల్ల గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు లభిస్తాయి. గవర్నర్‌ హైదరాబాద్‌-కర్ణాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకొనే వెసలుబాటు కలుగుతుంది. గుల్బర్గా, బీదర్‌, రాయచూరు, కొప్పళ్‌, యాద్గిరి, బళ్లారి జిల్లాలతో కూడిన హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతాభివృద్ధికి…

    Read more

  • బేగంపేట విమానాశ్రయంలో కాలి బూడిదైన ప్రభుత్వ హెలికాప్టర్‌, ఆరు శిక్షణ విమానాలు.

    బేగంపేట విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ హెలికాప్టర్‌ ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో పాటు ఆరు శిక్షణ విమానాలు కాలిబూడిదయ్యాయి. విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉన్న ఏపీ ఏవియేషన్‌ అకాడమీలోని హ్యాంగర్లలో (విమానాలు, హెలికాప్టర్లుంచే చోటు)ని ఒకదాంట్లో మంటలు అంటుకున్నాయి. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ శబ్దంతోపాటు మంటలు ఎగిసిపడ్డాయి. 2012-12-18

    Read more