Latest posts
-
1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటించాడు.
2012-12-19
-
1971: బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది.
2012-12-18
-
ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ కవి “గరిమెళ్ళ సత్యనారాయణ” గారి వర్దంతి
గరిమెళ్ళ 1952 డిసెంబర్ 18వ తేదీన స్వర్గస్తులైనారు 2012-12-18
-
తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు “మాధవపెద్ది సత్యం” గారి వర్దంతి
మాధవపెద్ది సత్యం (1922 – 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ మరియు సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు. 2000, డిసెంబర్ 18న స్వర్గస్తులైనారు. 2012-12-18
-
ప్రముఖ తెలుగు చలనచిత్ర నటీమణి శ్రీమతి సూర్యాకాంతం గారి వర్దంతి
తెలుగు చలనచిత్ర నటీమణి సూర్యకాంతం గారు 17 డిసెంబర్, 1996న స్వర్గస్థులయ్యారు 2012-12-17
-
ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి వర్దంతి
ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు 1957, డిసెంబర్ 17న స్వర్గస్థులయ్యారు. 2012-12-17
-
అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభం
చెన్నై, డిసెంబర్ 13: ‘చెన్నై అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని తమిళనాడు సమాచారశాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ గురువారం ప్రారంభించారు. ఇండో సినీ అప్రిసియేషన్ ఫౌండేషన్ (ఐసీఏఎఫ్), తమిళ సినిమా కలిసి సంయుక్తంగా గత పదేళ్లుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. 2012-12-13
-
అమెరికా పాఠశాలలో కాల్పులు: 20 మంది మృతి
అమెరికా: అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం న్యూటౌన్‌లోని శాండీ హుక్ ఎలమెంటరీ పాఠశాలలో ఓ అగంతుకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 12మంది విద్యార్థులతో సహా మొత్తం 20 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. కాల్పుల సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకుని పాఠశాల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాన్బరీ మేయర్ మార్క్ బౌటెన్ తెలిపారు. పాఠశాలలో…
-
కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించిన చంద్రబాబు పాదయాత్ర
ఆదిలాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం బాదన్‌కుర్తి వద్ద కరీంనగర్ జిల్లాలో ప్రవేశించింది. ఆదిలాబాద్ జిల్లాలో 9 రోజుల పాటు సాగిన పాదయాత్రలో చంద్రబాబు 138 కి.మీ. నడిచారు. బాదన్‌కుర్తి గోదావరి వంతెన వద్ద జిల్లా అధ్యక్షుడు గోడెం, ఎంపీ రాథోడ్ చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం చంద్రబాబు ఆదిలాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించారు. 2012-12-15
-
ఈ ఏడాది వార్తల్లో వ్యక్తి.. కేజ్రీవాల్: యాహూ
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది వార్తల్లో వ్యక్తుల జాబితాలో అరవింద్ కేజ్రీవాల్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆన్లైన్లో అత్యధికంగా శోధించిన (సెర్చ్) ప్రముఖ వ్యక్తిగా శృంగార తార సన్నీ లియోన్ తొలిస్థానంలో నిలిచినట్లు ప్రముఖ సెర్చింజిన్ యాహూ గురువారం వెల్లడించింది. కేజ్రీవాల్ తర్వాతి స్థానాల్లో వరసగా గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ, పాక్ సాహస బాలిక మలాలా, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, రాబర్ట్ వాద్రాలు ఉన్నారు. 2012లో సైఫీనా (సైఫ్, కరీనా) జంట పెళ్లి సమాచారాన్ని…