Latest posts
-
ఎంత తొండమున్నా దోమ ఏనుగు కాదు..
కొన్ని సందర్భాలలో దుర్మార్గులకు, మంచివారికి ఏదో ఒకటి రెండు పోలికలు కనిపిస్తుంటాయి. అంత మాత్రం చేత దుర్మార్గులు ఎప్పుడూ మంచివారితో సమానులు కారు అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఏనుగుకు తొండమున్నట్టే దోమకు కూడా చిన్న తొండం లాంటి అవయవం ఉంటుంది. కానీ ఏనుగువల్ల సమకూరే ప్రయోజనాలు వేరు. దోమవల్ల కలిగే నష్టాలు వేరు. మంచివారు, చెడ్డవారు ఒకటిరెండు పోలికలతో ఉన్నా చెడ్డవారు మంచివారుగా ఎప్పుడూ ఉండలేరు అని తెలియచెప్పే జాతీయం ఇది.…
-
ఆలి ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం
భార్యను కష్టపెట్టకూడదని అలా చేస్తే ఆ ఇంట్లో ఏదీ కలిసిరాదనే విషయాన్ని వివరించి చెప్పే జాతీయం ఇది. మన దేశం ప్రధానంగా వ్యవసాయ దేశం. కనుక వ్యవసాయపరమైన ఎద్దు ఏడ్పును ఆలి ఏడుపుతో పోల్చి చెప్పటం జరిగింది. వ్యవసాయదారుడు ఎద్దును సరిగా పోషించకుండా వ్యవసాయం చేయాలనుకొంటే ఎలా నష్టం కలుగుతుందో అలాగే భయంకరమైన నష్టం ఆలిని ఏడిపించిన భర్తకు కూడా కలుగుతుందని ఉదాహరణపూర్వకంగా ఈ జాతీయం వివరిస్తోంది. మూలం: ఈనాడు.నెట్
-
గడ్డపార తినేవాడికి…
గడ్డపార తినేవాడికి శొంఠి కషాయం ఏం పన్చేస్తుంది అన్నది జాతీయం. దుర్మార్గాలలోనూ, దురలవాట్లలోనూ మితిమీరిన వారికి కొద్దిపాటి శిక్షవల్ల ఏ ప్రయోజనమూ ఉండదని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఇనుముతో చేసిన గడ్డపారను నమిలి తినేవాడి జీర్ణశక్తి ఎలాంటిదో ఊహించవచ్చు. అలాంటి వాడికి ఎప్పుడైనా అజీర్ణం చేసినప్పుడు అందరికీ ఇచ్చినట్టుగా శొంఠి కషాయం ఇస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది భావన. ఈ భావన ఆధారంగానే దుర్మార్గాలలో శక్తివంతులైన వారికి చిన్నచిన్న శిక్షలవల్ల ఉపయోగం ఉండదని…
-
కడవేరు మిగిలినా గరిక చిగుర్చక మానదన్నట్టు
కార్యదక్షుల సంకల్పదీక్షను గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గరిక మొక్క అన్ని వేళ్లూ తెగిపోయినా, ఒకేఒక్క వేరున్నా మళ్లీ ఆ ఒక్క వేరుతోనే శక్తి పుంజుకొని చిగురుపెట్టి పెద్దదవుతుంది. అదే తీరులో సంకల్ప దీక్ష పోయినా ఏ ఒక్క చిన్న అవకాశం మిగిలి ఉన్నా దాంతోనే తన పని సాధించుకొస్తాడన్నది భావన. 'కడవేరు మిగిలినా గరిక చిగుర్చక మానదన్నట్టు ఈ ఒక్క అవకాశం చాలు వాడు మళ్లీ కోలుకోవటానికి' అనేలాంటి ప్రయోగాలున్నాయి. మూలం:…
-
రాఘవా స్వస్తి, రావణా స్వస్తి అన్నట్లు
లోకమంతా శుభకరంగా ఉండాలని కొంతమంది కోరుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పాపం, పుణ్యం పరమాత్ముడికే ఎరుక, నేను మాత్రం ఎలాంటి భేదాన్ని పాటించకుండా అందరికీ శుభం కలగాలని కోరుకుంటాను అని రాముడులాంటి వారైనా, రావణుడిలాంటివారు ఎవడైనా సరే అంతా క్షేమంగానే ఉండాలన్నది నా ఆకాంక్ష అని అనుకునేవారు ఈ జాతీయాన్ని వాడుతుండటం కనిపిస్తుంది. మూలం: ఈనాడు.నెట్
-
కూటికి లేకున్నా కాటుక చుక్క మానన్నట్లు
కాటుక పెట్టుకోవటం అలంకార సూచకం. కూటికి లేకపోవటమంటే పేదరికంలో మగ్గిపోవటమని, ధనహీనస్థితి అని అర్థం. కొంతమంది ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా తిండైనా మానుకుంటారు. కానీ అలంకారాలు చేసుకోవటం మానుకోరు. అలాంటి వారిని చూసి మాట్లాడుకునే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. 'కూటికి లేకున్నా కాటుక చుక్క మానన్నట్లు ఇప్పుడు సరిపోయినన్ని డబ్బులు లేనప్పుడు ఇవి కొనటం అనవసరం' అనే లాంటి ప్రయోగాలున్నాయి. సేకరణ: ఈనాడు.నెట్
-
గాజుపూసల గనిలో మణి దొరకదన్నట్టు
విలువలు లేనివారు ఎక్కువగా ఉన్నచోట విలువ కలిగినవారు ఉండరు అని నిర్ధరించి చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మణిమాణిక్యాల కన్నా గాజుపూసలకు విలువ తక్కువగా ఉంటుంది. కేవలం గాజుపూసలు దొరికే చోట విలువైన మణిమాణిక్యాలు ఉండటానికి అవకాశం లేదు అనే భావన ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. ''గాజు పూసల గనిలో మణి దొరకదన్నట్టు అక్కడున్న వారిలో ఎవరూ మంచివారు లేరు'' అనేలాంటి ప్రయోగాలున్నాయి. సేకరణ: ఈనాడు.నెట్
-
చెరువు ముందు చలివేంద్రం అన్నట్టు
నిరుపయోగమైన పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పూర్వం చెరువులు, బావులులాంటివి మంచినీరు తెచ్చుకోవటానికి స్థానాలుగా ఉండేవి. కావలసినవారు కావలసినంత నీరు చెరువులో నుంచి తెచ్చుకుంటుండేవారు. ఓ వ్యక్తి అలాంటి చెరువు ముందు ఒక చలివేంద్రాన్ని పెట్టాడట. అటువచ్చే వారు తన దగ్గర నీళ్లు తాగాలన్నది అతడి భావన. కానీ పక్కనే ఎంతో సులువుగా చెరువులోకి దిగి స్వేచ్ఛగా నీళ్లు తెచ్చుకొనే వీలున్నందువల్ల ఎవరూ చలివేంద్రం దగ్గరకు వెళ్లి నీళ్లు అడిగి తీసుకోవటం లేదట.…
-
కూర్చొని లేవలేనమ్మ వంగొని శివరాత్రికి వస్తానన్నట్టు
అసమర్థులు చెప్పే ప్రగల్భాలను గురించి వివరించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. కూర్చొన్న చోటు నుంచి లేవటానికే శక్తిలేనప్పుడు నడుము నొప్పిపుట్టేలా వంగి ఎంతోదూరం నడుచుకొంటూ వెళతాననటం ఎంత నమ్మశక్యమో అదే తీరులో ఏమాత్రం శక్తిలేకపోయినా ఎన్నెన్నో చేసి తీరుతామంటారు కొందరు.ఈ చిన్నపని చేసిపెట్టలేనివాడు రేపంతా నాదగ్గరే ఉండి పనంతా చేస్తానంటున్నాడు. కూర్చొని లేవలేనమ్మ వంగొని శివరాత్రికి వస్తాన్నన్నట్టుంది వాడు చెప్పే మాట' అనేలాంటి ప్రయోగాలున్నాయి. సేకరణ: ఈనాడు.నెట్
-
ఆరేసి మూడెత్తుకున్నట్టు
మూడు పువ్వులు, ఆరుకాయలు అనే దానికి వ్యతిరేకార్థం ఇచ్చే జాతీయం ఇది. ఆరు వెయ్యడమంటే ఆరు ఖర్చుపెట్టడం అని అర్థం. ఆరు ఖర్చుపెడితే దక్కింది మూడేనట. అంటే పెట్టుబడిలో సగానికి సగమే దక్కిందన్నమాట. ఇలా నష్టపోయిన సందర్భాలలో ఉపయోగించిన జాతీయం ఇది. వ్యాపారమేమీ బాగోలేదు. ఆరేసి మూడు తీసుకున్నట్లుంది అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం కనిపిస్తుంది. సేకరణ: ఈనాడు.నెట్