Latest posts
-
చేతిలో కాసు నోటిలో దోసె అన్నట్టు
డబ్బిచ్చిన తర్వాతే ఏ పనైనా జరిగేది అని, అప్పు ఇవ్వడం లేదని చెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. సర్వకాలాలలోనూ జాతీయాలు ఆవిర్భవిస్తూనే ఉంటాయి. ఆనాటి కాలపరిస్థితులు వీటికి వేదికలవుతాయి. అప్పుడు వాడుకలో ఉన్న పదాలతోనే జాతీయాలు రూపొందుతుంటాయి. అలాంటి వాటి వరసలోనిది ఈ జాతీయం. ముందుగా డబ్బు ఇస్తేనే దోసె ఇస్తానని అన్న వ్యాపారి మాటలే దీనికి ఆధారం. చేతిలో కాసు నోటిలో దోసె అన్నతీరులో ముందుగా డబ్బిస్తేనే మనం అడిగిన పని చేస్తామంటున్నాడు…
-
తల వంచుకుంటే ఏడు గోడల చాటన్నట్టు
లౌక్యం తెలుసుకొని మసులుకోవాలి అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. అనువుగాని చోట అధికులమనరాదు అనే దానికి ఇది సమానార్థకం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కాస్తంత ఓపిక పట్టినట్టు, అవమానం కలిగినప్పుడు అవమాన పరిచినవారిని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు కాస్తంత తగ్గితే ఆ తర్వాత అంతా చక్కగా నడుస్తుందని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఏడు గోడల చాటు అనంటే రక్షణతో ఎంతో భద్రంగా ఉండటం అని అర్థం. కొద్దిగా తగ్గిఉంటే…
-
పూసిన పూలన్నీ కాయలవుతాయా
పూసిన పూలన్నీ కాయలవుతాయా అన్నది జాతీయం. ప్రయత్నం విఫలమైన సందర్భంలో విసిగిపోవద్దని, మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయమని ధైర్యం చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. చెట్టుకు పువ్వులు పూస్తాయి. అయితే పూసిన పూలన్నీ కాయలవ్వవు, పండ్లుగా మారవు. కొన్ని మధ్యలోనే రాలిపోతాయి. కొన్ని పిందె వేసే స్థితికి వచ్చి రాలిపోతాయి. కాయలుగా మారేవి కొన్నే. పండ్లుగా మారేవి అందులో కొన్నే. ప్రకృతిలో కనిపించే ఈ సత్యాన్ని గమనించి అనుకొన్న పని జరగనప్పుడు ఎంతగా కష్టపడినా…
-
నేలరాయి నెత్తికెత్తుకున్నట్లు
అనవసరమైన పనిని మీద వేసుకొని కష్టాలను అనుభవించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఓ వ్యక్తి కాలిబాటన నడుస్తూ ఉంటే పక్కన నేలమీద ఒక బండరాయి కనిపించిందట. అతడు తన దోవన తాను పోక ఆ రాయిని పెకలించి ఎత్తి నెత్తిన పెట్టుకున్నాడట. ఆ తర్వాత ఆ బరువు మొయ్యలేక కష్టాన్ని అనుభవించాడు అని చెప్పే సంఘటన ఈ జాతీయ ఆవిర్భవానికి వేదిక. ఇలాగే కొంతమంది అనవసరమైన పనులను మీద వేసుకొని ఇబ్బందులు పడుతుంటారు.…