Latest posts
-
నరుడెయైన లేక నారాయణుండైన
నరుడెయైన లేక నారాయణుండైన తత్త్వబద్ధుడైన దరణి నరయ మరణమున్నదనుచు మదిని నమ్మగవలె విశ్వదాభిరామా వినురవేమ తాత్పర్యము మానవుడైన, దానవుడైనా, తత్త్వవేత్తయైనా, ఇంకెవరైనా సరే శరీరధారికి మరణమనేది తప్పనేతప్పదని గ్రహించవలెను
-
దేవుడనగ వేరే దేశముందున్నాడె
దేవుడనగ వేరే దేశముందున్నాడె దేహితోడ నెపుడు దేహమందె వాహనములనెక్కి పడిదోలుచున్నాడు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము మన ఇంద్రియాలను నడిపించే జీవ చైతన్యమే దేవుడు. ఆ దేవ చోదితుడైన నరుడు తన వాళ్లకోసం పాటుపడాలి.
-
దొంగమాటలాడ దొరుకునె మోక్షము
దొంగమాటలాడ దొరుకునె మోక్షము చేతగాని పలుకు చేటుదెచ్చు గురువుపద్దు కాదు గునహైన్య మదియగు విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము గురువులమని చెప్పి దొంగ మాటలు చెప్పినంతమాత్రాన ముక్తి లభించదు. చేతగాని మాటల వల్ల చేటు కలుగుతుంది. హీనమైన గుణాలుండడం గురువు లక్షణం కాదు.
-
దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు
దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు దశయలేమి నెంత్రు తక్కువగను దశయన గమ ధన దశమొక్కటే దశ విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము ఎవరి దగ్గరైనా ధనం ఉంటేనే వారిని తమ వారని చెప్పుకోడానికి ఇష్టపడతారు. డబ్బు లేకపోతే ఎంత మంచివారినైనా తమ బంధువులని చెప్పుకోరు. మనుషుల మంచితనానికంటే డబ్బుకే విలువఇస్తారు. ధనం ఉంటేనే అదృష్టం అని భావిస్తారు.
-
ధూమాదుల నావృతమై
ధూమాదుల నావృతమై వ్యోమంబునకెగని కలియు నుపములు తనలో శ్రీమించు శివుని జేరును గామాదుల గలియడతడు ఘనముగ వేమా తాత్పర్యము భూమిపై ఏర్పడే పొగ మెల్లగా ఆకాశంలో కలుస్తున్నట్లుగానే, మానవునిలో ఉన్న జీవాత్మ ఈశ్వరునితో కలుసుకొనును. అప్పుడు జీవునికి కామాది వికారములుండవు.
-
ద్వారంబంధమునకు దలుపులు గడియలు
ద్వారంబంధమునకు దలుపులు గడియలు వలెనె నోటికొప్పుగల నియతులు ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన విశ్వదాభిరామా వినురవేమ తాత్పర్యము ద్వారానికి తలుపులు గడియలు ఉన్నట్లే మాటకు కూడా నియమములు రక్షణలై కలవు. ధర్మమెరిగి తగినట్లు మాట్లాడినవాడే ధన్యుడు, ఉత్తముడగును
-
తనగుణము తనకు నుండగ
తనగుణము తనకు నుండగ నెనయంగా నోరుని గుణము నెంచును మదిలో దన గుణము తెలియ కన్యుని బనిగొని దూషించువాడు వ్యర్థుడు వేమా! తాత్పర్యము మంచివో చెడ్డవో, తన గుణాలను తాను చూడకుండా ఇతరుల గుణాలను ఎంచుట, తనను తాను గమనింపక ఇతరులను దూషించుట తగదు. అలా చేయువాడు వ్యర్థుడు.
-
తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల
తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల నొనర శివుని జూడ నుపమ గలదు మనసు చదరనీక మహిలోన జూడరా విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము జనులు తపస్సు చేసి కృశించుట వ్యర్థము. భగవంతుని చూచుటకిది మార్గము కాదు. మనస్సును చెదరనీయక స్థిరముగా నుంచి ధ్యానించినచో దేవున్ని చూడవచ్చును
-
తనదు మనసుచేత దర్కించి జ్యోతిష
తనదు మనసుచేత దర్కించి జ్యోతిష మెంత చేసే ననుచు నెంచి చూచు తన యదృష్టమంత దైవ మెఱుంగడా విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము తన ప్రయత్నాలు విఫలమైనప్పుడు మూర్ఖుడు జ్యోతిష్యమని, వాస్తుని వ్యర్థ వ్యాఖ్యలు చేసి ఆత్మవంచన చేసుకుంటాడు. తన విధిరాతను బట్టి అలా జరిగిందని భావించడు. తన కర్మల ఫలితమే అలా జరిగిందని, అది దేవుడే అలా చేశాడని గ్రహించడు.
-
తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి
తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి మిగిలి వెడలవేక మిణుకుచున్న నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము ప్రతి చిన్న విషయానికి విరక్తి చెంది ఎప్పటికీ దాని నుంచి బయటపడలేక అల్లాడేవాడు బలహీనుడు. ఆ వలలో చిక్కుకొని తప్పించుకోలేక నిర్వీర్యమైపోయేవాడికి ఎట్టి పరిస్థితుల్లోను ముక్తి లభించదు.