Latest posts

  • అన్నగారు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ “ఎన్.టి.ఆర్”

    మదరాసులో ఆయన వుండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు ఒక మొక్కుబడిగా మదరాసు వెళ్ళి ఉదయమే ఆయనను దర్శించుకుని వచ్చేవారు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. హైదరాబాదు లోని హుస్సేన్‌సాగర్ కట్టపై ( ట్యాంకుబండ్) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పాడు. “నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ నినదించి, సైనిక దుస్తులు వేసుకుని, తెలుగువారి కీర్తి…

    Read more

  • “షహెన్షా” సి.కె.నాయుడు

    బౌలర్ గా తన ఫస్ట్ క్లాసు కెరీర్ ని మొదలు పెట్టి, బారీ సిక్సర్లతో, సి.కె.నాయుడు అంటే సిక్సర్ల నాయుడు అనిపించుకున్న స్పోర్ట్స్ హీరో ఆయన. భారతదేశ టెస్ట్ క్రికెట్ మొట్టమొదటి కెప్టెన్ సి.కె.నాయుడు, (ఇంగ్లాండ్ తో 1932లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన బారతీయ జట్టుకి కెప్టెన్) కొట్టారి కనకయ్య నాయుడు, 1895, అక్టోబర్ 31న నాగపూర్లో ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజులనుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ…

    Read more

  • ఏ దేశమేగినా ఎందు కాలెడినా

    ఈ జాతీయగీతాన్ని రాయప్రోలు సుబ్బా రావు గారు రచించారు. రాయప్రోలు సుబ్బారావు రాసిన గీతాలలో అందరినోళ్లలోనూ బాగా నానిన “జన్మభూమి” గీతంలో తెలుగుదనం, జాతీయాభిమానం, గత వైభవ సంకీర్తనం, ప్రబోధం లాంటివి తొణికిసలాడుతుంటాయి. ఇప్పటికీ ఈ గీతం ఉత్తమ దేశభక్తి ప్రబోధంగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు… రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి.   ఏ దేశమేగినా ఎందు కాలెడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ…

    Read more

  • తమ్ముడా!

    రాయప్రోలు సుబ్బారావు గారి కలం నుండి జాలువారిన దేశభక్తి గీతం, శ్రీలు పొంగిన జీవగడ్డయు, పాలు పారిన భాగ్యసీమయి, వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా! వేద శాఖలు పెరిగె నిచ్చట, ఆదికావ్యం బందెనిచ్చట, బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా! విపినబంధుర వృక్ఖవాటికన వుపనిషన్మధు నొలికెనిచ్చట విపులతత్వము విస్తరించిన విమలతలమిదె తమ్ముడా! సూత్రయుగముల శుధ్ధవాసన క్షాత్రయుగముల శౌర్యచండిమ చిత్రదాస్యముచే చరిత్రల చెరిగిపోయెనె చెల్లెలా! మేలికిన్నెర మేళవించీ రాలు కరగగ రాగమెత్తీ పాలతీయని బాలభారత…

    Read more

  • ఛాందస భావాలకు బావాలకు తొలి అడ్డుకట్ట “వేమన”

    “విశ్వదాభిరామ వినురవేమ” అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి.  పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించాడని అంటున్నారు. ఆయన నందన నామ సంవత్సరము, ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఇతను యవ్వనంలో వేశ్యాలోలుడిగా జీవించాడు. కొంతకాలానికి విరక్తిచెంది,…

    Read more

  • గురజాడ అప్పారావు గారి రచన ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’

    బాల్యవివాహపు ఉక్కుకోరల్లో చిక్కుకొని బలైపోయిన ఒక అమాయక బాలిక దీనగాథ, పాషాణ కఠిన కర్కశ హృదయన్నైనా కరగించి పారేస్తుంది. ఇందులోని ఛందస్సు కూడ క్రొత్తదే. ఈ గేయనాటిక ఒక చక్కని నృత్య గేయనాటికగా ఆంధ్రదేశంలో ఎంతో పేరు గడించింది. గురజాడ సృష్టించిన “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అనే గేయ నాటకం ఇప్పటికీ తెలుగు వారి కంట తడి పెట్టిస్తూనే ఉంది.         మేలిమి బంగరు మెలతల్లారా !         కలువల కన్నుల కన్నెల్లారా !         తల్లులగన్నా…

    Read more

  • శ్రీశ్రీ కలం నుండి జాలువారిన గొప్ప దేశభక్తి గీతం “పాడవోయి భారతీయుడా”

    స్వాతంత్ర్యం సంపాదించుకున్న మనం దాని విలువను గుర్తించగలిగామా! ఆ వీరుల త్యాగఫలాన్ని కున్న విలువ ఏమిటి? ఒకరినొకరం గౌరవించుకోలేని దుస్థితిలో ఉన్నాం. విపరీతమైన ఈర్ష్యా, ద్వేషాలు పెరిగిపోయినాయి. శ్రీ శ్రీ వ్రాసిన ఈ పాడవోయి భారతీయుడా–ప్రభోధగీతం మనం తప్పని సరిగా వినాలి ఈ పాటలో వున్న నగ్నసత్యాలు ఇప్పటికీ సంఘంలో పచ్చి నిజాలుగా మన కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఆనాడే బ్లాక్ మార్కెట్, పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, ప్రాంతీయ వాదాలు ఆయన ఊహించి పాటలో నిక్షిప్తం చేసారు. …

    Read more

  • మొదటి ఆధునిక తెలుగు కావ్యం: “ముసలమ్మ మరణం”

    డా.కట్టమంచి రామలింగారెడ్డి రచించిన “ముసలమ్మ మరణం”. తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన కావ్యం. ఇది “ముసలమ్మ” అనబడే ఒక గ్రామవనిత యొక్క త్యాగమయ, దయనీయ గాథ.కథకు మూలం చార్లెస్ పి. బ్రౌన్ రచించిన The History of Anantapuram (అనంతపుర చరితం). 1899లో ఆంధ్ర భాషాభిరంజిని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900లో అచ్చయ్యింది. 107 గద్య పద్యాలున్న చంపూ కావ్యం ‘ముసలమ్మ మరణం’ కథ. 17వ పద్యంతో కథ మొదలవుతుంది. 104వ పద్యానికి…

    Read more

  • తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

    ఈ పాటను డా. సి. నారాయణ రెడ్డి గారు “తల్లా! పెళ్లామా!” చిత్రం కోసం వ్రాసారు. తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది .. అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా.. తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు…

    Read more

  • జాషువా

    ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. ఈనాడు సంఘసంస్కర్తలకు జాషువా ఆదర్శ పురుషుడు. తెలుగు ప్రజల కవి. భాషా చంధస్సులో భావ కవి. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని ఆయన చెప్పారు. నిత్య జీవితంలో కాని…

    Read more