Latest posts

  • కదలనీయకుండ గట్టిగా లింగంబు

    కదలనీయకుండ గట్టిగా లింగంబు  కట్టివేయనేమి ఘనత కలుగు  భావమందు శివుని భావించి కానరా  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము పెద్ద శివలింగాన్ని కదలకుండా మెడలో కట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. మనస్ఫూర్తిగా శివుడిని ధ్యానించి సేవిస్తే చాలు.

    Read more

  • కపటి వేషమూని కడగండ్లు పడనేల

    కపటి వేషమూని కడగండ్లు పడనేల  విపిన భూమి తిరిగి విసుగనేల  యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా  విశ్వదాభి రామ వినుర వేమ తాత్పర్యము కపట వేషాలు వేసి కష్టాలు పడడం, అడవులకు వెళ్ళి విసుగు పుట్టేలా తిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ముక్తిని పొందడానికి ఎన్నో సులభ మార్గాలు ఉన్నాయి. వాటిని ఆచరిస్తే చాలు.

    Read more

  • కోపమున ఘనత కొంచెమైపోవును

    కోపమున ఘనత కొంచెమైపోవును  కోపమునను గుణము కొరతపడును  కోపమణచనేని కోరికలీడేరు  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము కోపం వల్ల మనిషి తన కీర్తిని తానే తగ్గించుకుంటాడు. ఉన్న కొద్ది సుగుణం కోపం వల్ల తక్కువైపోతుంది. కోపాన్ని అణుచుకుంటే లక్ష్యాల సాధన సులభమవుతుంది. అందుకే శాంతమే శ్రీరామరక్ష.

    Read more

  • ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు

    ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు  నం దొకండు విడ్డ పొందు చెడును  స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి  విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము కలసికట్టుగా ఉంటే ఎలాంటి కార్యాన్నైనా సాధించవచ్చు. అయిదు వేళ్లు కలిపితే చేయి మరింత బలంగా మారుతుంది. కుటుంబంలోను, కులం, వర్గంలోనూ, అందరూ సయోధ్యగా ఉంటేనే పనులు జరుగుతాయి.

    Read more

  • ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు

    ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు  దాని బలిమి నెంతయైన గూడు  గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు  విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము ఐకమత్యం ఎంతో ముఖ్యమైనది. దానిలో ఎంతో బలం ఉంది. గడ్డి పరకలను ఒక్కటిగా చేర్చి ఏనుగును కూడా బంధించవచ్చు. ఐకమత్యంగా ఉంటే ఎంతని కార్యాన్నయినా సాధించవచ్చు.

    Read more

  • ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా

    ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా  నలుపు నలుపేకాని తెలుపుకాదు  కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఎలుగుబంటి తోలును ఎన్నాళ్ళు ఉతికినా రంగు అలాగే ఉంటుంది తప్ప తెలుపుగా ఎట్టి పరిస్థితుల్లోను మారదు. కొయ్యబొమ్మను తీసుకువచ్చి ఎంతకొట్టినా దానికి సుగుణాలు అలవాటుకావు. అదేవిధంగా మూర్ఖుడికి ఎంత బోధించినా జ్ఞానం తలకెక్కదు.

    Read more

  • ఎండిన మా నొకటడవిని

    ఎండిన మా నొకటడవిని  మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్‌  దండిగల వంశమెల్లను  చండాలుండొకడు పుట్టి చదుపును వేమా! తాత్పర్యము ఎండిన మ్రాను అడవిలో ఉన్నచో అందుకు పుట్టిన అగ్ని వనమునంతయున కాల్చును. వంశములో ఒక నీచుడు పుట్టి ఆ వంశమునంతను నశింపజేయును.

    Read more

  • ఇంటి ఇంటిలోననీశ్వరుడుండగ

    ఇంటి ఇంటిలోననీశ్వరుడుండగ  నంటి చూడలేక యడవులందు  నుంట మేటంచునుందురా జోగులై  విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము ఎల్లప్పుడూ ఈశ్వరారాధన చేస్తూ ఉండాలి. అయితే ఈశ్వరుడెవరు, ఎక్కడ ఉంటాడనీ వెతికేందుకు అడవులకు వెళ్లాల్సిన అవసరంలేదు. తనలోనే తత్వం ఉంచితే, ఇంట్లోనే ఈశ్వరుడుంటాడు. అందరిలోనూ ఆ దేవుడు ఉంటాడు.

    Read more

  • ఇంగలంబు తోడ నిల సల్పుతోడను

    ఇంగలంబు తోడ నిల సల్పుతోడను  పరుని యాలితోడ పతితుతోడ  సరసమాడుటెల్ల చావుకు మూలము  విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము నిప్పుతోను, నీచుడితోనూ, పాపాత్ముడితోను, పరస్త్రీ తోనూ పరిహాసమాడడం తన ప్రాణానికి హాని కలిగిస్తుంది.

    Read more

  • ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె

    ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె  జీవబుద్ధి వలన జీవుడయ్యె  మోహబుద్ధిలయము ముందర గనుగొను  విశ్వదాభిరామ వినురమేమ! తాత్పర్యము ఆత్మ అంతా తానే అయినా జీవిస్తూ ఉండడంవల్ల వల్ల జీవుడయ్యాడు. జీవుడికి సహజమైన మోహాలు లోభాలు సహజం. వయస్సు ముదురుతన్న కొద్దీ మోహం ఎక్కువ అవుతుంది.

    Read more