Latest posts

  • గుజరాత్ లో మూడవ సారి నరేంద్రమోడీ ఘన విజయం

    గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ వూహించిన విధంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి, భాజపా నేత మోడీ విజయబావుటా ఎగురవేశారు. ఆయన ఒంటి చేత్తో భాజపాను మూడోసారి అధికారంలోకి తీసుకురాగలిగారు. ఈ గెలుపుతో ఆయన హ్యాట్రిక్‌ సాధించినట్త్లెంది. వరుసగా మూడోసారి ఆయన గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 182 స్థానాల్లో 121 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యం సాధించారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించి, విజయఢంగా మోగించిన మోడీని.. కాంగ్రెస్‌ వ్యూహాలు అడ్డుకోలేకపోయాయి.…

    Read more

  • వర్ధమాన కథానాయకుడు భరత్‌ అలియాస్‌ యశోసాగర్‌(26) మృతి

    కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ధమాన కథానాయకుడు భరత్‌ అలియాస్‌ యశోసాగర్‌(26) మృతి చెందారు. బెంగళూరుకు 120 కి.మీ. దూరంలో నాలుగో నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు కల్వర్టు గోడను ఢీకొట్టింది. ముంబయినుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న విశ్వనాథరెడ్డి(23), ముందు సీట్లో కూర్చున్న యశోసాగర్‌కు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2012-12-19

    Read more

  • ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌

    1817, ఆగస్ట్‌ 13. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్‌. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు. పేరు.. ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని.. శాస్త్రీయతా అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే…

    Read more

  • హైదరాబాద్‌-కర్ణాటకకు ప్రత్యేక హోదా

    హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి విడిపోయి కర్ణాటకలో విలీనమైన హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించింది. ఈ మేరకు రాజ్యాంగంలో 371జే అధికరణం చేరుస్తూ 118వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ సవరణ బిల్లుకు మంగళవారం లోక్‌సభ 343-0 ఓట్ల తేడాతో ఆమోద ముద్రవేసింది. దీనివల్ల గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు లభిస్తాయి. గవర్నర్‌ హైదరాబాద్‌-కర్ణాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకొనే వెసలుబాటు కలుగుతుంది. గుల్బర్గా, బీదర్‌, రాయచూరు, కొప్పళ్‌, యాద్గిరి, బళ్లారి జిల్లాలతో కూడిన హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతాభివృద్ధికి…

    Read more

  • బేగంపేట విమానాశ్రయంలో కాలి బూడిదైన ప్రభుత్వ హెలికాప్టర్‌, ఆరు శిక్షణ విమానాలు.

    బేగంపేట విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ హెలికాప్టర్‌ ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో పాటు ఆరు శిక్షణ విమానాలు కాలిబూడిదయ్యాయి. విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉన్న ఏపీ ఏవియేషన్‌ అకాడమీలోని హ్యాంగర్లలో (విమానాలు, హెలికాప్టర్లుంచే చోటు)ని ఒకదాంట్లో మంటలు అంటుకున్నాయి. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ శబ్దంతోపాటు మంటలు ఎగిసిపడ్డాయి. 2012-12-18

    Read more

  • 1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించాడు.

    2012-12-19

    Read more

  • ప్రజా పాటల త్యాగయ్య “గరిమెళ్ళ సత్యనారాయణ”

    "మాకొద్దీ తెల్ల దొరతనం" అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి… "దండాలు దండాలు భారత మాత" అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి…

    Read more

  • 1971: బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది.

    2012-12-18

    Read more

  • ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ కవి “గరిమెళ్ళ సత్యనారాయణ” గారి వర్దంతి

     గరిమెళ్ళ 1952 డిసెంబర్ 18వ తేదీన స్వర్గస్తులైనారు 2012-12-18

    Read more

  • తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు “మాధవపెద్ది సత్యం” గారి వర్దంతి

    మాధవపెద్ది సత్యం (1922 – 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ మరియు సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.   2000, డిసెంబర్ 18న స్వర్గస్తులైనారు. 2012-12-18

    Read more