Latest posts
-
మాధవపెద్ది సత్యం
రంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది పద్యం ఆయన గళంలో వయ్యారాలు పోయింది దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు…. ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసింది ఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి …… ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయింది పాట ఆయన గొంతులో ఒదిగిపోయింది పాడుతున్నది పాత్రలేమోననిపిస్తుంది పాడుతున్నది పాత్రదారులేమోననిపిస్తుంది వారిలో ఆయన స్వరం పరకాయ ప్రవేశం చేస్తుంది ఆయన పద్యంలో భావం తొణికిసలాడుతుంది ఆయన పాటలో రాగం అలవోకగా అమరిపోతుంది ఆయన కంఠంలో…
-
ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త “సూర్యకాంతం”
సూర్యకాంతం, ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె పాత్రలు అంతగా ప్రజా జీవితంలోకి చొచ్చుకుని పోయాయి. సూర్యకాంతం తెర మీద పాత్రలను ఎంత అద్భతంగా పోషించేవారో.. నిజ జీవితంలో అంతే ఉన్నతంగా జీవించేవారు. సూర్యకాంతం, ఈ పేరు వింటేనే ఆంధ్రా కోడళ్ళకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈ నాటికీ సాహసించరు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే ‘అమ్మో – ఆవిడా? సూర్యకాంతమే!’ అని అందరూ…
-
ప్రముఖ తెలుగు చలనచిత్ర నటీమణి శ్రీమతి సూర్యాకాంతం గారి వర్దంతి
తెలుగు చలనచిత్ర నటీమణి సూర్యకాంతం గారు 17 డిసెంబర్, 1996న స్వర్గస్థులయ్యారు 2012-12-17
-
ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి వర్దంతి
ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు 1957, డిసెంబర్ 17న స్వర్గస్థులయ్యారు. 2012-12-17
-
అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభం
చెన్నై, డిసెంబర్ 13: ‘చెన్నై అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని తమిళనాడు సమాచారశాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ గురువారం ప్రారంభించారు. ఇండో సినీ అప్రిసియేషన్ ఫౌండేషన్ (ఐసీఏఎఫ్), తమిళ సినిమా కలిసి సంయుక్తంగా గత పదేళ్లుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. 2012-12-13
-
అమెరికా పాఠశాలలో కాల్పులు: 20 మంది మృతి
అమెరికా: అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం న్యూటౌన్‌లోని శాండీ హుక్ ఎలమెంటరీ పాఠశాలలో ఓ అగంతుకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 12మంది విద్యార్థులతో సహా మొత్తం 20 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. కాల్పుల సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకుని పాఠశాల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాన్‌బరీ మేయర్ మార్క్ బౌటెన్ తెలిపారు. పాఠశాలలో…
-
కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించిన చంద్రబాబు పాదయాత్ర
ఆదిలాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం బాదన్‌కుర్తి వద్ద కరీంనగర్ జిల్లాలో ప్రవేశించింది. ఆదిలాబాద్ జిల్లాలో 9 రోజుల పాటు సాగిన పాదయాత్రలో చంద్రబాబు 138 కి.మీ. నడిచారు. బాదన్‌కుర్తి గోదావరి వంతెన వద్ద జిల్లా అధ్యక్షుడు గోడెం, ఎంపీ రాథోడ్ చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం చంద్రబాబు ఆదిలాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించారు. 2012-12-15
-
ఈ ఏడాది వార్తల్లో వ్యక్తి.. కేజ్రీవాల్: యాహూ
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది వార్తల్లో వ్యక్తుల జాబితాలో అరవింద్ కేజ్రీవాల్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆన్‌లైన్‌లో అత్యధికంగా శోధించిన (సెర్చ్) ప్రముఖ వ్యక్తిగా శృంగార తార సన్నీ లియోన్ తొలిస్థానంలో నిలిచినట్లు ప్రముఖ సెర్చింజిన్ యాహూ గురువారం వెల్లడించింది. కేజ్రీవాల్ తర్వాతి స్థానాల్లో వరసగా గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ, పాక్ సాహస బాలిక మలాలా, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, రాబర్ట్ వాద్రాలు ఉన్నారు. 2012లో సైఫీనా (సైఫ్, కరీనా) జంట పెళ్లి సమాచారాన్ని…
-
త్వరలో ప్లాస్టిక్ నోట్లు
న్యూఢిల్లీ: ఎక్కువ కాలం మన్నేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం గురువారం పార్లమెంటుకి తెలిపింది. అందుకోసం పదిలక్షల రూపాయిల విలువైన రూ.10 నోట్లను సిద్ధం చేసినట్లు పేర్కొంది. 2012-12-13
-
నేడు భారత్‌కు రానున్న పాక్ హోంమంత్రి
న్యూఢిల్లీ : పాకిస్థాన్ హోం శాఖ మంత్రి రెహ్మాన్ మాలిక్ నేడు భారత్‌కు రానున్నారు. ఈ సాయంత్రం ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారుల చర్చల అనంతరం కేంద్ర హోంమంత్రి షిండేతో కలిసి మాలిక్ భారత్-పాక్ విసా సరళీకరణ ఒప్పందంపై సంయుక్త ప్రకటన చేయనున్నారు. అనంతరం షిండే ఇచ్చే విందులో పాల్గొననున్నారు. రేపు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో మాలిక్ భేటీ కానున్నారు. లోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్, జాతీయ భద్రతసలహాదారు శివ్‌శంకర్ మీనన్‌తో కూడా సమావేశం కానున్నారు. 2012-12-14