Latest posts
-
ఉన్నమ్మ గాదె తీసేసరికి లేనమ్మ ప్రాణం పోయిందనట్టు
కొంతమంది దాతలు ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా అర్థులను తమ చుట్టూ విపరీతంగా తిప్పుకొంటుంటారు. అలా తిరగలేక కొంతమంది విసిగి వేసారిన సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పూర్వం వడ్లను గాదెల్లో భద్రపరిచేవారు. ఎవరైనా వెళ్లి అడిగినప్పుడు ఆ గాదెల్లోని ధాన్యాన్ని తీసి ఇస్తుండేవారు. దాని ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. దాంతోపాటుగా చేసి పెడతానన్న పని చెప్పిన సమయానికి చేయక ఇంకొంత మంది తిప్పుకొంటుంటారు. అలాంటివారు ఎదురైనప్పుడు కూడా ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.…
-
వెతకబోయిన తీర్థం ఎదురైనట్టు
'వెతకబోయిన తీగ కాలికే తగిలినట్టు' అనేది దీనికి సమానార్థకమైన సామెత. పరిస్థితులు సంపూర్ణంగా అనుకూలించడం, కాలం కలసిరావడం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. పూర్వకాలం పుణ్యం కోసం దేశంలోని ఎక్కడెక్కడో ఉన్న తీర్థక్షేత్రాలను అన్వేషించి అక్కడికి వెళ్లి తీర్థస్నానం చేసి వస్తూఉండేవారు. అలాంటి రోజులలో ఆవిర్భవించిన జాతీయం ఇది. ఓ వ్యక్తి ఒక తీర్థక్షేత్ర మహిమను గురించి విన్నాడట. ఆ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నతంలోనే తన ఎదురుగా ఉన్నది తాను…
-
ఆపద మొక్కులు, సంపద మరపులు అన్నట్టు
మనుషుల మనస్తత్వాలను, ప్రవర్తనల తీరును విశ్లేషిస్తుంటాయి జాతీయాలు. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఆపదలొచ్చినప్పుడు ఆదుకోమని వేడుకొంటుంటారు చాలా మంది. దయతలచి ఎవరైనా ఆదుకుంటే ఆ కష్టాల నుంచి బయటపడి ఆనందాన్ని అనుభవిస్తూ మేలు చేసిన వారిని మరచిపోయేవారు చాలామంది ఉంటారు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. 'అప్పుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు బతిమలాడితే సహాయం చేశాను. ఆపద మొక్కులు సంపద మరపులు అన్నట్టు నాలుగు డబ్బులు కనిపించేసరికి నన్ను మరచిపోయాడు' అనే…
-
గొర్రెలకు తోడేలు కాపరి అన్నట్టు
సంరక్షణ బాధ్యతలను అమాయకంగా నమ్మి మోసగాళ్లు, శత్రువులకు అప్పగించిన సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గొర్రె తోడేలుకు ఆహారం. అలాంటిది ఆ తోడేలును గొర్రెలకు కాపలాగా ఉంచితే ఏం జరుగుతుందో ఎవరైనా వూహించవచ్చు, ఈ వూహ ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. ''విషయమంతా ఆయన దగ్గర చెప్పటమంటే గొర్రెలకు తోడేలును కాపలాగా ఉంచినట్టే'' అనేలాంటి ప్రయోగాలున్నాయి.
-
కదిపితే కందిరీగల తుట్టె
ఒక కందిరీగ శబ్దం చేస్తూ చుట్టూ తిరిగినా, లేదూ కుట్టినా భరించటం కష్టం. అలాంటిది కందిరీగల తుట్టెను కదిపితే అన్ని కందిరీగలు మీదపడి కుడితే ఎలా ఉంటుందో వూహించవచ్చు. కందిరీగల తుట్టెను కదపనంతవరకూ ఎలాగో ఒకలాగా ఆ ప్రదేశం నుంచి తప్పించుకుపోవచ్చు. కదిపామంటే పెనుప్రమాదమే. ఇలాంటి కందిరీగల తుట్టెతో క్రోథ స్వభావులను వూరకనే కయ్యానికి కాలు దువ్వే వారిని పోల్చి చెబుతుంటారు. అలాంటి వారిని గమనించి కదిలించకుండా పక్కకు తప్పుకొని పోవటమే మేలని పెద్దలు సూచించే సందర్భాలలో…
-
అందని పూలు దేవుడికి అర్పణం అన్నట్టు
కొంతమంది స్వార్థపరులు, అవకాశవాదుల మనస్తత్వాన్ని వివరించే జాతీయం ఇది. అందని ద్రాక్షపండ్లు పుల్లన అనే లాంటిదే ఇది. తనకు దక్కనిది మంచిది కాదన్నది అందని ద్రాక్షపండ్లు పుల్లన అనే జాతీయంలో కనిపించే భావం. అయితే ఈ జాతీయంలో తనకు దక్కనివాటిని తనవిగానే భావించుకుంటూ వాటిని ఏదో ఒక మంచి పనికి ఉపయోగించామని గొప్పలు చెప్పుకొనే వారి మనస్తత్వం తీరు కనిపిస్తుంది. చెట్టుపైన చిటారుకొమ్మన చక్కగా పువ్వులు పూసి ఉన్నాయట. వాటిని కొయ్యటానికి ఓ వ్యక్తికి వీలు కుదరలేదు.…
-
అన్నం అడిగిన వాడికి సున్నం పెట్టినట్లు
సమాజంలో నిరంతరం ద్రోహచింతనతో ఉండేవారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఉపకారం చేయమని అడగటానికి వెళ్ళిన వ్యక్తికి ఉపకారం చేయకపోగా చేస్తున్నట్లు నటించి అపకారం చేసి అవమానిస్తుంటారు కొందరు. అదెలాంటిదంటే అన్నం పెట్టిమని అడిగిన వ్యక్తికి సున్నం పెట్టడం లాంటిదే. ఈ భావనతోనే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. '' వాడి దగ్గరకు అనవసరంగా వెళ్ళి చెయ్యి చాపాను. అన్నం పెట్టమని అడిగితే సున్నం పెట్టిన తీరులో ఉంది వాడి ప్రవర్తన'' అనేలాంటి ప్రయోగాలున్నాయి.
-
ఆదివారం అందలం ఎక్కనూ లేదు…
'ఆదివారం అందలం ఎక్కనూ లేదు, సోమవారం జోలె కట్టనూ లేదు' అన్నది జాతీయం. సంపదలున్నప్పుడు ముందూ వెనుకా చూడకుండా భోగాలను అనుభవిస్తుంటారు కొంతమంది. ఆ సంపదలు కరిగిపోయాక దుర్భరంగా అప్పుచేస్తూనో, యాచిస్తూనో తిరుగుతుంటారు. ముందుచూపులేనితనానికి ఈ ప్రవర్తన ఓ ఉదాహరణ. అలా కాకుండా జీవితంలో ఎప్పుడూ ఒకే స్థితిలో ఆనందంగా కాలం గడుపుతున్నామని చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. 'ఆయన ముందు చూపున్న మనిషి. ఆదివారం అందలం ఎక్కనూ లేదు, సోమవారం జోలె కట్టనూ…
-
నరం లేని నాలుక…
నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందన్నది జాతీయం. అంటే మాట నిలుపుకోలేకపోవటం, ఇప్పుడు చెప్పింది మరికాసేపటికి కాదనటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. నాలుక అనేది మాటకు ప్రతీకగా, నరం అనే దాన్ని పటుత్వానికి గుర్తుగానూ చెబుతారు. ఈ భావంతోనే మాటమీద పట్టులేకపోవడం, మాట నిలుపుకోలేకపోవటం అనే అర్థాలొచ్చాయి. 'వాడిది నరం లేని నాలుక. వాడి మాటను నమ్మి మోసపోవద్దు' అనే లాంటి ప్రయోగాలున్నాయి.
-
జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా అన్నట్టు
కోపంతో, కసితో దుర్మార్గులు అనుకొన్నవారిని, వారి సంతానాన్ని దూషించే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. జిల్లేడు చెట్టుకు జిల్లేడు పూలే పూయటం ప్రకృతిసిద్ధంగా సహజంగా జరిగే పని. జిల్లేడు పూలను మల్లెపువ్వుల్లాగా ఎవరూ అంతగా ప్రేమించరు. మల్లెపువ్వును స్వచ్ఛతకు మారుపేరుగా కూడా చెబుతుంటారు. జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా అనంటే అది జరిగేపని కాదు. ఈ జాతీయంలో జిల్లేళ్లను దుర్మార్గులుగా, మల్లెపువ్వులను మంచితనానికి ప్రతీకలుగా భావించటం కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఈ జాతీయం అవతరించింది. 'జిల్లేళ్లకు మల్లెలు…