Latest posts

  • గుడిసెకు చాందినీ అన్నట్టు

    అసంబద్ధమైన వ్యవహారం, అనవసరమైన అలంకారం అనే అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. చాందినీలను గొప్పగొప్ప అలంకారాలకు గుర్తుగా చెబుతారు. అలాంటి ఎంతో సుందరమైన చాందినీ చక్కటి భవనం ముందుంటే ఆ భవనపు అందం ఇనుమడిస్తుంది. ఆ చాందినీ వేసినందుకు సార్థకత చేకూరుతుంది. అలాకాక ఏదో చిన్న గుడిసె ముందు అంత భారీ అందమైన చాందినీని వేస్తే నిరర్థకంగా అనిపిస్తుంది. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.   సేకరణ: ఈనాడు.నెట్

    Read more

  • గురువుకు తిరుమంత్రం చెప్పినట్లు

    కొంతమంది అన్ని విషయాలలోనూ తామే గొప్ప అని భావించుకొంటుంటారు. అలాంటివారు తమకంటే గొప్పవారి దగ్గర అల్పమైన తమ గొప్పతనాలను ప్రకటించుకొంటున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంటుంది. మంత్రజపం, సాధన చేయటంలో గురువు ఎప్పుడూ ముందడుగులోనే ఉంటాడు. కానీ ఓ శిష్యుడు తాను గురువును మించిన వాడినని భావించుకొంటూ ఆ గురువుకే మంత్రోపదేశం చేయబోయాడట. ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఎదురైనప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

    Read more

  • తేనె పోసి పెంచినా వేపకు చేదుపోనట్టు

    ఎంతగా నీతులు బోధించినా మనసు మారని దుర్మార్గులను గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. వేపకు చేదు సహజ లక్షణం. నీళ్లకు బదులు తేనె పోసి ఆ చెట్టును పెంచినా చేదు పోయే అవకాశం లేదు. అలాగే దుష్ప్రవర్తన అనే సహజ లక్షణం ఉన్న వారిని ఎంతగా మంచిగా పెంచాలని చూసినా మారరని పెద్దలు విసిగిపోయి మాట్లాడే సందర్భాలలో ఈ జాతీయం వినిపిస్తుంటుంది.   సేకరణ: ఈనాడు.నెట్

    Read more

  • అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం వూడిపోయినట్టు

    మేలు జరుగుతుందని ఆశపడినప్పుడు అనుకున్న మేలు జరగకపోగా మరికొంత కీడు వచ్చిపడ్డ సందర్భాలలో ఈ జాతీయప్రయోగం కనిపిస్తుంది. ఓ వ్యక్తి దరిద్రంతో బాధపడుతూ తనకు కావలసిన అన్నం, వస్త్రాలు ఎవరో దానం చేస్తానంటే వెళ్ళాడట. కానీ అక్కడి పరిస్థితి మారిపోయి ఆ ప్రదేశంలో ఎదురైన కొంతమంది ఉన్న వస్త్రాన్ని కూడా లాక్కున్నారట. ఈ భావన ఆధారంగానే లాభం వస్తుందనుకున్నప్పుడు ఆశించిన లాభం రాకపోగా అనుకోని నష్టం ప్రాప్తించినప్పుడు కూడా ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

    Read more

  • ధనమొస్తే దాచుకోవాలి.. రోగం వస్తే చెప్పుకోవాలి

    సమాజంలో మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తెలియచెప్పేందుకు ఈ జాతీయం ఉపకరిస్తుంది. ధనం ఉంది కదాని ముందూ వెనుకా చూసుకోకుండా ఖర్చుపెట్టకూడదు… దాచుకోవాలి. అలాగే రోగం వస్తే వైద్యుడికి చూపించుకోకుండా చెప్పకుండా ఉండకూడదు. చెప్పి తగిన మందు తీసుకుని రోగాన్ని తగ్గించుకోవాలి అనే విషయ సూచనకు ఈ జాతీయం ఉపకరిస్తుంది.

    Read more

  • ఆరు రాజ్యాలు జయించవచ్చును కానీ…

    ఆరు రాజ్యాలు జయించవచ్చును కానీ అల్లుణ్ణి జయించలేమన్నది జాతీయం. వివాహ వ్యవస్థలో బాగా బెట్టుచేస్తూ గర్వాహంకారాలను ప్రదర్శిస్తూ ఉండే అల్లుళ్లతో విసిగి వేసారిన వారు మాట్లాడుకునే సందర్భాలలో ఈ జాతీయం వినిపిస్తుంది. అల్లుడు అనగానే అంతకు ముందుదాకా లేని గర్వాన్ని తెచ్చిపెట్టుకొనే సంకుచిత మనస్తత్వం ఉన్నవారు సమాజంలో చాలాచోట్ల కనిపిస్తుంటారు. వారిని సంతృప్తిపరచటం తమవల్ల కావటం లేదని అనుకొనే సందర్భాలలో ఇది ప్రయోగంలో కనిపిస్తుంది.   సేకరణ: ఈనాడు.నెట్

    Read more

  • కసవులో పనసకాయ తరగినట్టు

    చెడు పనులకు, దుర్మార్గాలకు అవకాశం ఇవ్వటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పనసకాయ తరిగేటప్పుడు దానికుండే సహజమైన జిగటవల్ల చుట్టూ ఉన్నవి అతుక్కోవటానికి అవకాశం ఉంది. తినటానికి ఉపయోగించే ఆ పనస కాయను పరిశుభ్రమైన ప్రదేశంలో తరగటం మేలు. కసవున్నచోట ఆ కాయను తరిగితే దుమ్మూధూళి అంటుకొని అది తినటానికి పనికిరాకుండా పోతుంది. తినటానికి పనికిరాకుండా చెయ్యటమనేది దుర్మార్గమైన విషయం. దుర్మార్గాలకు అవకాశం ఇవ్వటమనే అర్థం. ఈ భావనతోనే ఈ జాతీయం ద్వారా ప్రయోగంలోకి…

    Read more

  • వూగే పంటి కింద రాయి పడ్డట్టు

    అసలే కష్టాలలో ఉన్నప్పుడు దానికి తోడు మరిన్ని కష్టాలు వచ్చిపడి భరించలేని స్థితి ఎదురైన సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. వూగుతూ ఉన్న పన్ను బాధను కలిగిస్తూ ఉంటుంది. ఆ బాధను ఎలాగో ఒకలాగా భరిస్తూ ఆకలిని చల్లార్చుకోవటం కోసం ఆహారం తింటానికి ప్రయత్నిస్తే ఆ వూగే పంటికిందే రాయి పడితే ఎంత బాధో ఎవరైనా వూహించవచ్చు. అంతే బాధను రెట్టించిన కష్టకాలంలో పొందటం అనే విషయాన్ని గురించి వివరించేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

    Read more

  • అతిచేస్తే మతి చెడుతుందన్నట్టు

    ఏ పనైనా ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. హద్దులను పాటించాలి. అలా కాకపోతే అన్నీ అనర్థాలేనని హెచ్చరించే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. సంస్కృతంలో కూడా అతి సర్వత్రా వర్జయేత్‌ అనే సూక్తి ఉంది. మితిమీరి ప్రవర్తించటమనేది మానసికంగా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది అని హెచ్చరించేందుకు ఈ జాతీయం ఉపకరిస్తుంది.

    Read more

  • సంగీతానికి గాడిద, హాస్యానికి కోతి అన్నట్టు

    సరసాలు ఆడేటప్పుడు, చమత్కారాలు మాట్లాడేటప్పుడు, వరసైన వారిని గురించి హాస్యంగా మాట్లాడేటప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. వినటానికి ఇంపుగాలేని గొంతును గాడిద గొంతుతో పోల్చిచెప్పటం, అంధవిహీనతను కోతిరూపంతో పోల్చిచెప్పటం ఓ అలవాటుగా వస్తోంది. ఈ అలవాటును ఆధారంగా చేసుకుని ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది.

    Read more