Latest posts
-
కోడికి గజ్జెలు కడితే…
కోడికి గజ్జెలు కడితే కుప్ప కుళ్లగించదా అన్నది జాతీయం. కసువు కుప్పలను కుళ్లగించి పొట్టపోసుకోవటం కోడి జీవలక్షణం. ఒకాయన ఓ కోడిని ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాడట. అలా తన పెంపుడుకోడి కసువు కుప్పలను కుళ్లగించటం ఆయనకు బాగాలేదనిపించింది. దాన్ని చక్కగా అలంకరించి కాళ్ళకు గజ్జెలు కడితే ఆ అలంకరణల చక్కదనాన్ని, గజ్జెల గొప్పదనాన్ని చూసుకొంటూ అసహ్యకరమైన కసువు కుప్పలకు కుళ్లగించకుండా ఉంటుందనుకొని ఆ కోడి కాళ్లకు గజ్జెలు కట్టాడట ఆ వ్యక్తి. కానీ కోడి తన సహజమైన…
-
అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టవచ్చు
మనిషి సంఘజీవి. తోటిమనిషి సహాయ సహకారాలు అతడికి ఎప్పుడూ అవసరమవుతాయి. ఒంటరిగా కన్నా మరొకరి తోడుతో తన పనులను చక్కపెట్టగలడు. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. అండ అంటే ఆదుకొనేవారని అర్ధముంది. అన్ని విధాలా ఆదుకొనేవారుంటే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా చెయొచ్చని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
-
ఎలుగు సలుగెరిగిన పని
బాగా నైపుణ్యం ఉన్న పనివాళ్లు చేసే పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఇది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారి మధ్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.పొలం దున్నటానికి నాగలిని ఉపయోగిస్తుంటారు. ఆ నాగలికి దుంపను అమర్చటంలోనే అసలైన పనితనమంతా ఇమిడిఉంది. సరిగా అమర్చకపోతే నేలను దున్నటం వీలుకాదు. దుంప వదులుగా ఉన్నా బాగా ముందుకు బిగిసి ఉన్నా రెండూ ఇబ్బందికరంగానే ఉంటాయి. ఎలుగు ఎక్కువైతే నాగలి కర్ర నేల మీద ఆనదు. కనుక ఎలుగు…
-
ఈ జొన్న కూటికా ఈ స్తోత్ర పాఠమన్నట్టు
కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కని సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. జొన్న అన్నం కన్నా వరి అన్నం గొప్ప అని భావించే రోజుల్లో ఇది ఆవిర్భవించింది. ఒక వ్యక్తి ఒక సంపన్నుడి దగ్గరకు వెళ్లి స్తోత్రం చేశాడట (పొగిడాడట). ఎంతోసేపు స్తోత్రం చేసిన తర్వాత సంపన్నుడు అంతావిని ఆ పొగిడిన వ్యక్తికి కొద్దిగా జొన్న అన్నం మాత్రమే పెట్టాడట. తాను పొగిడిన పొగడ్తకు సంపన్నుడు పొంగిపోయి వరి అన్నంతో పాటు అనేక పిండివంటలు పెడతాడని భావించిన…
-
నీరులేని పైరు నూనె లేని జట్టు
కొన్ని జాతీయాలు ఆరోగ్య సూత్రాలను నేర్పేవిగా కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఇదొకటి. పైరు చక్కగా ఏపుగా పెరిగి పంట పండాలంటే నీరు బాగా ఉండాలి. అలాగే మనిషికి అలంకారంగా ఉండే నెత్తిమీది జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే దానికి నూనె రాస్తుండాలి. అని పెద్దలు పిల్లలకు చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. సేకరణ: ఈనాడు.నెట్
-
ఆ ఇంటికి తలుపు లేదు
ఆ ఇంటికి తలుపు లేదు ఈ ఇంటికి గడియ లేదు అన్నట్టు అన్నది జాతీయం. అంటే ఒకదానికంటే మరొకటి మరీ నాసి రకమైనది అనే అర్థంలో ఈ జాతీయం వాడుతుంటారు. సాధారణంగా ఇంటికి తలుపు రక్షణ కల్పిస్తుంది. అలాంటిది ఓ ఇంటికి ఉన్న తలుపులకు గడియలేదట. అయినా వారు తలుపులను దగ్గరగా వేసుకొని కొద్దిపాటి రక్షణనైనా పొందేందుకు వీలుంది. కానీ మరో ఇంటికి అసలు తలుపులే లేవట అంటే ఒకదాని కన్నా మరొకటి తీసివేత వ్యవహారమని చెప్పవచ్చు.…
-
కాలరాయటం
అణిచివేయటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కాలితో తన్నటం అన్నా, కాలును ఉపయోగించి ఏదైనా వస్తువును దూరంగా విసిరేయటం అన్నా అవమానం, అసహ్యం లాంటి వాటికి ప్రతీకలుగా కనిపిస్తాయి. అంటే తనకు గిట్టని వాటిని అవమానించేందుకు మనిషి కాలును ఉపయోగిస్తుంటాడు. ఈ భావానికి అనుగుణంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. కొన్నికొన్ని చోట్ల నీతినియమాలను, హక్కులను, అధికారాలను అణిచివేశారు అని చెప్పే సందర్భాలలో కూడా ఈ జాతీయం కనిపిస్తుంది. 'ఆ వర్గం వారి హక్కులను కాలరాస్తున్న…
-
అప్పు తీసుకుంటే చెప్పు చేతలలో ఉండాలి
పూర్వకాలం నాటి పెద్దలు అనవసరంగా అప్పులు చేయవద్దని పిల్లలను హెచ్చరించే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. అప్పు నిప్పు అని కూడా అంటుంటారు. అప్పుంటే ముప్పు అని చెబుతుంటారు. ఇదంతా ఆర్థికపరంగా జాగ్రత్తపడమని, అనవసరమైన ఖర్చులు చేసి అప్పులపాలు కావద్దని తెలియచెప్పేందుకే ఒకరి దగ్గర అప్పు తీసుకుంటే ఆత్మాభిమానాన్ని వదులుకొని చెప్పిందే చేయాల్సి వస్తుందన్నది ఈ జాతీయం వెనుక ఉన్న భావం. అప్పు తీసుకొని అభివృద్ధి పనులకు ఉపయోగిస్తూ సక్రమంగా అప్పు తీర్చేవారికి ఇది అన్వయించకపోయినా ముందు…
-
మెరుపు దీపమవుతుందా అన్నట్టు
తాత్కాలికమైనవి ఏవీ శాశ్వతమైన ఆనందాన్ని లేదా ప్రయోజనాలను చేకూర్చలేవని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఆకాశంలో క్షణకాలంపాటు మెరిసే మెరుపులు కాసేపు మంచి కాంతినే ఇస్తాయి. ఇంకా చెప్పాలంటే మామూలు దీపాలకన్నా ఎక్కువ కాంతినే ఇస్తాయి. అంత మాత్రం చేత ఆ మెరుపులను దీపాలకు ప్రత్యామ్నాయంగా వాడాలంటే సాధ్యమయ్యే పనికాదు. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. సేకరణ: ఈనాడు.నెట్
-
వేసిన వత్తికి పోసిన చమురుకు సరిపోయిందన్నట్టు
ఆదాయ వ్యయాలు సరిచూసుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. అలాగే పడిన శ్రమకు దక్కిన ఫలితానికి సరిపోయిందని చెప్పే సందర్భాలలో కూడా ఈ జాతీయ ప్రయోగం వాడకంలో ఉంది. ప్రమిదలో దీపం వెలిగించేందుకు వేసిన వత్తి, పోసిన చమురు సరితూకంగా ఉన్నాయని చెబుతూనే అంతరార్థంగా ఆదాయ వ్యయాలను వత్తి, చమురులతో పోల్చటం ఇక్కడ విశేషం. సేకరణ: ఈనాడు.నెట్