Latest posts
-
ఏనుగునెక్కి కుక్క అరుపులకు దడిచినట్టు
ఏనుగును ఉత్తమ జంతువుగా, కుక్కను నీచ జంతువుగా చెబుతారు. అలాగే ఏనుగునెక్కటం అంటే కీర్తిని పొందటంతో సమానంగా కూడా చెబుతారు. ఏనుగు వీధిలో వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి అని ఓ సామెత ఉంది. అంటే ఉత్తములు ఏదైనా పని చేస్తున్నప్పుడు నీచులు వంకలు పెడుతుంటారన్నది దీని అర్థం. ఇదే తీరులో కీర్తిని సంపాదించినప్పుడు, మంచి పనిని చేస్తున్నప్పుడు నీచులు, దుర్మార్గులు అనే మాటలను విని దడుచుకోకూడదు. ధైర్యంతో ముందుకు సాగుతూనే ఉండాలి అని తెలియచెప్పే కథా సందర్భంలో…
-
ఎంత పండినా కూటిలోకే…
ఎంత పండినా కూటిలోకే, ఎంత ఉండినా కాటిలోకే అన్నట్టు అన్నది జాతీయం. కొన్ని జీవన సత్యాలు ఇలా జాతీయాలుగా అవతరించాయి. వైరాగ్య సంబంధమైన భావనలను ప్రకటించేటప్పుడు ఇలాంటి జాతీయాలను వాడుతుంటారు. పంట ఎంత గొప్పగా పండినా, ఎంత ఎక్కువగా పండినా దాన్ని అలా కలకాలం నిల్వ ఉంచరు. ఆహార పదార్థంగా ఆ పంట మారాల్సిందే. అలాగే నూరేళ్లు బతికినా అంతకంటే ఎక్కువ బతికినా, అంత ఎక్కువకాలం బతికాడని మరణించాక అతడిని ఇంట్లో ఉంచుకోరు. కాటికి పంపాల్సిందే. అంటే…
-
పిండీ, బెల్లమూ ఇచ్చి పిన్నమ్మా నీ ప్రసాదం అన్నట్టు
సొమ్మంతా ఒకరి చేతికిచ్చి కొద్దిపాటి ఖర్చులకు కూడా వారిని అడగాల్సిన దుస్థితిలో ఉంటుంటారు కొందరు. ఇది తెలివితక్కువ వ్యవహారం. సొమ్మంతా ఇతరులకు ఇచ్చి కావలసినది యాచించటమంటే బుద్ధిలేనితనంకిందే లెక్క. పిండి, బెల్లం రెండూ ఉంటే చలిమిడి, బూరెలలాంటి పిండివంటలు చేసుకొని తినొచ్చు. అలాకాక ఆ బెల్లం, పిండి వేరొకరికి ఇచ్చి వారు పెట్టిందే ప్రసాదంగా తినటమంటే ఎలాంటిదో సొమ్ము ఒకరికి ఇచ్చి చిన్నచిన్న ఖర్చులకు వారిని అడుగుతూ వారి దయాధర్మాల మీద ఆధారపడటం అలాంటిదేనని ఈ జాతీయం…
-
పూరిగుడిసెకు పందిరి మంచమా అన్నట్టు
స్థాయిని మరచి వ్యవహరించటం, ఆర్థిక స్థోమతకు మించి ఆలోచించటం అనే అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పెద్దపెద్ద భవనాలు, భవంతులలో ప్రత్యేకంగా గదులుండటం, వాటిలో అందంగా పందిరి మంచాలుండటం బాగా ఉంటుంది. కానీ చిన్న పూరి గుడిసెలో పెద్ద పందిరి మంచాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే లోపల చోటు సరిపోకపోగా చూడటానికి కూడా బాగా ఉండదు. కనుక స్థాయికి తగ్గట్టుగా మాత్రమే ఏ వ్యవహారాలైనా సాగాలని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
-
అగ్గిపక్కన వెన్న.. ఆడవారి కోపం ఒకటేనన్నట్టు
మానవ స్వభావాల విశ్లేషణను కూడా మన జాతీయాలు తమలో పొందుపరచుకొని ముందు తరాలకు అందిస్తుంటాయనటానికి ఈ జాతీయం ఒక ఉదాహరణ. సృష్టిలో సున్నితమైన మనస్తత్వంగల స్త్రీ మానవీయతను ప్రకటిస్తుంది. పురుషుడికి కోపం వస్తే ప్రతీకారం తీర్చుకొనేదాకా వూరుకోడు. కానీ స్త్రీ అలాకాదు. ఆమె మనస్సు వెన్న. ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా, వేడి తగిలిన వెన్నలాగా ఆమె మనస్సు కరిగిపోతుంది అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
-
ఏకుతో తాకితే మేకుతో మొట్టినట్టు
చాలా అల్పమైన అపకారానికి భయంకరమైన శిక్షను విధించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఏకుతో ఎదుటి వ్యక్తిని తాకటమంటే ఎదుటి వ్యక్తికి శారీరకంగా ఏమాత్రం బాధను కలిగించే విషయం కాదు. కానీ చాలా అల్పమైన ఆ పనికి మేకుతో మొట్టాడట ఎదుటి వ్యక్తి. మేకుతో మొట్టడమంటే ఎంతగా బాధను కలిగిస్తుందో ఎవరైనా వూహించవచ్చు. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.
-
కోకలు వెయ్యి ఉన్నా కట్టుకొనేది ఒకటే
కొంతమంది తామెంతో భాగ్యవంతులమని విర్రవీగుతుంటారు. అలాంటివారి గర్వాన్ని నిరసిస్తూ చెప్పే జాతీయం ఇది. జాతీయాలు వాస్తవ పరిస్థితులను ఉదాహరణలుగా చూపి సంఘటనలను సందర్భాలను సమీక్షిస్తూ విమర్శిస్తుంటాయనటానికి ఇదొక ఉదాహరణ. పెట్టెనిండా కోకలున్నాయని ఒకామె తెగ గర్వపడసాగిందట. అన్ని కోకలుంటే అన్నిటినీ ఒకేసారి కట్టుకో చూద్దామని ఎదుటివారు అన్నారట. అది సాధ్యమయ్యే పనికాదు. అలాగే ఎన్ని సంపదలున్నా పొట్టపట్టినంత వరకు మాత్రమే ఎవరైనా తినగలరు. అవకాశం ఉన్నంతవరకు మాత్రమే ఎవరైనా ఏపనైనా చేయగలరు అనే విషయాన్ని తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు…
-
ఇంటివాణ్ణి లేపి దొంగ చేతికి కట్టె ఇచ్చినట్టు
నమ్మించి మోసం చేయటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఓ వ్యక్తి రాత్రి వేళ ఎదురింటిలోకి దొంగ వెళ్ళడం చూశాడట. చూసిన వాడు దొంగను పట్టుకొని బంధించే ప్రయత్నం చెయ్యక మెల్లగా ఎలాగో ఒకలాగా ఆ ఇంటివాణ్ణి నిద్రలేపి దొంగ ఇంట్లోకి వచ్చాడని, అతడిని ఎదుర్కోమని తాను సాయం ఉంటానని చెప్పి అంతలోనే దొంగ చేతికి కట్టె ఇచ్చి ఆ దొంగను ఇంటివాడి మీదకు వెళ్ళేలా చేశాడట. ఈ సంఘటనలోని భావం ఆధారంగా ఇలాంటివి…
-
కూడు వండటం గంజికోసమన్నట్టు
గంజి తాగటమనేది పేదరికానికి సూచికగా చెబుతారు. కొంతమంది తమకు అన్ని వనరులూ కావలసినంతగా ఉన్నా వాటిని అనుభవించలేక వృథా చేసుకొంటూ లేనివారిలాగానే ఉంటుంటారు. అదెలాగంటే అంతకు ముందుదాకా ఎప్పుడూ గంజి మాత్రమే దొరికేవారికి బియ్యం సరిపోయినంతగా లభించాయట. అయినా అన్నం వండి, ఆ అన్నం తినకుండా గంజి మాత్రమే తాగి పూర్వంలాగానే లేమితో బాధపడ్డారట. అదేమిటీ సరిపోయినంత కూడు (అన్నం) వండుకున్నారుగా అనంటే వండింది గంజి కోసమని చెప్పారట. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి…
-
అల్లుడికి బెట్టు ఇల్లాలికి గుట్టు
మన సంస్కృతీ సంప్రదాయాలలోని కొన్ని కొన్ని అంశాలను జాతీయాలు ప్రతిబింబిస్తుంటాయి. అటువంటి వాటిలో ఇదొక జాతీయం. అల్లుడు బెట్టుగా వ్యవహరిస్తుండాలని, ఇల్లాలు ఇంటిలో ఉన్న లొసుగులు బయటపడకుండా గుట్టుగా వ్యవహరిస్తుండాలని తెలియ చెబుతున్నట్లుంటుంది ఈ జాతీయం. మనుషులు ఎక్కడ ఎలా వ్యవహరిస్తుండాలో తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయం వాడటం కనిపిస్తుంది.